సాక్షి, విజయవాడ: వరద బాధితులకు దాతలు సమకూర్చిన సరుకులను సైతం టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు. వరద బాధితులకు అందించే సాయంలోనూ టీడీపీ నేతలు పక్షపాతం ప్రదర్శిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసరాలను స్వచ్ఛంద సంస్థలు భారీగా అందిస్తున్నాయి.
అయితే, స్థానికంగా ఉంటున్న టీడీపీ నాయకులు.. దాతలు ఇస్తున్న సాయాన్ని తామే పంచుతామని నమ్మించి తీసుకుంటున్నారు. ఆ తరువాత వాటిని బాధితులకు ఇవ్వకుండా.. టీడీపీ కార్యకర్తలకు, తమ బంధువులు, స్నేహితులకే ఇచ్చుకుంటున్నారు. స్లిప్పులు ఇచ్చి మరీ టీడీపీ పార్టీ వారికే పంపిణీ చేయడంపై బోండా అనుచరులపై 62వ డివిజన్, హరిహరక్షేత్రం ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. బాధితులను వదిలేసి టీడీపీకి కావాల్సిన వారికి మాత్రమే పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: మానని గాయం.. తీరని నష్టం
బోండా ఉమా కార్యాలయం వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులపై బోండా ఉమా అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మరోసారి తమ కార్యాలయం దగ్గరకు రానివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు. బోండా ఉమా, టీడీపీ కార్యకర్తల తీరుపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అడగడానికి వచ్చినపుడు మాత్రమే మేం కనిపిస్తామా అంటూ మహిళలు దుమ్మెత్తిపోశారు. ఇంటింటికి తిరిగి ఓట్లడిగిన వాళ్లు ఇప్పుడెందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వరదల సమయంలో మమ్మల్ని గాలికి వదిలేశారు. వరద తగ్గిన తర్వాత కూడా మమ్మల్ని పట్టించుకోరా అంటూ టీడీపీ నేతలపై మహిళలు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment