భయపెడుతున్న బుడమేరు.. మళ్లీ పెరిగిన వరద | Budameru Water Level Increased Near Vijayawada, Know Reasons For This | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న బుడమేరు.. మళ్లీ పెరిగిన వరద

Published Wed, Sep 4 2024 5:12 PM | Last Updated on Wed, Sep 4 2024 8:25 PM

Budameru Water Level Increased Near Vijayawada

సాక్షి, ఎన్టీఆర్‌: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు మరోసారి భయపెడుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులోకి వరద ఉధృతి కొసాగుతోంది. దీంతో, వంతెనకు సమానంగా బుడమేరు ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

కాగా, బుడమేరులో వరద ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ క్రమంగా వరద పెరుగుతోంది. మంగళవారం సుమారు వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. కానీ బుధవారం ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో మరో అడుగు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం మూడు అడుగులకు చేరింది. మరోవైపు.. గడచిన 24 గంటల్లో జి.కొండూరు మండలంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఎగువన కురిసిన భారీ వర్షాలతో నందివాడలో కూడా బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో భయాందోళనలో బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు ఉన్నారు. మరోవైపు.. ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, బుడమేరు పరివాహాక ప్రాంతాల్లో బలహానంగా ఉన్న గట్లకు గండి పడకుండా ప్రజలు ఇసుక బస్తాలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఐదు దశాబ్దాల్లో ఈ తరహా బుడమేరులో ఇతంటి ఉధృతి చూడలేదని స్థానికులు చెబుతున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement