ఆల్రెడీ మీరు విన్నారనుకుంటున్నా! తిరుపతిలో ఈ నెల 24న వీర (వీరేంద్ర), నేను ఏడడుగులు వేయబోతున్నాం. వీర ఎవరు? అంటే... హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ సోల్‌మేట్. అతనేం చేస్తాడు? అంటే... నిర్మాత. నటుడు కూడా. మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లండీ’’ అని నమిత చెప్పారు. ‘సొంతం’, ‘జెమిని’, ‘బిల్లా’, ‘సింహా’ తదితర చిత్రాల ద్వారా సుపరిచితురాలైన ఈ సూరత్ సుందరి ఆ తర్వాత ఎక్కువగా తమిళ చిత్రాలకు పరిమితమయ్యారు. ఇప్పుడు హఠాత్తుగా తన పెళ్లి తేదీ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచారు.
మరిన్ని విశేషాలను నమిత చెబుతూ – ‘‘గతేడాది సెప్టెంబర్‌లో మా ఇద్దరికీ బెస్ట్ ఫ్రెండ్ అయిన శశిధర్‌బాబు మమ్మల్ని ఒకరినొకరికి పరిచయం చేశాడు. మెల్లగా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఈ ఏడాది సెప్టెంబర్ 6న నన్నొక బీచ్‌కి తీసుకెళ్లాడు వీర. అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ ఎరేంజ్ చేశాడు. మాటల మధ్యలో చాలా రొమాంటిక్‌గా పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. నేను అసలు ఊహించలేదు. ఫుల్ ఫిదా. వెంటనే ‘యస్’ చెప్పేశా. వీర ప్రేమను అంగీకరించడానికి కారణం మా ఇద్దరి ఆలోచనలూ కలవడమే.
మా ఇద్దరికీ దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. మా జీవిత లక్ష్యాలు ఇంచుమించు ఒక్కటే. ట్రావెలింగ్... ముఖ్యంగా ట్రెక్కింగ్ అండ్ నేచర్ అంటే ఇద్దరికీ ప్రేమ. ఇద్దరికీ మూగజీవాలంటే ఇష్టం. లైఫ్ అంటే ఎంతో ప్రేమ. నేనే సర్వస్వం అనుకునే వ్యక్తి లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. మూడు నెలలుగా అతణ్ణి (వీర) మరింత అర్థం చేసుకున్నా. అప్పుడు నేనింకా లక్కీ అనుకున్నా. వీర నాపై చూపిస్తున్న ప్రేమ, వాత్సల్యం, నాకిస్తున్న మద్దతు, అతని హుందాతనం మగవారిపై నా నమ్మకాన్ని మళ్లీ పెంచాయి. మాకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి నాకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులందరికీ థ్యాంక్యూ’’ అన్నారు.
పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లండీ!
Published Sat, Nov 11 2017 12:31 AM | Last Updated on Sat, Nov 11 2017 12:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment