release day
-
ఫస్ట్ డే ఫస్ట్ షో.. వినూత్న ఆలోచనకు ఏపీ ఫైబర్ నెట్ శ్రీకారం
సాక్షి, విజయవాడ: వినూత్న ఆలోచనకు ఏపీ ఫైబర్ నెట్ శ్రీకారం చుట్టిందని ఆ సంస్థ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. కొత్త సినిమా రిలీజ్ రోజునే ఫైబర్ నెట్లో తిలకించే అవకాశముంటుందని తెలిపారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్‌తో కొత్త సినిమా ప్రదర్శన సదుపాయాన్ని తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకసారి సబ్ స్క్రైబ్ చేసుకుంటే 24 గంటలు కొత్త సినిమా చూసే అవకాశం కల్పించామన్నారు. pic.twitter.com/C4bKDJH3Gt — AP Fiber (@FiberAp) May 30, 2023 ‘‘ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనేదే మా లక్ష్యం. ఫైబర్ నెట్‌ను కూడా ఒక థియేటర్‌గానే చూడాలి. జూన్ 2న విశాఖలో ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్ లాంఛనంగా ప్రారంభిస్తాం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, నటీనటుల సమక్షంలో ప్రారంభిస్తాం. 55 వేల కిలోమీటర్ల మేర ఓఎఎఫ్.సీ కేబుల్ వేయాలనేది మా లక్ష్యం. 37 వేల కిలోమీటర్ల ఓఎఫ్.సీ కేబుల్ వేశాం. 7600 పై చిలుకు గ్రామ పంచాయతీలకు చేరువయ్యాం. పాఠశాలలకు నెట్ అందించడంలో ప్రథమ భాగంలో ఉన్నాం. గ్రామసచివాలయాలు, ఆర్బీకేలకు కనెక్టివిటీ కలిగి ఉన్నాం. 5 కంపెనీలతో సెటాప్ బాక్స్ లు తయారు చేయిస్తున్నాం. సెటాప్ బాక్స్ ల కొరతను అధిగమిస్తాం ’’ అని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: అలర్ట్: రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు -
కేజీఎఫ్–2కి సెలవు కావాలి
యశవంతపుర: కన్నడ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రమే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. భారీ అంచనాల మధ్య కేజీఎఫ్ 2 జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో త్వరలోనే తమ అభిమాన హీరో రాకీ భాయ్ థియేటర్లలో సందడి చేయనున్నాడని అభిమానులు తెగ సంబరపడుతున్నారు. బాక్సాఫీస్ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. అయితే తాజాగా యశ్ అభిమానులు కొందరు ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సినిమా విడుదల రోజును సెలవుగా ప్రకటించాలని ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్విటర్లో ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Dear @PMOIndia @narendramodi sir Consider Fans Emotion🥰😁 And Declare National Holiday On 16/7/2021💥#KGFChapter2 #YashBOSS #KGFChapter2onJuly16 pic.twitter.com/1Idm64pgwV — Rocking Styles (@styles_rocking) January 30, 2021 -
మహేశ్ సినిమా కోసం గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నా
‘‘కెరీర్ స్టార్టింగ్‌లో అవకాశాల కోసం తిరిగినప్పుడు చాలాసార్లు నిరాశే ఎదురైంది. అప్పుడు అనుకున్నాను సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం వస్తే కొత్తవాళ్లకు చాన్స్ ఇవ్వాలని. నటుడిగా కొన్నేళ్ల తర్వాత ఫేడ్ అయినా బ్యానర్ మాత్రం సురేశ్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్‌లాగా తరతరాలుగా ఉండిపోతుందనిపించింది. అందుకే స్టార్ట్ చేశాను’’ అన్నారు సుధీర్‌బాబు. ఆర్.ఎస్. నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’ నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు. ► యాక్టర్‌గా సీన్లో లీనమవ్వాలంటే మైండ్ క్లియర్‌గా ఉండాలి. నిర్మాత కూడా నేనే కావడంతో సెట్లో ఏదైనా వేస్ట్ అయిందనిపిస్తే అప్సెట్ అవ్వడం సహజం. మొత్తానికి హీరోగా, నిర్మాతగా బాలెన్డ్స్‌గానే వ్యవహరించా. ► నిర్మాత అవుతున్నానని మహేశ్‌కి చెప్పగానే ‘సరే’ అన్నా కంగారుపడి ఉంటాడనుకుంటున్నా. హీరో అవుతానన్నప్పుడు కూడా ‘సరే’ అన్నాడు. అయితే నాకు మొహమాటం. ఈ ఇండస్ట్రీలో నా విధానం నప్పుతుందో లేదోనని కంగారుపడ్డాడు. మహేశ్‌కి సరిపోయే కథ దొరికితే నిర్మిస్తాను. తనతో సినిమా నిర్మించడం కోసం ఇది గ్రౌండ్ ప్రాక్టీస్ అనుకుంటున్నా. ► సెప్టెంబర్ 13న మా సినిమా రిలీజ్ అని ఫస్ట్ మేమే అనౌన్స్ చేశాం. కానీ భార్యా భర్తలు పబ్లిక్‌లో తక్కువసార్లు పోటీ పడతారు. (నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’, సమంత ‘యు టర్న్’ ఒకే రోజు రిలీజ్ గురించి). అందుకే వాళ్ల మధ్యలో వెళ్లి వేళ్లు కాల్చుకోవడం ఎందుకని రిలీజ్‌ని వారం వాయిదా వేసుకున్నాం (నవ్వుతూ). ► వీడు ఇది చేయలేడేమో అన్న ప్రతిసారీ దాన్ని బ్రేక్ చేస్తున్నాను. ‘యస్‌యమ్‌ఎస్’లో నా వాయిస్ బాగా లేదన్నారు. దాని మీద వర్క్ చేశాను. యాక్షన్ సినిమాలే చేస్తాడేమో అన్నారు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ లాంటి లవ్‌స్టోరీ చేశాను. అలాగే సెటిల్డ్ రోల్స్ చేయాలని ‘సమ్మోహనం’, ఈ సినిమా చేశా. ప్రస్తుతానికి మల్టీస్టారర్ మూవీస్ వద్దనుకుంటున్నా. ► మనంతట మనం నిలబడాలనుకునే మనస్తత్వం గలవాణ్ని. పద్మాలయ బేనర్ ఉన్నప్పటికీ మహేశ్, ఇందిరా ప్రొడక్షన్స్ బేనర్లు స్టార్ట్ అయ్యాయి. నా బేనర్ కూడా అంతే. కథ బావుండి, నేను కాకుండా ఫలానా హీరోలు చేస్తే బావుండు అనిపిస్తే వేరే హీరోలతో కూడా నిర్మిస్తాను. అలాగే ఓన్ బ్యానర్ స్టార్ట్ చేసినా బయట ప్రొడక్షన్లో కూడా సినిమాలు చేస్తా. నెక్ట్స్ ‘వీరభోగ వసంత రాయ లు’, పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేస్తున్నాను. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం
సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు) : సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలు విశాఖ కేంద్ర కారాగారం నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సంవత్సరాలు తరబడి నాలుగు గోడల మధ్య గడుపుతూ కుటుంబీకులకు దూరంగా ఉన్న వారు ఎట్టకేలకు ఆదివారం విముక్తి పొందారు. రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చిన క్షమాబిక్ష జీవోకి ఇప్పుడు మోక్షం కలిగింది. ఈ ఏడాది జనవరి 24న క్షమాభిక్ష జీవో విడుదలైంది. దీంతో ఆ జీవో ప్రకారం ఇక్కడి జైలు అధికారులు అర్హులైన జీవిత ఖైదీల జాబితా తయారుచేసి జైల్ శాఖ ఉన్నతాధికారులకు పంపించారు. అప్పటి నుంచి వీరంతా ఎప్పుడు విడుదలవుతామా అంటూ ఎదురు చూశారు. రిపబ్లిక్ డే, ఉగాదికి విడదులవుతామని ఆశించారు. ఆ రెండు గడువులు దాటిపోయాయి. ఎట్టకేలకు ఆ ఖైదీలకు ఆదివారం మోక్షం కలిగింది. కానీ జైలు అధికారులు పంపించిన జాబితాలోని నలుగురిని ఉన్నతాధికారులు అనర్హులుగా గుర్తించి విడదులైన జాబితా నుంచి వారి పేర్లు తొలగించారు. ప్రభుత్వం క్షమాభిక్షపై రాష్ట్రంలో విడుదల చేసిన 49 మంది జీవిత ఖైదీలలో ఇక్కడి నుంచి 13 మందికి విముక్తి కలిగింది. దీంతో మధ్యాహ్నం 1 గంటకు వారంతా ఆనందోత్సాహాలతో జైలు నుంచి బయట ప్రపంచంలో అడుగుపెట్టారు. వీరిలో ఓ మహిళా ఖైదీ తన రెండేళ్ల కుమార్తెతో విడుదల కావడం విశేషం. విడుదలైన వారిలో విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, కడప జిల్లాలకు చెందిన వారున్నారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు 9 మంది, విజయనగరం జిల్లాకు చెందిన వారు ఇద్దరు, శ్రీకాకుళం, కడప జిల్లాలకు చెందిన వారు చెరో ఒక్కరు చొప్పున ఉన్నారు. క్షమాబిక్ష జీవో నిబంధనల ప్రకారం వీరందరూ రూ.50వేలు బ్యాండు పూచీకత్తుపై విడుదలయ్యారు. ప్రతి మూడు నెలలకు ఓసారి వీరంతా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సి ఉంది. కొబ్బరికాయలు కొట్టిన ఖైదీలు విడుదలైన ఆనందంలో ఖైదీలు జైలు ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. చెప్పులు పక్కన విడిచి కొబ్బరికాయ కొట్టి ప్రతి ఒక్కరూ జైలుకు దండం పెట్టారు. ఇది ఒక దేవాలయం లాంటిదని, మాకు జీవిత పాఠం నేర్పిందని, బాహ్యప్రపంచంలో నీతిగా బతుకుతామంటూ దండం పెట్టుకొన్నారు. విడుదలైన జీవిత ఖైదీలు వీరే విశాఖపట్నం జిల్లా నుంచి జి.శ్రీనివాస్(నాతవరం), ఎం.అప్పారావు (జి.మాడుగుల), ఎస్.సుబ్బారావు(పెదబయిలు), ఎన్.అప్పన్న (నాతవరం), ఎన్.శ్రీను(నాతవరం), ఆర్.అప్పనాయుడు(అచ్చుతాపురం), ఎ.నాయుడు(మునగపాక), బి.గోవిందరాజు(గోపాలపట్నం), ఆర్.శ్యామల(గాజువాక) విడుదలయ్యారు. విజయనగరం జిల్లా వి.టి.అగ్రహారం రెడ్డి వీధికి చెందిన జి.కృష్ణ, పెదసాము ప్రాంతానికి చెందిన ఆర్.సీతారాం, శ్రీకాకుళం జిల్లా గట్లభద్రకు చెందిన ఎం.బాబూరావు, కడప జిల్లాకు చెందిన ఎస్.రవికుమార్ విడుదలయ్యారు. మళ్లీ నేరం చేస్తే జీవితాంతం జైలులోనే జైలు నుంచి విడుదలైన జీవిత ఖైదీలకు డిప్యూటీ సూపరింటెండెంట్ వేంకటేశ్వర్లు నిబంధనలు వివరించారు. క్షమాభిక్ష జీవో ప్రకారం ఇప్పుడు విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడకూడదన్నారు. అలాంటి వారికి క్షమాభిక్ష రద్దయి జీవితాంతం జైలులోనే గడపాల్సి వస్తుందన్నారు. బయట ప్రపంచంలో గౌరవంగా జీవించాలని సూచించారు. విడుదలైన వారంతా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ప్రతి మూడు నెలలకు ఓసారి వెళ్లి సంతకం చేయాలన్నారు. ఇప్పుడు ఇక్కడ మిగిలిన శిక్ష ముగిసినంతవరకు పోలీస్ స్టేషన్లో మూడు నెలలకు ఓసారి సంప్రదించాల్సిందేనని సూచించారు. -
సల్మాన్ ఖాన్ 'కిక్'.. తొలిరోజు రూ. 26 కోట్లు
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం కిక్ తొలిరోజే కలెక్షన్ల వర్షం కురిపించింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఒక్క రోజే 26 కోట్ల రూపాయిలకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించింది. సాజిద్ నడియాడ్వాలా నిర్మించిన ఈ చిత్రంలో రణదీప్ హుడా, నవాజుద్దీన్ ఇతర ముఖ్య తారాగణం. నర్గీస్ ఫక్రీ ఐటం సాంగ్‌లో చిందేసింది. ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ వచ్చింది.