Punuru Gowtham Reddy
-
నా తండ్రిని ఏం చేయాలనుకుంటున్నారు..? గౌతమ్ రెడ్డి కుమార్తె సంచలన కామెంట్స్
-
పోలీసులు తీరు అమానుషం: గౌతమ్‌రెడ్డి కుమార్తె లిఖిత
సాక్షి, విజయవాడ: పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని వైఎస్సార్సీపీ నేత పూనూరు గౌతమ్‌రెడ్డి కుమార్తె లిఖిత మండిపడ్డారు. ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే వ్యక్తి గౌతమ్ రెడ్డి.. పోలీసులు అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏముంది? అంటూ ఆమె ప్రశ్నించారు. సుమారు 30 మందికి పైగా కరెంట్ తీసేసి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడ్డారన్నారు.‘‘అసలు పోలీసులు వచ్చింది ఎందుకు?. నా తండ్రిని తీసుకెళ్లిపోవడానికా.. ఎత్తుకెళ్లిపోవడానికా.. దాచేయడానికా?.. ఏకంగా చంపేయడానికా?. పోలీసులు తీసుకెళ్లి ప్రశ్నించే పద్ధతి ఇది కాదు. పోలీసులు వచ్చిన సమయంలో మా నాన్న లేరు కాబట్టే ఆయన బతికున్నారని నేను అభిప్రాయ పడుతున్నా. మా తల్లికి 66 ఏళ్లు. ఆమెకు అనారోగ్య సమస్యలున్నాయి. అర్ధరాత్రి బెడ్ రూమ్ తలుపులు బాదుతూ ఆమెను ఇబ్బంది పెట్టారు. డోర్లు వేసుకోకుండా పడుకున్నారేంటంటూ పోలీసులు రివర్స్‌లో దబాయించారు’’ అని లిఖిత ఆవేదన వ్యక్తం చేశారు.‘‘గౌతమ్‌రెడ్డిని ఎక్కడ దాచావ్?. ఎక్కడికి వెళ్లాడు. ఎక్కడెక్కడికి వెళ్తాడంటూ భయపెట్టారు. ఫ్రెండ్లీ పోలీస్ ... ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా?. పోలీసుల తీరు చూస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగంలాగే ఉంది’’ అని లిఖిత ఆగ్రహం వ్యక్తం చేశారు. -
YSRCP నేత పూనూరు గౌతమ్ రెడ్డి కుటుంబానికి నేతల పరామర్శ
-
గౌతమ్ రెడ్డిని పరామర్శించిన అంబటి, మేరుగు, చంద్రశేఖర్ తదితరులు
-
‘అర్ధరాత్రి గౌతమ్‌రెడ్డి ఇంటి కిటికీని పగలగొట్టింది స్టూవర్ట్‌పురం దొంగలు కాదు.. పోలీసులు’
విజయవాడ: వైఎస్సార్సీపీ నేత పూనురు గౌతమ్‌రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కనీస నిబంధనల్ని కూడా పోలీసులు పాటించలేదని, మెయిన్‌డోర్ వేసుంటే వెనుక వైపు ఉన్న కిటికీని పగలగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించారన్నారు. అలా ప్రవేశించింది ఏ స్టూవర్ట్‌పురం దొంగలో కాదని, ఏకంగా పోలీసులే అటువంటి దుస్సాహానికి పాల్పడ్డారని అంబటి విమర్శించారు.వైఎస్సార్సీపీ నేత పూనురు గౌతమ్‌రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీకి చెందని నేతలు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, చంద్రశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, భాగలక్ష్మీ, శైలజారెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి.. కూటమి సర్కారు అప్రజాస్వామిక చర్యలపై ధ్వజమెత్తారు.‘12వ తేదీ అర్ధరాత్రి పూనురు గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు దుర్మార్గం. కనీస నిబంధనలను కూడా పోలీసులు పాటించలేదు. మెయిన్ డోర్ వేసుంటే వెనుక వైపు ఉన్న కిటికీని పగలగొట్టారు. కిటికీని పగలగొట్టింది స్టూవర్ట్ పురం దొంగలు కాదు.. పోలీసులు. ఆ సమయంలో గౌతమ్ రెడ్డి భార్య తప్ప మరొకరు లేరు. పూనూరు గౌతమ్ రెడ్డి వైసీపీలో సీనియర్ నేత. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్ధిగా పోటీచేయించాలని భావించాం. గౌతమ్‌రెడ్డి ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ చూశాక మాకు ఆశ్చర్యమేసింది. పోలీసులు ఇలా కూడా వ్యవహరిస్తారా అనిపించింది. గండూరి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి గౌతమ్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఒక సివిల్ కేసును పోలీసులు అక్రమ కేసుగా మార్చారు. గౌతమ్ రెడ్డి పై పెట్టిన కేసు పూర్తిగా తప్పుడు కేసు. మహిళలు మాత్రమే ఉన్న సమయంలో అక్రమంగా పోలీసులు ఇంట్లోకి ప్రవేశిస్తే ఎవరికైనా భయం కలగదా. గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇంతకంటో వేరే మార్గమే లేదా?విజయవాడ పోలీస్ కమిషనర్ ,డిజిపిలను ప్రశ్నిస్తున్నా. మీ ఆదేశాలు లేకుండానే పోలీసులు ఇలా చేస్తారా?నేరం మోపబడిన వ్యక్తి ఇంట్లో ఇలా ప్రవేశించడం కరెక్టేనా అని హోంమంత్రి అనితను అడుగుతున్నా. ఏపీలో అరాచకం జరుగుతుందని మేం మొదట్నుంచి చెబుతున్నాం. గౌతమ్ రెడ్డిని పట్టుకోవడానికి ఇంతకంటే మరోమార్గం మీకు దొరకలేదా?, మహిళలు నిద్రిస్తున్న సమయంలో ఇలా చేయొచ్చా హోంమంత్రి సమాధానం చెప్పాలి. ఈ ఘటనను మేం తేలిగ్గా విడిచిపెట్టం...న్యాయపరంగా పోరాడుతాం. న్యాయసలహా తీసుకుని పోలీసుల పై ప్రవేట్ కేసు పెడతాం. పోలీసుల పై చర్యలు తీసుకుంటారా లేదా అనేది డీజీపీ, హోంమంత్రి సమాధానం చెప్పాలి’ అని అంబటి నిలదీశారు. ప్రశ్నించే వారిని కూటమి ప్రభుత్వం బెదిరిస్తోంది: ఎమ్మెల్యే చంద్రశేఖర్పోలీసులే అర్థరాత్రి దొంగల్లా ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నారని, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. గౌతమ్‌రెడ్డి నిజంగా తప్పు చేసి ఉంటే పోలీసులే ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా డీజీపీ? అని ప్రశ్నించారు. ఈ రకమైన చర్యలు అప్రజాస్వామికమని, అర్థరాత్రి మహిళలున్న సమయంలో ఇళ్లల్లోకి పోలీసులు ప్రవేశించడం కరెక్టేనా? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం నిర్బంధకాండను ప్రజలు తెలుసుకోవాలని, అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం చేస్తుందన్నారు. -
YSRCP నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై అక్రమ కేసు
-
20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ బాబు..?
-
చంద్రబాబుపై పునూరు గౌతమ్ రెడ్డి సెటైర్లు
-
జూన్ 4 తరువాత ఎక్కడివాళ్ళు అక్కడే.. బాబు, పవన్ పై గౌతమ్ రెడ్డి కామెంట్స్
-
ఏపీ సీఈవోకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పోస్టింగ్‌లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనాకి ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌పై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
బాబు అరెస్ట్ తో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు: పునూరు గౌతమ్ రెడ్డి
-
ఫస్ట్ డే ఫస్ట్ షో.. వినూత్న ఆలోచనకు ఏపీ ఫైబర్ నెట్ శ్రీకారం
సాక్షి, విజయవాడ: వినూత్న ఆలోచనకు ఏపీ ఫైబర్ నెట్ శ్రీకారం చుట్టిందని ఆ సంస్థ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. కొత్త సినిమా రిలీజ్ రోజునే ఫైబర్ నెట్లో తిలకించే అవకాశముంటుందని తెలిపారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్‌తో కొత్త సినిమా ప్రదర్శన సదుపాయాన్ని తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకసారి సబ్ స్క్రైబ్ చేసుకుంటే 24 గంటలు కొత్త సినిమా చూసే అవకాశం కల్పించామన్నారు. pic.twitter.com/C4bKDJH3Gt — AP Fiber (@FiberAp) May 30, 2023 ‘‘ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనేదే మా లక్ష్యం. ఫైబర్ నెట్‌ను కూడా ఒక థియేటర్‌గానే చూడాలి. జూన్ 2న విశాఖలో ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్ లాంఛనంగా ప్రారంభిస్తాం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, నటీనటుల సమక్షంలో ప్రారంభిస్తాం. 55 వేల కిలోమీటర్ల మేర ఓఎఎఫ్.సీ కేబుల్ వేయాలనేది మా లక్ష్యం. 37 వేల కిలోమీటర్ల ఓఎఫ్.సీ కేబుల్ వేశాం. 7600 పై చిలుకు గ్రామ పంచాయతీలకు చేరువయ్యాం. పాఠశాలలకు నెట్ అందించడంలో ప్రథమ భాగంలో ఉన్నాం. గ్రామసచివాలయాలు, ఆర్బీకేలకు కనెక్టివిటీ కలిగి ఉన్నాం. 5 కంపెనీలతో సెటాప్ బాక్స్ లు తయారు చేయిస్తున్నాం. సెటాప్ బాక్స్ ల కొరతను అధిగమిస్తాం ’’ అని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: అలర్ట్: రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు -
ఉపాధి, ఉత్పత్తులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి
ప్రపంచాన్ని పట్టి పీడించిన కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో పారిశ్రామికాభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఇప్పటికే రాష్ట్రంలో పెట్టిన యూనిట్లను త్వరిత గతిన పూర్తి చేసి ఉత్పత్తి ప్రారం భించేలా చర్యలు చేపట్టింది. ప్రతి నెలా రాష్ట్రంలో పరిశ్రమల ప్రారంభోత్స వాలు, శంకు స్థాపనలు నిర్వహించేలా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది సత్ఫలితాల నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు అంటే ఆర్నెల్ల వ్యవధిలో రాష్ట్రంలో 22 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించగా, వీటి ద్వారా రూ. 20,682 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ తన తాజా నివేదికలో వెల్లడించింది. తొలి ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించిన ప్రధాన కంపెనీల్లో గ్రాసిం ఇండస్ట్రీస్, పానా సోనిక్ లైఫ్ సైన్స్ సొల్యూషన్స్, కాప్రికాన్ డిస్టిలరీ, ఆంజనేయ ఫెర్రో అల్లాయిస్, నోవా ఎయిర్, తారక్ టెక్స్టైల్స్, టీహెచ్‌కే ఇండియా, కిసాన్ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్ మిల్ లాంటివి ఉన్నాయి. కోవిడ్ సంక్షోభం కుదిపివేసిన 2020, 2021తో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో రెట్టింపు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. 2019లో 42 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ. 9,840 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా... 2021లో రూ. 10,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత రెండున్నరేళ్లలో మొత్తం 111 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా మొత్తం రూ. 40,872 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. పారిశ్రామికవేత్తల నుంచి కంపెనీ ఏర్పాటు ప్రతిపాదన అందిన నాటి నుంచి యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో చేయూత అందించేలా ‘వైఎస్సార్ ఏపీ వన్’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు, సేవలు అందిస్తోంది. తాజాగా విశాఖ వద్ద ప్రముఖ జపాన్ కంపెనీ యకహోమా గ్రూపు సంస్థ ఏటీసీ టైర్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా సంస్థ సీఈవో నితిన్... మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటును కొనియాడారు. సాధారణంగా అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుందనీ, రాష్ట్రంలో మాత్రం ‘సింగిల్ డెస్క్’ విధానంలో వేగంగా మంజూరయ్యాయనీ తెలిపారు. దీంతో రికార్డు సమయంలో 15 నెలల్లోనే తొలిదశ యూనిట్‌ను ప్రారంభించడమే కాకుండా రెండో దశ పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. కోవిడ్ సమయంలో లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించినట్లు నోవా ఎయిర్ ప్రతినిధులు వెల్లడించారు. 2020 డిసెంబర్లో నిర్మాణం ప్రారంభించి 11 నెలల్లోనే పనులు పూర్తి చేశామనీ, దీనివల్ల 250 టన్నుల ఆక్సిజన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిందనీ తెలిపారు. గత రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలోకి కొత్తగా రూ. 24,956 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ నివేదిక పేర్కొంది. 2020 జనవరి నుంచి 2022 జూన్ నాటికి కొత్తగా 129 భారీ యూనిట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఏడాది ఆరునెలల కాలంలో కొత్తగా 23 కంపెనీలు రూ. 5,856 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పారిశ్రామికీకరణ విధానాలను పునఃసమీక్షిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) ఆధునిక సాంకే తిక పరిజ్ఞానాన్ని అందిస్తూ, ఉత్పత్తి పెంచుతూ, ఆర్థిక చేయూతను ఇస్తూ ఉద్యోగ, ఉపాధులు కల్పిస్తోంది ప్రభుత్వం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో 28,343 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిద్వారా రూ. రూ. 47,490.28 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 2,48,122 మందికి ఉపాధి లభించింది. ఇందులో 28,247 ఎంఎస్ఎంఈలు ఉండగా 96 భారీ యూనిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో రూ. 1,51,372 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 61 యూనిట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి ఉత్పత్తిని ప్రారంభిస్తే మరో 1,77,147 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది కొత్తగా 1.25 లక్షల ఎంఎస్ఎంఈలను ‘ఉదయం’ పోర్టల్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రతి విద్యార్థినీ అత్యుత్తమ నైపుణ్యాలతో ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ఉద్యోగాన్వేషణలో అత్యంత కీలకమైన సాఫ్ట్‌స్కిల్స్ పెంపొందించడంపై 1.62 లక్షల మంది విద్యార్థులకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ అందజేస్తోంది. రూ. 465 కోట్ల వ్యయమయ్యే ఈ శిక్షణను మైక్రోసాఫ్ట్ సంస్థ రాష్ట్ర విద్యార్థులకు దాదాపు రూ. 32 కోట్లకే అందిస్తోంది. అది కూడా విద్యార్థులపై నయాపైసా భారం లేకుండా ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ కోర్సులే కాకుండా ‘లింక్డిన్’ ప్లాట్‌ఫాంతో అనుసంధానం చేస్తున్నారు. దీని ద్వారా లింక్డిన్లోని టెక్నాలజీ, క్రియేటివిటీ, బిజినెస్ విభాగాల్లో 8 వేలకు పైగా కోర్సులు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. (క్లిక్: చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!) వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు–2023లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా పటిష్ఠ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేలా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్యంతో భారీస్థాయి పెట్టుబడి దారులతో జనవరి తర్వాత ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమైతే మరిన్ని ఉద్యోగాలు అందు బాటులోకి వస్తాయి. (క్లిక్: ఇంగ్లిష్ వెలుగులు చెదరనివ్వొద్దు) - డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ -
కార్మిక ఐక్యతకు ప్రతీక
ప్రపంచం ముందుకు నడవాలంటే కార్మికుడు కావాలి. కార్మికుడు తన రక్త మాంసాలు కరిగించి, చెమట చిందించి పనిచేస్తేనే మనం ముందుకు సాగేది. వారి శ్రమను గుర్తిస్తూ జరుపుకొంటున్నదే ‘మే’ డే! ఈ రోజు కార్మికుల ఐక్యత, పోరా టానికి నిదర్శనం. నిజానికి మే డే ఎలా వచ్చిందంటే... కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886 మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని ‘హే మార్కెట్’లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. వారి రక్తతర్పణ ప్రపంచానికే కొత్త దిశను చూపింది. ఆ ఘటన తర్వాత 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి. 1890 మే 1న బ్రిటన్‌లోని ‘హైడ్ పార్క్’లో చేపట్టిన ప్రద ర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. తామూ మనుషులమేననీ, తమ శక్తికి కూడా పరిమితులుం టాయనీ కార్మికులు నినదించారు. పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడారు. 24 గంటల్లో ఎనిమిది గంటలు పనీ, ఎనిమిది గంటలు విశ్రాంతీ, మరో ఎనిమిది గంటలు రిక్రియేషన్‌ను ఈ పోరాటం ద్వారా కార్మికులు సాధించుకున్నారు. అలాగే మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపు కోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. 1923లో తొలిసారి ఇండియాలో ‘మే’ డేను పాటించారు. అయితే, 1890 నాటి దుర్భర పరిస్థితులు మళ్లీ కార్మికలోకం 2014 నుండి 2019 మధ్య చూడాల్సిన పరిస్థితులు ఎదుర య్యాయి. కేవలం పాలకుల నిర్లక్ష్య, నిరంకుశ ధోరణి మూలం గానే ఈ పరిస్థితులు తలెత్తాయన్నది అక్షర సత్యం. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోలేదు. కార్మికులను చంద్రబాబు చులకనగా చూసేవారు. ఎవరైనా తమ పరిస్థితి గురించి చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే ‘తాట తీస్తా’... అంటూ హెచ్చరికలు జారీచేయడం..., మీరంతా మురికిగా ఉంటారంటూ అగౌరవ పర్చడం, ‘దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా’ అని హేళన చేయడం చేస్తూనే వచ్చారు. వారికి ఇచ్చిన వందకుపైగా హామీల్లో కనీసం ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ పరిస్థితుల్లో కార్మికుల నావకు చుక్కానిలా వైఎస్ జగన్మోహన్రెడ్డి కనిపించారు. జగన్ సుదీర్ఘ కాలం చేపట్టిన పాదయాత్రలో... ఆయన నడక, నడత, మాటల్లోని విశ్వసనీయత కార్మికలోకానికి ధైర్యాన్ని, నమ్మకాన్నీ, భరోసాను కల్పించాయి. జగన్ అధికారం చేపట్టాక ఆయన కార్మిక లోకానికి ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని మరచి పోలేదు. మొదటి ఏడాది నుంచే ఆయన కార్మికులకిచ్చిన హామీలను నిలుపుకోవడం ప్రారంభించారు. కార్మికులకు ఏటా రూ. 10 వేల వంతున ఆర్థిక సాయమందించే ‘వాహన మిత్ర’ ద్వారా వారి నమ్మకాన్ని చూరగొన్నారు. అక్కడి నుండి మొదలైన ఆయన హామీల అమలు వరద అప్రతిహతంగా కొనసాగింది. ‘మత్స్యకార భరోసా’, ‘రైతు భరోసా’, ‘నేతన్న నేస్తం’, ఎంఎస్ ఎంఈలకు ‘నవోదయం’ కింద ప్రోత్సాహకాలు, ‘వైఎస్సార్ బీమా’ వంటి అనేక పథకాల ద్వారా కార్మిక, కర్షకులకు ప్రయో జనం చేకూరుస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం, అంగన్ వాడీ, ఆశా వర్కర్ల వేతనాలు పెంచడం, పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవడం వంటి చర్యలు కార్మిక లోకంలో సీఎం జగన్‌ను శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాయి. రాజధానిలో కార్మికులెవ్వరూ ఉండకూడదని చంద్రబాబు హుకుం జారీ చేయడమే కాకుండా వారు అక్కడ నివాసం ఉంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటూ అవమానించారు. రాజధాని నిర్మాణం కోసం వారి సేవలు అవసరమైనప్పుడు రాజ ధానిలో నివాసం ఉండేందుకు వారికి ఎందుకు అర్హత లేదన్న అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పిన యువ నేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ రాజధానిలోనే నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. జగన్ కార్మిక వర్గానికి చేస్తున్న సాయం చరిత్రలో నిలిచిపోతుంది. అలానే కార్మిక వర్గం కూడా ఆయన్ను వీడే పరిస్థితి లేదు. తమ బొందిలో ఊపిరి ఉన్నంత వరకూ తామంతా జగన్మోహన్రెడ్డి చేయి విడువబోమని కార్మికలోకం నేడు ప్రతిజ్ఞ చేస్తోంది. వ్యాసకర్త: డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ చైర్మన్ మొబైల్ : 9848105455 (నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం) -
న్యాక్ ఉద్యోగుల సమస్యలు సీఎం దృష్టికి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి, న్యాక్ చైర్మన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతానని ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి చెప్పారు. విజయవాడలో ఆదివారం న్యాక్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ యూనియన్ మొదటి మహాసభ జి.శంకరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌతంరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి న్యాక్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. వారి జీవితాలకు భరోసా కల్పించారని చెప్పారు. న్యాక్ పరిధిని పెంచి వర్కర్లను రెగ్యులరైజ్ చేస్తానన్నారని, కానీ ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు వీళ్లందరిని తొలగించాలని కుట్రపూరితంగా వ్యవహరించాయని పేర్కొన్నారు. న్యాక్‌లో టెక్నికల్, నాన్ టెక్నికల్ అర్హత కలిగిన 250 మంది 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నా గత ప్రభుత్వాలు ఉద్యోగ భద్రతను కల్పించకపోవడం శోచనీయమన్నారు. సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన పీఆర్సీ, టైం స్కేల్, సమానపనికి సమాన వేతనం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పారు. వైఎస్సార్టీయూసీ రాష్ట్ర నాయకుడు ఎన్.రాజారెడ్డి ప్రసంగించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్, న్యాక్ సిబ్బంది జి.శంకర్, సుధాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక అనంతరం న్యాక్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ యూనియన్ (న్యూ) రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎన్.రాజారెడ్డి, అధ్యక్షుడిగా జి.శంకరయ్య, ఉపాధ్యక్షులుగా ఎం.వసంతరావు, జీఎస్ నారాయణరెడ్డి, ఈఎస్ శ్యామ్‌బాబు, చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా ఎం.సుధాకర్, సహాయ కార్యదర్శులుగా డి.టి.రాజాబాబు, టి.సురేష్‌బాబు, వి.బి.పి.విజయలక్ష్మి, ఎస్.సుధాకర్, కోశాధికారిగా డి.కిరణ్‌కుమార్‌రెడ్డిలను ఎన్నుకున్నారు. -
నిమ్మగడ్డ.. చంద్రబాబు ఏజెంట్: గౌతమ్‌రెడ్డి
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబుకు ఏజెంట్‌గా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహరిస్తున్నారని ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ మిలిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్, వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు పి. గౌతమ్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాక్ స్వాతంత్రం హరించేలా ఎస్ఈసీ ప్రవర్తించారని ధ్వజమెత్తారు. టీడీపీ మేనిఫెస్టో మీద ఎలాంటి చర్య తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. ఫైబర్ నెట్లో సీఎం ఫోటో రాకుండా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతల ఫిర్యాదును ఆయన తప్పుపట్టారు. ఇది సబబు కాదన్నారు. కేంద్ర పథకాలలో ప్రధానమంత్రి ఫోటో ఉంటే.. అది కూడా తీసెయ్యాలా అని గౌతమ్‌రెడ్డి ప్రశ్నించారు. (చదవండి: హైకోర్టులో నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ) (చదవండి: చంద్రబాబూ.. డ్రామాలు ఆపు: అవంతి) -
గౌతంరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ సీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ట్రేడ్ యూనియన్ నాయకుడు పి.గౌతంరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులను మొహరించారు. దివంగత వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై వంగవీటి అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణపురంలోని ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డిపై సెక్షన్ 153ఏ కింద విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు గానూ సత్యనారాయణపురం పోలీసుస్టేషన్లో ఆయనపై కేసు పెట్టారు. గౌతంరెడ్డి ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత వంగవీటి రంగా, ఆయన సోదరుడు రాధాకృష్ణలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. గౌతంరెడ్డి వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండించి, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, తన తండ్రిపై గౌతంరెడ్డి వ్యాఖ్యలకు ఖండనగా ప్రెస్‌మీట్ పెట్టేందుకు ప్రయత్నించిన వంగవీటి రాధాకృష్ణను ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. -
వైఎస్సార్ సీపీ నుంచి గౌతంరెడ్డి సస్పెన్షన్.
-
వైఎస్సార్ సీపీ నుంచి గౌతంరెడ్డి సస్పెన్షన్
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం - వంగవీటి రంగా సహా పార్టీ నేతలపై వ్యాఖ్యల పర్యవసానం సాక్షి, హైదరాబాద్/సాక్షి, విజయవాడ/ఇబ్రహీంపట్నం: దివంగత వంగవీటి రంగాతో పాటు పార్టీ నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకుడు పి.గౌతంరెడ్డిని వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేశారు. అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గౌతంరెడ్డి సస్పెన్షన్ తక్షణం అమలులోకి వస్తుందని ప్రకటించారు. గౌతంరెడ్డి ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పార్టీ క్రమశిక్షణ సంఘాన్ని జగన్ ఆదేశించారు. కడప పర్యటనను ముగించుకుని హైదరాబాద్ వచ్చిన జగన్.. పార్టీ నేతలతో సమావేశమై చర్చించి గౌతంరెడ్డిని సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి. రంగాపై వ్యాఖ్యలకు వైఎస్సార్సీపీ ఖండన గౌతంరెడ్డి ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత వంగవీటి రంగా, ఆయన సోదరుడు రాధాకృష్ణలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి తెలిపారు. పార్టీ నేత మల్లాది విష్ణుపై కూడా గౌతంరెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలనూ ఖండిస్తున్నామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గౌతంరెడ్డి ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమోలు విడుదలయ్యాయని, వాటిలో ఆయన అభ్యంతరకరంగా మాట్లాడినట్లు పార్టీ దృష్టికి వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారన్నారు. రంగాను ఉద్దేశించి గౌతం చేసిన వ్యాఖ్యలన్నీ ఆయన వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీలో ఏస్థాయి నాయకుడైనా సరే ఏ వ్యక్తి గురించి గాని, ఏ వర్గం గురించిగాని అనుచిత వ్యాఖ్యలు చేసినా, కించపరిచేలా మాట్లాడినా తీవ్రంగా పరిగణిస్తామని జగన్ హెచ్చరించినట్లు పార్థసారథి తెలిపారు. గౌతంరెడ్డి ఇంటర్వ్యూను ప్రసారం చేయబోయే టీవీ చానెల్.. తమ పార్టీ అభిప్రాయం కూడా తీసుకోవాలని కోరుతున్నామన్నారు. విజయవాడలో ఉద్రిక్తత..: సత్యనారాయణపురంలోని గౌతంరెడ్డి ఇంటి ముందు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ అనుచరులు ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు. పోలీసులు వారిని నిలువరించారు. తన తండ్రిపై గౌతంరెడ్డి వ్యాఖ్యలకు ఖండనగా ప్రెస్‌మీట్ పెట్టేందుకు వంగవీటి రాధాకృష్ణ ఇంటినుంచి బయలుదేరగా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. రాధాతో పాటు ఆయన తల్లి రత్నకుమారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రత్నకుమారి సొమ్ముసిల్లి పడిపోయారు. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన రాధాకృష్ణను పోలీసులు అడ్డుకుని బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించారు. కాసేపటికి తేరుకున్న రత్నకుమారి, రాధాకృష్ణను ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. పోలీసులు అమర్యాదగా ప్రవర్తించడంతో రాధాకృష్ణ, రత్నకుమారి పోలీస్‌స్టేషన్‌లోనే బైఠాయించి నిరసన తెలిపారు. రాధాకృష్ణ, రత్నకుమారిలను ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ నుంచి రాత్రి 9.45 గంటల సమయంలో విడుదల చేశారు. కాగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు గానూ సత్యనారాయణపురం పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. -
గౌతంరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్ సీపీ
-
గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్: వంగవీటి రంగాపై తమ పార్టీ నేత పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ ఖండించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. గౌతంరెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్టీ నేతలు ఏ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి వంగవీటి రంగా మంచి స్నేహితుడని గుర్తు చేశారు. వంగవీటి రంగాను తాము ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటామన్నారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని పార్థసారధి తెలిపారు.