
సాక్షి, ఎన్టీఆర్: సుప్రీంకోర్టు తీర్పుపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన తీర్పు ఇచ్చిందని కొల్లికపూడి కామెంట్స్ చేశారు.
విస్సన్నపేటలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో కొలికపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన.. దారుణమైన.. అన్యాయమైన తీర్పు ఇచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కులాలకు రిజర్వేషన్లు అందిస్తే.. సుప్రీంకోర్టు మతాలకు ముడిపెట్టడం దారుణం. ఇలాంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినా.. ఎవరిచ్చినా తప్పు అవుతుంది’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment