veera
-
అభయమిచ్చే వీర హనుమానుడు..!
ఆసియా ఖండంలో అతి ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహం 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన కొలువై ఉంది. ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆంజినీపుత్రుడిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల 65వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన ప్రకృతి నడుమ అభయాంజనేయ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామి వారిని విశాలమైన ్ర΄ాంగణంలో జాతీయ రహదారి పక్కన 2003వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. వర్షాకాల నేపథ్యంలో చుట్టూ పచ్చని పొలాల మధ్య అభయమిచ్చే వాయుపుత్రుని చూసేందుకు నిత్యం భక్తులు వచ్చి వెళ్లుతుంటారు. జాతీయ రహదారి పక్కన పరిటాల సమీపంలో ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ధర్మకర్త బోడేపూడి వెంకటేశ్వరరావు 28 ఏప్రిల్ 2001లో శంకుస్థాపన చేశారు. నాలుగున్నర ఎకరాల్లో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంజినీ పుత్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఆలయ ్ర΄ాంగణంలో ప్రతిరోజు హనుమాన్‌చాలీసా పారాయణం చేశారు. విగ్రహం ఏర్పాటు చేసే నాటికి 1.35 లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది.అతి ఎత్తయిన విగ్రహం...ఆసియా ఖండంలో అతి ఎత్తయిన ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం పరిటాల గ్రామ సమీపంలో పాదపీఠంతో కలుపుకుని 150 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన విజయవాడకు 28 కిలోమీటర్ల దూరంలో ఈ విగ్రహం వుంది. ప్రతి ఏటా నిత్యం ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతుండేది. ఆలయంలో ఒకపక్క స్వామి వారికి భక్తిపారవశ్యంతో భజన కీర్తనలు, మరో పక్క హనుమాన్ చాలీసా, ఇంకోపక్క అన్నసమారాధనతో ఆలయ ప్రాంగణం భక్తులతో విరాజిల్లుతుంటుంది.పర్యాటక కేంద్రంగా పరిటాల ఆలయం...కంచికచర్ల మండలంలోని పరిటాల జాతీయ రహదారి పక్కన కొలువై ఉన్న ఆంజనేయస్వామి ఆలయం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. అభయాంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేసేందుకు భక్తులు బస్సులు, కార్లు ఇతర వాహనాల ద్వారా వస్తుంటారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి నిత్యం వందల సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటారు.హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి విశేష పూజలు చేస్తుంటారు. ఆలయ ధర్మకర్త వెంకటేశ్వరరావు భారీగా అన్న సమారాధన చేస్తుంటారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో బాలాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో రామాలయం, క్షేత్ర ΄ాలకురాలయిన రేణుకాంబ అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయి. ఆలయంలో నిత్యం హనుమాన్ చాలీసా మహాన్యాస పూర్వక నీరాజన, అష్టోత్తర పూజలు జరుగుతుంటాయి. నిత్యం భక్తులచే ప్రత్యేక పూజలందుకుంటున్న అభయాంజనేయ స్వామిని ప్రజలు చూసి తరించాల్సిందే.– శ్రీనివాస శర్మ, ప్రధాన అర్చకులు, పరిటాల – బొక్కా ప్రభాకర్, సాక్షి, కంచకచర్ల (ఎన్టీఆర్ జిల్లా)(చదవండి: మహిమాన్విత క్షేత్రం.. ఓంకారం! ఏకంగా 13 రకాల వంటకాలతో..) -
ఓ ఆత్మ ప్రతీకారం
వీర్, శ్రీ హర్ష, నిషా, ఖుషి ముఖ్య తారలుగా తోట కృష్ణ దర్శకత్వంలో కేవీ పాపారావు నిర్మించిన ‘చండిక’ ఈ నెలలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తోట కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఓ ఆత్మ ప్రతీకారం తీర్చుకునే విధానాన్ని కొత్తగా చూపించాం. ఈ చిత్రంలో నిర్మాత గురురాజ్ ఓ కీలక పాత్ర చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు నేనే కథ రాశాను’’ అన్నారు చిత్రనిర్మాత కేవీ పాపారావు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ విన్, కెమెరా: నగేశ్. -
అందుకే అప్పుడు బరువు పెరిగాను : నమిత
నమిత అభిమానులకు శుభవార్త!ఆమె బోలెడంత లాస్ అయ్యారు! కంగారు పడకండి. నమిత లాస్ అయింది డబ్బు కాదు. వెయిట్ లాస్!! బరువు తగ్గి, మెరుపుతీగ అయ్యారు నమిత. తారలు వెయిట్ తగ్గితే.. ఇండస్ట్రీలో వెయిట్ పెరుగుతుంది. ‘సొంతం’తో ఎంట్రీ ఇచ్చి.. ‘సింహా’ తర్వాత కొంచెం ఒళ్లు చేసిన నమిత సన్నబడి, మళ్లీ ఇప్పుడు సౌత్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు.. ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్..! రెండేళ్ల క్రితం పెళ్లప్పుడు బొద్దుగా ఉన్నారు. ఈ మధ్య బరువు తగ్గారు. సినిమాల కోసమా? నమిత: బరువు తగ్గడానికి ముఖ్య కారణం కొన్ని పెద్ద సినిమాలు అంగీకరించడమే. వచ్చే ఏడాది మేలో ఈ సినిమాలు ఆరంభమవుతాయనుకుంటున్నాను. అందుకే టైమ్ తీసుకొని బరువు తగ్గుతున్నాను. ప్రతి రోజూ ఉదయాన్నే ఐదున్నరకే నిద్ర లేస్తున్నాను. రోజు మార్చి రోజు యోగా, జిమ్ చేస్తున్నాను. వారానికి ఆరు రోజులు చేస్తున్నాను. ఒక్క రోజు సెలవు తీసుకుంటున్నాను. బరువు తగ్గడానికి మరో కారణం ఆరోగ్య సమస్యలు. నిజం చెప్పాలంటే నేనెప్పుడూ ఓవర్ వెయిట్‌ని ఎంజాయ్ చేయలేదు. ఉన్నట్లుండి ఎందుకు బరువు పెరిగారు? ఆడవాళ్లకు హార్మోన్స్ సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యల వల్లే నేను విపరీతంగా బరువు పెరిగాను. మన సమస్యలను మనం తెలుసుకోగలగాలి. నేను, నా భర్త (వీర్) నా శరీరంలోని సమస్యకు మూలం ఏంటి? అనే దగ్గర నుంచి వర్కౌట్ చేయడం మొదలుపెట్టాం. సాధారణంగా ఏదైనా సమస్య వస్తే తాత్కాలిక పరిష్కారం కోసం చూస్తాం. కానీ మేం శాశ్వత పరిష్కారం కావాలనుకున్నాం. ఈ ఏడాది జనవరి నుంచి జిమ్, యోగా మొదలుపెట్టాను. కొత్త డైట్‌ని ఫాలో అవుతున్నాను. 2011 నుంచి 2016 వరకూ డిప్రెషన్లో ఉన్నాను. 2017లో నార్మల్ అయ్యాను. డిప్రెషన్లో ఉన్నప్పుడు మద్యానికి బానిస కావొచ్చు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మానసికంగా వేరే స్థితికి వెళ్లొచ్చు. లక్కీగా నేను ఆధ్యాత్మికం వైపు వెళ్లాను. ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అలాంటి సమయంలో వీర్ నా జీవితంలోకి వచ్చాడు. తను నా బ్యాక్‌బోన్‌లా మారిపోయాడు. నాలో చాలా స్ఫూర్తి నింపాడు. వీర్ లైఫ్ స్టయిల్ చాలా నేచురల్‌గా ఉంటుంది. అన్నీ ఆర్గానిక్, హెర్బల్స్ని తీసుకుంటాడు. ఇంగ్లీష్ మెడిసిన్‌ని ఇష్టపడడు. కెమికల్స్ ఎక్కువ ఉండవు. నన్ను కరెక్ట్ దారిలో పెట్టాడు. డాక్టర్స్‌ను సంప్రదించాం. సహజమైన పద్ధతిలో బరువు తగ్గే ప్రయత్నం మొదలుపెట్టా. ఈ బరువు తగ్గే విషయంలో మిగతా స్త్రీలకు ఉపయోగపడే టిప్స్ ఏమైనా? ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. నాకు పీసీఓడి, థైరాయిడ్ సమస్యలున్నాయి. వంశపారంపర్యం కూడా ఉంది. వీటన్నింటికి తోడు డిప్రెషన్‌తో బాధపడ్డాను. ఆ సమయంలో ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం అనే దాని మీద శ్రద్ధే ఉండదు. అలా బరువు పెరిగాను. వీర్ సపోర్ట్‌తో నా ఆరోగ్య సమస్య గురించి తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరూ తమ సమస్యని తెలుపుకోవాలి. బయటకు చెప్పడానికి మొహమాటపడకూడదు. డాక్టర్ దగ్గరికెళ్లడానికి సిగ్గుపడకూడదు. అప్పుడే మన సమస్యను మనం అధిగమించగలుగుతాం. ఎంత బరువు తగ్గారు? మీ డైలీ డైట్ ఏంటి? పది కిలోలు తగ్గాను. ఇంకో 7 కిలోలు తగ్గాలనుకుంటున్నాను. మేం రాగి, జొన్నలు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటున్నాం. వీటి ప్రభావం లాంగ్ రన్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. నేను ఉదయం నిద్ర లేవగానే ములక్కాడ ఆకుల రసం తీసుకుంటాను. ములక్కాడ ఆకుల రసానికి తేనె, నిమ్మరసం కలుపుతాను. 20 నిమిషాల తర్వాత జీలకర్ర వాటర్ తాగుతాను. రాత్రి మొత్తం జీరాను నానబెట్టి ఉదయాన్నే వేడి చేసి, తాగుతాను. మిగిలిన జీరాను నమిలేయాలి. కొంత సేపటి తర్వాత ఒక యాపిల్ తింటాను. జిమ్ లేదా యోగా నుంచి తిరిగొచ్చాక బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. ముస్లీ, డ్రై ఫ్రూట్స్, మిల్క్ లేదా పెరుగు తింటాను. లంచ్‌లో రాగి ఇడ్లీ, రాగి దోశె లేదా రాగి పనియారమ్ తింటాను. బ్రౌన్ రైస్ తీసుకుంటాను. రెండు గంటల తర్వాత ఒక గ్లాస్ కొబ్బరినీళ్లు తాగుతాను. రోజు మొత్తంలో సుమారు 6 నుంచి 7 లీటర్ల నీళ్లు తాగుతాను. రాత్రి డిన్నర్లో వెజిటేబుల్ సూప్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ బాగా ఆకలనిపిస్తే మా కుక్‌ను రాగి పనియారం చేయమంటాను. పూండు చట్నీ (వెల్లుల్లిపాయ చట్నీ), కొబ్బరి చట్నీతో తింటాను. పల్లీల చట్నీ అంటే నాకు బాగా ఇష్టం కానీ డైట్లో వద్దన్నారు. అందుకే పదిరోజులకోసారి పల్లీ చట్నీ తింటాను. ఈ డైట్‌ని ఎవరు చెప్పారు? నా డైట్ మొత్తం నా డైటీషియన్, వీర్ కలíసి ప్లాన్ చేశారు. ప్రస్తుతం మనందరం చాలా కాలుష్యంలో ఉంటున్నాం. దానివల్ల మనకు కావాల్సిన విటమిన్లు సరిగ్గా అందే అవకాశాలు తక్కువ. అందుకే ఒక్కోసారి విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటుంటాను. ఇవన్నీ డాక్టర్ల సూచన మేరకే వాడతాను. ఇదే డైట్‌ను ఎప్పటికీ కొనసాగిస్తారా? కొనసాగించాలనుకుంటున్నాను. అయితే ఒక సంవత్సరానికి మించి ఇదే డైట్‌ని ఫాలో అవ్వలేననిపిస్తోంది. స్వీట్స్ మానేశాను. మధ్యలో కీటో డైట్ కూడా పాటించాను. అది నాకు సరిగ్గా వర్కౌట్ కాలేదు. మా కజిన్ ఒకామెకు బాగా వర్కౌట్ అయింది. నో చాక్లెట్, నో స్వీట్స్ అంటే కష్టమేమో? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నాకు తీపి తినాలనే ధ్యాస పెద్దగా ఉండట్లేదు. లేకపోతే ప్రతి రోజూ డిన్నర్ తర్వాత ఏదో ఒక స్వీట్ తినాల్సిందే. ఇప్పుడు అలా లేదు. మిస్ అయినట్టే లేదు. నేనేనా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. డైట్ మొదలుపెట్టిన మూడునెలల తర్వాత మా ఊరికి వెళ్లాను. మా అమ్మగారు హల్వా తయారు చేశారు. మూడు నెలలకు తిన్న స్వీట్ అది. బరువు తగ్గాక శారీరకంగా చాలా మార్పు వచ్చింది. మరి మానసికంగా? ధ్యానం నన్ను ప్రశాంతంగా మార్చేసింది. నా ఆలోచనల్లో మెచ్యూర్టీ వచ్చింది. మనుషులను, వాళ్ల మనస్తత్వాలను ఇంతకు ముందుకన్నా బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎవరి ముందు ఏం మాట్లాడాలి? ఎవరి ముందు ఏం మాట్లాడకూడదు అని తెలుసుకుంటున్నాను. అవన్నీ మెల్లిమెల్లిగా అర్థం అవుతున్నాయి. ఈ మధ్యనే మా చుట్టాల ఇంటికి వెళ్లాను. అందరూ ‘భలే మెరిసిపోతున్నావు’ అన్నారు. నీలో సంతోషం మాత్రమే కనిపిస్తోంది అన్నారు. నా టెంపర్ పోయింది. రిలాక్డ్స్‌గా ఉంటున్నాను. కాన్ఫిడెంట్‌గా మారాను. ఈ మార్పు మొత్తం వీర్ నా జీవితంలోకి వచ్చిన తర్వాతే. తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు? నా కెరీర్‌ను తెలుగు సినిమాతోనే ప్రారంభించాను. తెలుగు పరిశ్రమకు రుణపడి ఉంటాను. మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నా. ఈ మధ్య స్టార్స్ అందరూ వెబ్ సిరీస్‌లో కూడా కనిపిస్తున్నారు. మీక్కూడా ఇంట్రెస్ట్ ఉందా? కథ బావుంటే ఏదైనా ఓకే. మీకు తెలుసో లేదో నేను కవితలు రాస్తుంటాను. నేను, వీర్ కలసి కొన్ని స్క్రిప్ట్స్ రాశాం. ఆ కథలను సినిమాగా అయినా, వెబ్ సిరీస్‌గా అయినా తీయొచ్చు. ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టాలనుకుంటున్నాం. పర్సనల్ లైఫ్‌లోకి వస్తే పిల్లలెప్పుడు? పెళ్లి సమయంలోనే ఇప్పుడే పిల్లలు వద్దు అనుకున్నాం. మా తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. మా అత్తామామలైతే ‘డైమండ్’ అనొచ్చు. చాలా స్వీట్‌గా ఉంటారు. అర్థం చేసుకుంటారు. పిల్లలెప్పుడు అని కంగారు పెట్టరు. తెలుగింటి కోడులుగా ఉండటం ఎలా ఉంది? వీర్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు తెలుగు సంప్రదాయ ప్రకారం పెళ్లి జరగాలా? మా గుజరాతీ స్టయిల్ వెడ్డింగ్ కావాలా అనేది నన్నే నిర్ణయించుకోమన్నాడు. చిన్నప్పటినుంచి గుజరాతీ పెళ్లిళ్లు చాలా చూశా. అవి బావుంటాయి. తెలుగు సంప్రదాయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని తెలుగు స్టయిల్లో చేసుకున్నాం. వీర్ వాళ్ల అమ్మానాన్నలకు కూడా మా అబ్బాయికి పెళ్ళి అయింది అనే ఫీలింగ్ ఉండాలి కదా. నేను ఎప్పుడూ వినని, తెలియని సంప్రదాయాలను చూశాను. మీ ఫ్యాన్స్‌కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తెలుగు ఫ్యాన్స్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బ్యాంగ్‌తో తిరిగొస్తాను. నాలుగైదు డిఫరెంట్ గెటప్స్‌లో నన్ను చూడబోతున్నారు. ఇకపై విభిన్నమైన రోల్స్ చేయనున్నాను. ‘నమిత ఈజ్ బ్యాక్’ అనేలా మంచి క్యారెక్టర్లు సెలక్ట్ చేసుకుంటాను. అవునూ... మీ భర్తను ‘స్వామీ’ అని పిలుస్తారట? ఇంతకుముందు వీర్ అని పిలిచేదాన్ని. ఆ మధ్యలో వీర్ అయ్యప్ప మాల వేసుకున్నాడు. అప్పుడు స్వామీ అని పిలుస్తాం కదా. అలా పిలవడం నాకు బాగా అనిపించింది. అందుకే ఎప్పటికీ ‘స్వామీ’ అని పిలవాలని డిసైడ్ అయిపోయాను. మీ భర్త సపోర్ట్ వల్లే మీరు బరువు తగ్గగలిగారా? అవును. అయితే ప్రాబ్లమ్ ఎక్కడ అంటే.. సన్నగా అవ్వాలనే ఆసక్తి భార్యకు కూడా ఉండాలి. భర్త డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా భార్య రాననడం నేను చాలా సందర్భాల్లో చూశాను. లావుగా ఉండడంవల్ల ఎక్కువ వయసున్నట్లు కనిపిస్తారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లని భర్తలు కూడా ఉంటారు. అప్పుడు వాళ్ల నాన్నలను అడగాలి. వినకపోతే రెండుమూడుసార్లు అడగాలి. లేకపోతే వాళ్లంతట వాళ్లే డాక్టర్ని సంప్రదించాలి. ఇంట్రెస్ట్ వాళ్లకే ఉండాలి. నా వల్ల కాదు, నాకు అక్కర్లేదు అనుకుంటే ఎవరు ఎంత సపోర్ట్ చేసినా ఉపయోగం ఉండదు. తన మార్పు మిగతావాళ్లకు ప్రేర ణ కలిగించాలి. నమితట్రాన్స్ఫర్మేషన్ వెనక ఉన్న కారణాలు రెండు. ఒకటి సినిమా. రెండోది వేరేవాళ్లు తనపై చూపించిన ఆసక్తి. ‘ఇంత బరువు పెరిగారు ఏంటి?’ అని అడిగేవాళ్లు. స్త్రీలు బరువు పెరిగితే వంద సమస్యలు ఉంటాయి. కానీ బయటకు చెప్పలేరు. ఎవరికైనా చెప్పినా పెళ్లయ్యాక పెరుగుతారులే అని కొట్టిపారేస్తారు. తగ్గడానికి ప్రయత్నించరు. వాళ్లకు స్ఫూర్తిగా నమిత ఉండాలన్నది నా ఉద్దేశం.తను సడన్‌గా ఎందుకు లావు అవుతోంది? ఎందుకు తగ్గుతోంది అనే ఆలోచనలో పడ్డాను. మనం తినేదాంట్లో సగం కూడా తినడం లేదు.. మరి ఎలా లావు అవుతోంది? అనుకున్నా. తను ఆరేళ్లు డిప్రెషన్లో ఉంది. దాంతో సిస్టమ్ దెబ్బతింది. డాక్టర్లను సంప్రదించి ఈ కోర్స్ మొదలుపెట్టాం. అందరూ లావు తగ్గటం పెద్ద టాస్క్ అనుకోకూడదు. అనుకుంటే తగ్గుతారు. –వీర్, నమిత భర్త – డి.జి.భవాని -
కోస్ట్‌గార్డ్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక నౌక ‘వీర’
-
కొస్ట్‌గార్డ్ అమ్ములపొదిలో అత్యాధునిక నౌక వీర
-
రాజకీయాల్లో సాధారణమే!
తమిళసినిమా: రాజకీయాల్లో ఇదంతా సాధారణమయ్యా! (అరసియలిల్ ఇదెల్లాం సాధారణమప్పా) పేరుతో ఒక విభిన్న కథా చిత్రం రూపొందింది. ఇందులో రాజతందిరం చిత్రం ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందిన వీరా కథానాయకుడిగా నటించారు. ఆయనకు జంటగా కూక్కూ చిత్రం ఫేం మాళవిక మీనన్ కథానాయకిగా నటించింది. చాలా చిత్రాలను నిరాకరించిన ఈమె ఈ చిత్ర కథ నచ్చడంతో నటించేందుకు అంగీకరించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. వాణిజ్య ప్రకటన రంగంలో పేరు గాంచిన అవినాశ్ హరిహరన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పంపిణీ రంగంలో నమ్మకమైన సంస్థగా పేరు గాంచిన ఆరా సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం అరసియలిల్ ఇదెల్లాం సాధారణమప్పా. ఈ సంస్థ అధర్వ, హన్సిక జంటగా 100 అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. అదే విధంగా త్వరలో ఆది హీరోగా తెలుగులో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్ఎక్స్ 100 చిత్రాన్ని రీమేక్ చేయనుంది. కాగా అరసియలిల్ ఇదెల్లాం సాధారణమప్పా చిత్ర వివరాలను నిర్మాత కావ్య వేణుగోపాల్ తెలుపుతూ ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు. చిత్రం గురించి తెలిసిన వెంటనే క్లాప్‌బోర్డు సంస్థ అధినేత సత్యమూర్తి తమిళనాడు విడుదల హక్కులను పొందారన్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఈ నెలాఖరున లేదా, సెప్టెంబరు తొలివారంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో నటుడు పశుపతి, రోబోశంకర్, నాన్ కడవుల్ రాజేంద్రన్, సేతన్, షారా ముఖ్య పాత్రలను పోషించారు. మ్యాడ్లీ బ్లూస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి సుదర్శన్ శ్రీనివాసన్ ఛాయాగ్రహణ బాధ్యతలు చేపడుతున్నారు.. -
పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లండీ!
ఆల్రెడీ మీరు విన్నారనుకుంటున్నా! తిరుపతిలో ఈ నెల 24న వీర (వీరేంద్ర), నేను ఏడడుగులు వేయబోతున్నాం. వీర ఎవరు? అంటే... హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ సోల్‌మేట్. అతనేం చేస్తాడు? అంటే... నిర్మాత. నటుడు కూడా. మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లండీ’’ అని నమిత చెప్పారు. ‘సొంతం’, ‘జెమిని’, ‘బిల్లా’, ‘సింహా’ తదితర చిత్రాల ద్వారా సుపరిచితురాలైన ఈ సూరత్ సుందరి ఆ తర్వాత ఎక్కువగా తమిళ చిత్రాలకు పరిమితమయ్యారు. ఇప్పుడు హఠాత్తుగా తన పెళ్లి తేదీ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. మరిన్ని విశేషాలను నమిత చెబుతూ – ‘‘గతేడాది సెప్టెంబర్‌లో మా ఇద్దరికీ బెస్ట్ ఫ్రెండ్ అయిన శశిధర్‌బాబు మమ్మల్ని ఒకరినొకరికి పరిచయం చేశాడు. మెల్లగా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఈ ఏడాది సెప్టెంబర్ 6న నన్నొక బీచ్‌కి తీసుకెళ్లాడు వీర. అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ ఎరేంజ్ చేశాడు. మాటల మధ్యలో చాలా రొమాంటిక్‌గా పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. నేను అసలు ఊహించలేదు. ఫుల్ ఫిదా. వెంటనే ‘యస్’ చెప్పేశా. వీర ప్రేమను అంగీకరించడానికి కారణం మా ఇద్దరి ఆలోచనలూ కలవడమే. మా ఇద్దరికీ దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. మా జీవిత లక్ష్యాలు ఇంచుమించు ఒక్కటే. ట్రావెలింగ్... ముఖ్యంగా ట్రెక్కింగ్ అండ్ నేచర్ అంటే ఇద్దరికీ ప్రేమ. ఇద్దరికీ మూగజీవాలంటే ఇష్టం. లైఫ్ అంటే ఎంతో ప్రేమ. నేనే సర్వస్వం అనుకునే వ్యక్తి లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. మూడు నెలలుగా అతణ్ణి (వీర) మరింత అర్థం చేసుకున్నా. అప్పుడు నేనింకా లక్కీ అనుకున్నా. వీర నాపై చూపిస్తున్న ప్రేమ, వాత్సల్యం, నాకిస్తున్న మద్దతు, అతని హుందాతనం మగవారిపై నా నమ్మకాన్ని మళ్లీ పెంచాయి. మాకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి నాకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులందరికీ థ్యాంక్యూ’’ అన్నారు. -
పోలో వీరుడు..
పిసాపోలో జాతీయ జట్టుకు ఎంపికైన వీరగంగాధర్ తునిరూరల్ (తుని) : ప్రోత్సహం లభించడంతో.. క్రీడల్లో అసమాన ప్రతిభతో మట్టిలో ఒక మాణిక్యం దేదీప్యమానంగా వెలిగింది. మండలంలోని శివారు గ్రామం ఎన్.ఎస్.వెంకటనగరానికి చెందిన కొల్లు వీరగంగాధర్ పిసాపోలో క్రీడలో జాతీయ స్థాయిలో కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించాడు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో ఫిన్లాండ్ దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ పిసాపోలో పోటీల్లో ఈతడు పాల్గొననున్నాడు. ఆ పోటీల్లో కూడా ప్రతిభ చూపి దేశం, రాష్ట్రం, గ్రామానికి ఖ్యాతి తెస్తానంటున్నాడు. రెండు నెలల్లోనే అత్యుత్తమ ప్రతిభతో జాతీయ జట్టులో స్థానాన్ని పొందిన ఈతడు.. ఉపాధ్యాయులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. వ్యయసాయ కుటుంబంలో పుట్టిన వీరగంగాధర్కు ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సహం లభించింది. కబడ్డీ, లాంగ్ జంప్, చౌక్‌బాల్ పోటీల్లో ఇతడు రాణిస్తున్నాడు. పదో తరగతి పరీక్షల కోసం.. ప్రస్తుతం ఇతడు ఎన్.సూరవరం జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఫిన్లాండ్ దేశంలో ప్రసిద్ధి కెక్కిన పిసాపోలో క్రీడలో ఇతడికి పీఈటీలు రాజు, విక్టర్ శిక్షణ ఇచ్చారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ కనబర్చడంతో జాతీయ స్థాయిలో గత జనవరిలో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రదర్శనతో సిల్వర్ ట్రోఫీ, మెరిట్ సర్టిఫికెట్‌ను సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఒలింపిక్స్‌లో ఆడడమే ధ్యేయం 2020లో పిసాపోలో ఒలింపిక్స్ క్రీడల్లో చేర్చే అవకాశం ఉన్నట్టు సెలక్టర్లు తెలిపారని, అందులోనూ పాల్గొని విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని వీరగంగాధర్ తెలిపారు. మంగళవారం నుంచి 15వ తేదీ వరకూ రాజస్థాన్‌లో నేషనల్ అకాడమీ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఇతడు పాల్గొనాల్సి ఉంది. అయితే పదో తరగతి పరీక్షలు సమీపించడంతో శిక్షణకు వెళ్లలేదు. ఈ విషయాన్ని పీఈటీల ద్వారా సెలక్టర్లకు తెలియజేస్తే.. మేలో జరిగే మూడో విడత శిక్షణకు హాజరయ్యేందుకు అంగీకరించారు. ఈ ఆటలో తొమ్మిది మంది ఆటగాళ్లు, ఇద్దరు అదనపు ఆటగాళ్లు ఉంటారన్నారు. జట్టులో రెండో స్థానంలో ఉన్నానన్నాడు. ఫిన్లాండ్ వెళ్లేందుకు పాస్‌పోర్టు, ఇతర ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు వెళ్లాలంటే రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని, ఇందుకు ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకరిస్తున్నారని చెప్పాడు. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొని గుర్తింపు తీసుకువస్తానని ఇతడు అంటున్నాడు. -
అతిసూక్ష్మ వీరబ్రహ్మేంద్రస్వామి
బాలాజీచెరువు (కాకినాడ) : గత వారం వినాయక నిమజ్ఞనం సందర్భంగా అతిసూక్ష్మ వినాయక ప్రతిమను తయారు చేసిన కళాకారుడు ఆరిపాక రమేష్ ఇప్పుడు తాజాగా మరో అతి సూక్ష్మ విగ్రహాన్ని తయారుచేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని సూదిలో ఇమిడేలా తయారుచేశారు. కేవలం 20 మిల్లీగ్రాములు బంగారంతో ఈ విగ్రహాన్ని తయారుచేశారు.