
ఆసియా ఖండంలో అతి ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహం 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన కొలువై ఉంది. ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆంజినీపుత్రుడిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల 65వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన ప్రకృతి నడుమ అభయాంజనేయ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామి వారిని విశాలమైన ్ర΄ాంగణంలో జాతీయ రహదారి పక్కన 2003వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. వర్షాకాల నేపథ్యంలో చుట్టూ పచ్చని పొలాల మధ్య అభయమిచ్చే వాయుపుత్రుని చూసేందుకు నిత్యం భక్తులు వచ్చి వెళ్లుతుంటారు. జాతీయ రహదారి పక్కన పరిటాల సమీపంలో ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ధర్మకర్త బోడేపూడి వెంకటేశ్వరరావు 28 ఏప్రిల్ 2001లో శంకుస్థాపన చేశారు. నాలుగున్నర ఎకరాల్లో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంజినీ పుత్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఆలయ ్ర΄ాంగణంలో ప్రతిరోజు హనుమాన్‌చాలీసా పారాయణం చేశారు. విగ్రహం ఏర్పాటు చేసే నాటికి 1.35 లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది.
అతి ఎత్తయిన విగ్రహం...
ఆసియా ఖండంలో అతి ఎత్తయిన ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం పరిటాల గ్రామ సమీపంలో పాదపీఠంతో కలుపుకుని 150 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన విజయవాడకు 28 కిలోమీటర్ల దూరంలో ఈ విగ్రహం వుంది. ప్రతి ఏటా నిత్యం ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతుండేది. ఆలయంలో ఒకపక్క స్వామి వారికి భక్తిపారవశ్యంతో భజన కీర్తనలు, మరో పక్క హనుమాన్ చాలీసా, ఇంకోపక్క అన్నసమారాధనతో ఆలయ ప్రాంగణం భక్తులతో విరాజిల్లుతుంటుంది.
పర్యాటక కేంద్రంగా పరిటాల ఆలయం...
కంచికచర్ల మండలంలోని పరిటాల జాతీయ రహదారి పక్కన కొలువై ఉన్న ఆంజనేయస్వామి ఆలయం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. అభయాంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేసేందుకు భక్తులు బస్సులు, కార్లు ఇతర వాహనాల ద్వారా వస్తుంటారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి నిత్యం వందల సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటారు.
హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి విశేష పూజలు చేస్తుంటారు. ఆలయ ధర్మకర్త వెంకటేశ్వరరావు భారీగా అన్న సమారాధన చేస్తుంటారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో బాలాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో రామాలయం, క్షేత్ర ΄ాలకురాలయిన రేణుకాంబ అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయి. ఆలయంలో నిత్యం హనుమాన్ చాలీసా మహాన్యాస పూర్వక నీరాజన, అష్టోత్తర పూజలు జరుగుతుంటాయి. నిత్యం భక్తులచే ప్రత్యేక పూజలందుకుంటున్న అభయాంజనేయ స్వామిని ప్రజలు చూసి తరించాల్సిందే.
– శ్రీనివాస శర్మ, ప్రధాన అర్చకులు, పరిటాల
– బొక్కా ప్రభాకర్, సాక్షి, కంచకచర్ల (ఎన్టీఆర్ జిల్లా)
(చదవండి: మహిమాన్విత క్షేత్రం.. ఓంకారం! ఏకంగా 13 రకాల వంటకాలతో..)
Comments
Please login to add a commentAdd a comment