Budameru canal
-
‘ఆటో’ బతుకులు అస్తవ్యస్థం
సాక్షి, అమరావతి: ‘అటో డ్రైవర్ కె.శివారెడ్డి ఊర్మిళనగర్ రెండో లైనులో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలకు ఆ ఇల్లు మునిగిపోయింది. జీవనాధారమైన ఆటోతో పాటు ద్విచక్రవాహనం పూర్తిగా పాడైపోయాయి. సచివాలయ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. అప్పు చేసి ఆటోకు మరమ్మతులు చేయించుకుంటే రూ.45 వేలు ఖర్చయింది. ఇంటికిగానీ, వాహనాలకు గానీ పరిహారం ఇప్పించాలంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు.పదహారేళ్లుగా ఇదే ప్రాంతంలో ఆటో నడుపుతున్న నా పేరు ఎందుకు జాబితాలో లేదని ఎవరిని అడిగినా సమాధానం చెప్పడంలేదని వాపోతున్నాడు.’’...ఇది బుడమేరు వరదల్లో ఆటోలను కోల్పోయిన వేలాది మంది డ్రైవర్ల ఆవేదన. నగరంలో తిరిగే ఆటోలలో అతకధికం సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, కండ్రిగ, వాంబేకాలనీ, మిల్క్ ప్రాజెక్ట్, డాబా కోట్లు సెంటర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి కాలనీ, భరతమాత కాలనీ, ఊరి్మళనగర్ల నుంచే వస్తున్నాయి. అక్కడి నిరుద్యోగులు డ్రైవర్లుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరి జీవితాలు అస్తవ్యస్ధంగా మారాయి. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల బతుకు చిత్రంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది.మరమ్మతులకు కొత్త అప్పులురోజుల తరబడి ముంపులోనే ఉండటంతో ఆటోలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బయట మెకానిక్ దగ్గర నుంచి కంపెనీ షోరూమ్ వరకూ ఒక్కో దాని మరమ్మతులకే రూ.12 వేల నుంచి రూ.75 వేల వరకూ వ్యయం అవుతోంది. రేడియేటర్, ఇంజిన్, బ్యాటరీతో పాటు బీఎస్ 6 వాహనాల్లో సెన్సార్లు పాడవ్వడంతో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇన్ని వాహనాలకు మరమ్మతులు చేసేందుకు మెకానిక్‌ల కొరత ఉండటంతో రోజుల తరబడి మోటార్ షెడ్ల వద్దే ఆటోలు పడి ఉంటున్నాయి. ఒకసారి మరమ్మతు చేసినా మళ్లీ మళ్లీ కొత్త లోపాలు బయటపడుతున్నాయి. దీంతో కొత్త అప్పులు చేసి మరమ్మతులకు వెచి్చస్తున్నారు. ఉపాధి లేక, కుటుంబాలను పోషించుకోలేక, వాయిదాలు కట్టలేక అవస్థలు పడుతున్నామని డ్రైవర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంగానీ, స్థానిక ప్రజాప్రతినిధులుగానీ తమను అసలు పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.బీమా సంస్థల కొర్రీలువరద నీటిలో మునిగిన ఆటోలకు క్లెయిమ్‌లు ఎగవేసేందుకు బీమా సంస్థలు ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నాయి. బీమా చేసే సమయంలో డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి తెలియని షరతులను పొందుపరిచి వాటిని ఇప్పుడు సాకుగా చూపిస్తున్నాయి. ఒక ఆటోకి బీమా రావాలంటే సుమారు రెండు నెలలు సమయం పడుతుందని తప్పించుకుంటున్నాయి. అదికూడా వరద వచి్చనప్పటి నుంచి ప్రతి దశలోనూ తీసిన ఫొటోలు, వీడియోలు ఉంటేనే బీమా వర్తిస్తుందని మెలికపెడుతున్నాయి.ప్రాణాలే కాపాడుకుంటామా, ఫొటోలు తీస్తామా అంటూ బాధితులు అడుగుతుంటే బీమా సంస్థలు సమాధానం చెప్పడం లేదు. రెండు వారాల్లోనే క్లెయిమ్‌లు పూర్తి చేసేలా బీమా సంస్థలతో మాట్లాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఆచరణలో మాత్రం అది శూన్యం. బీమా సంస్థలు కనీసం 45 రోజుల పాటు ఆటోను ఉన్న చోటు నుంచి కదపకుండా ఉంచాలని చెప్పాయి. అప్పటి వరకూ మరమ్మతు చేయకపోతే మొత్తానికే పనికిరాదని, ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.పరిహారం లేదురాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సెప్టెంబర్ 1న విజయవాడలో వదర విలయం సృష్టించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి జీవనాధారాలైన ఆటోలు, మోటార్ సైకిళ్లు వరద నీటిలో పూర్తిగా మునిపోయాయి. రోజుల తరబడి బురద నీటిలోనే నానిపోవడంతో ఇంజిన్, సెన్సార్లు,కార్బొరేటర్ వంటి ముఖ్యమైన భాగాలు దెబ్బతిన్నాయి. ఆటోకి రూ.10 వేలు, ద్విచక్ర వాహనానికి రూ.3 వేలు చొప్పున పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం రకరకాల కొర్రీలతో మూడొంతుల మందిని మోసం చేసింది. ఆటో నడిపితేగానీ పూటగడవని నిరుపేదలు వాటిని బాగు చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ప్రభుత్వ కార్యాలయాలు,అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బుడమేరు వరదల వల్ల దాదాపు 15 వేలకుపైగా అటోలు నీట మునిగితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం కేవలం 6,515 మాత్రమే ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 4,348 ఆటోలకు పరిహారం అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. కానీ వాస్తవానికి మొత్తం బాధితుల్లో దాదాపు 80 శాతం మంది ఆటోవాలాలకు నష్టం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. చాలా మంది పేర్లు బాధితుల జాబితాలోనే లేవు..కొందరి పేర్లు ఉన్నా వారికి డబ్బులు పడలేదు.ఎవరూ పట్టించుకోవట్లేదు‘‘వరదల్లో ఇల్లు మునిగిపోయింది. ఆటో బాగా బెబ్బతింది. ప్రస్తుతానికి నడిచేలా చేయడానికి రూ.8 వేలు ఖర్చయ్యింది. ప్రభుత్వం రూ.10 వేల ఇస్తామని చెప్పింది. కానీ మా వివరాలను నమోదు చేయడానికి కూడా ఎవరూ రాలేదు. సచివాలయంలో అడిగితే కలెక్టరేట్‌కు వెళ్లమని చెప్పారు. అక్కడికి వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ –లింగయ్య, ఆటో డ్రైవర్, రాజీవ్‌నగర్ కాలనీజీవనాధారం పోతే పరిహారం రాదా?‘‘ఆటో నడిపితేగానీ మా కుటుంబం నడవదు. వరదల వల్ల ఆటో మునిగిపోయి జీవనాధారాన్ని కోల్పోయాం. బీమా రావాలంటే 45 రోజులు ఆటోను వాడకూడదంటున్నారు. బాగు చేయించుకునే స్తోమత కూడా లేదు. అయినా జాబితాలో మా పేరు లేదంటున్నారు. సచివాలయానికి వెళ్లి అడిగితే తమకేమీ తెలియని చెబుతున్నారు. మా గోడును ఎవరికి చెప్పుకోవాలి. మమ్మల్ని ఆదుకునేవారెవరు.’’ –బాబ్జి, ఆటో డ్రైవర్, రాజరాజేశ్వరిపేటఅద్దె ఆటోనే ఆధారం‘‘నేను ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. వరదకు ఆటో మునిగిపోయింది. ఎలాంటి పరిహారం రాలేదు. ఎవరిని అడిగినా ఎలాంటి ఉపయోగం లేదు.ఏం చేయాలో తెలియడం లేదు.’’ –దుర్గారావు, ఆటో డ్రైవర్, వాంబేకాలనీ.చాలా ఖర్చవుతోంది‘ఇంటర్ చదివి ఆటో నడుపుతున్నాను. మా నాన్న కూడా ఆటో డ్రైవరే. రెండు ఆటోలూ వరదలో మునిగిపోయాయి.ఒక సారి రిపేరుకి రూ.12 వేలు ఖర్చయ్యింది. కానీ మళ్లీ రేడియేటర్ పాడయ్యింది. నాలుగు రోజులుగా మెకానిక్ దగ్గరే పెట్టి బాగుచేయిస్తున్నాం.’’ –వై.సాయి, ఆటో డ్రైవర్, పాయకాపురం. -
ఆశలు సమాధి చేసి..
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ఎక్కడో ఒకచోట బతికే ఉంటాడు.. క్షేమంగా తిరిగొస్తాడు.. అని ఎదురు చూసిన వారి ఆశలు ఆవిరయ్యాయి. 15 రోజుల కిందట వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆర్ఆర్పేటకు చెందిన పోలినాయుడు ముఠా కూలీ. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీన ఉదయం పది గంటల సమయంలో తన పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా సింగ్‌నగర్, న్యూఆర్‌ఆర్‌పేట పరిసర ప్రాంతాలన్నీ బుడమేరు వరద ముంపునకు గురవుతున్నాయని తెలుసుకున్నాడు.ఇంట్లో వారికి ఫోను చేసి మరో పది నిమిషాల్లో సింగ్‌నగర్ దాటి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాడు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి న్యూ ఆర్‌ఆర్‌పేటలోని బుడమేరుపై ఉన్న వంతెన దాటుతుండగా ఒక్కసారిగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని స్నేహితుడు అతి కష్టం మీద బయటపడి విషయాన్ని పోలినాయుడు కుటుంబ సభ్యులకు, పోలీసులకు, అధికారులకు తెలియజేశాడు. అధికారులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. వరద ప్రవాహానికి ఎక్కడైనా వెళ్లి బయటపడి ఉంటాడని, క్షేమంగా తిరిగొస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నారు.అయితే ఆదివారం ఉదయం పోలినాయుడు గల్లంతైన ప్రదేశంలోని దేవినేని వెంకటరమణ మున్సిపల్ హైస్కూల్ వద్ద ఓ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలినాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా ముళ్ల చెట్ల మధ్యలో ఆయన ఒక చెట్టుకొమ్మను గట్టిగా పట్టుకుని నీటిలో పడి ఉన్నాడు. చేతికి ఉన్న ఉంగరం, దుస్తులను బట్టి కుటుంబ సభ్యులు పోలినాయుడేనని నిర్ధారించుకున్నారు. విషయాన్ని సింగ్‌నగర్ పోలీసులకు తెలియజేయగా వారు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ నేత కాళ్ల ఆదినారాయణ వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచి అంత్యక్రియలు జరిపించారు. వరద వదిలినా.. ఆ తల్లీ కొడుకుల్ని మృత్యువు వదల్లేదురామవరప్పాడు (విజయవాడ రూరల్): విజయవాడ పాత రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబాన్ని బుడమేరు వరద ముంచేసింది. ఆ ముంపునుంచి తప్పించుకున్నా.. చివరకు లారీ రూపంలో దూసుకొచి్చన మృత్యువు తల్లీ కొడుకుల్ని మింగేసింది. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఆదివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో స్కూటర్‌పై వెళ్తున్న పాతరాజీవ్నగర్ వాసులు లింగమనేని కృష్ణకుమారి (63), ఆమె కుమారుడు ప్రభుకుమార్ మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుడమేరు వరద కారణంగా పాత రాజీవ్‌నగర్‌లోని కృష్ణకుమారి ఇల్లు నీట మునిగింది.దీంతో ఆ కుటుంబం గుణదలలో ఉంటున్న కృష్ణకుమారి సోదరుడి ఇంటి వద్ద ఆశ్రయం పొందుతోంది. ప్రభుకుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వరద ముంపు తగ్గడంతో తమ ఇంటిని రెండు రోజుల నుంచి శుభ్రం చేసుకుంటున్నారు. ఆదివారం కూడా ఇంటిని శుభ్రం చేసుకున్న అనంతరం తల్లీకుమారులు స్కూటర్‌పై గుణదల బయలుదేరారు. రామవరప్పాడు రింగ్ సమీపంలో లారీని గమనించక వారు కుడి వైపునకు మళ్లారు. లారీ ఆ స్కూటర్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన తల్లీకుమారులు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. -
బుడమేరుకు మళ్లీ వరదనే పుకార్లు నమ్మొద్దు
-
వరదలతోనూ చంద్రబాబు కక్షపూరిత రాజకీయం: అంబటి
సాక్షి, తాడేపల్లి: బుడమేరు, విజయవాడ సంక్షోభంపై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీని టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారాయన. ప్రకాశం బ్యారేజీలో మూడు పడవలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడను ముంచెత్తిన వరదల్లో ముందు నుంచి చోటు చేసుకున్న వైఫల్యాలను కప్పి పుచ్చడానికే ప్రభుత్వం బోట్ల డ్రామా ఆడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. నిజానికి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీ కొట్టిన పడవలు టీడీపీ వారివే అని ఆయన స్పష్టం చేశారు. అయినా వాటిని వైయస్సార్సీపీకి అంటగట్టడం దారుణమన్న అంబటి, ఆ నింద మోపి తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు దారుణంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న మాజీ మంత్రి, ఈ వయసులో ఎందుకీ కుట్రలు, కుతంత్రాలు? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు విజనరీ, అడ్మినిస్ట్రేషన్ ఏమైందన్న ఆయన, ఈ వరదల్లో ప్రజల ప్రాణాలు ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై నంబూరి శంకరరావుపై మంగళవారం జరిగిన దాడి దుర్మార్గమన్న అంబటి, రాష్ట్రంలో యథేచ్ఛగా అధికార పార్టీ దురాగతం సాగుతోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో అసలు శాంతి భధ్రతలు ఉన్నాయా? అని గట్టిగా నిలదీశారు.ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలన్న చంద్రబాబు, విజయవాడ వరదల సంక్షోభంతో వైయస్సార్సీపీ నాయకులపై కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ను మూడు పడవలు ఢీకొట్టడంతో బ్యారేజ్ కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడిందని, దీనికి వైఎస్ఆర్సీపీ కారణం అని, ఇది ఒక కుట్ర అని చంద్రబాబు, మంత్రులంతా చెప్పడం, దానికి ఎల్లో మీడియా వంత పాడడం దారుణమని ఆయన ఆక్షేపించారు. తమ పార్టీ నేతలపై కేసులు పెట్టాలన్న లక్ష్యంగానే ఇదంతా జరుగుతోందన్న ఆయన, నిజానికి ప్రకాశం బ్యారేజ్‌ను కేవలం ఆ మూడు పడవలే కాకుండా, ఇంకా చాలా బోట్లు ఢీకొట్టాయని వెల్లడించారు. దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఈ మధ్యకాలంలో ఎన్నడూ రాలేదని, ఆ వరద ఉధృతికి పైనుంచి అనేక పడవలు కొట్టుకొచ్చాయని, వాటిలో టూరిజమ్ బోట్లు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ వరదల వల్ల 202 పడవలు పాక్షికంగా, 432 పడవలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కొన్ని వందల చిన్న బోట్లు బ్యారేజ్ గేట్ల మధ్య నుంచి కొట్టుకుపోయాయని చెప్పారు. ఈ కేసులో కోమటి రామ్మోహన్, ఉషాద్రిని అరెస్ట్ చేశారన్న ఆయన.. కోమటి రామ్మోహన్ టీడీపీ ఎన్నారై వింగ్ హెడ్ కోమటి జయరామ్‌కు సమీప బంధువని, ఉషాద్రి కూడా లోకేష్‌తో ఫోటో దిగారని గుర్తు చేశారు.అయినా ఆ ఘటనను వైయస్సార్సీపీకి అంటగడుతూ, తమ పార్టీ నాయకులు.. మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ను టార్గెట్ చేశారని అంబటి రాంబాబు ఆక్షేపించారు. తాము ప్రకాశం బ్యారేజ్ కూల్చే కుట్ర చేశామనడం దుర్మార్గమన్న ఆయన, ఇంత దారుణమైన మాటలు ఎందుకని?. కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. వీటన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని కోరారు. అధికార పార్టీకి అసెంబ్లీ, లోక్‌సభలో తగిన మెజారిటీ ఉన్నా, ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారని ప్రశ్నించారు. ‘చంద్రబాబు అంతగా ఎందుకు భయపడుతున్నారంటే.. వైఎస్ జగన్ వెనకున్న 40 శాతం ఓట్లు. ఇంకా కూటమి గెలుపు వారిది కాదన్న భయం. అందుకే జగన్‌గారిని ఏదో ఒక విధంగా అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు’.. అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఏ పడవలకైనా నీలి, పసుపు రంగులే ఉంటాయన్న ఆయన, కావాలంటే ఏ పోర్టుకైనా వెళ్లి చూడాలని హితవు చెప్పారు.విజయవాడను వరద ముంచెత్తడంతో 46 మంది చనిపోయినట్లు చెబుతున్నా, వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువని, ఆ వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని మాజీ మంత్రి తేల్చి చెప్పారు. ఘటన జరిగి 10 రోజులైనా ఇప్పటికీ బాధితులకు సాయం అందడం లేదని, ఇందులో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని స్పష్టం చేశారు. వరద గురించి ముందే తెలిసినా, రెండు లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు కాబట్టి, ఊర్కున్నామని రెవెన్యూ స్పెషల్ సీఎస్ చెప్పారన్న ఆయన, ఈ ఘటనలన్నింటిలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.బుడమేరును జగన్ నది అనడాన్ని చంద్రబాబు అపహాస్యం చేశారని.. నిజానికి అది 160 కి.మీ ప్రయాణించే చిన్న నది అని స్పష్టం చేశారు. మరోవైపు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావు వరద ప్రాంతాల పర్యటనకు వెళ్తుంటే, దాడి చేసి దౌర్జన్యంగా ప్రవర్తించారని, వాహనాలు ధ్వంసం చేశారని అంబటి రాంబాబు ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆ ఘటన విజువల్స్ మీడియకు చూపిన ఆయన.. ఇది అసలు ప్రజాస్వామ్యమేనా? రాష్ట్రంలో శాంతి భధ్రతలు ఉన్నాయా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందన్న ఆయన, పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని చెప్పారు. వెంటనే బాధ్యులందరిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని కోరారు.మీడియా ప్రశ్నలకు సమాధానంగా..బుడమేరు గండి పూడ్చడానికి మంత్రి రామానాయుడు అక్కడే ఉండాలా?. ఇది ప్రచార ఆర్భాటం కాదా?. అని అంబటి ఎద్దేవా చేశారు. అసలు ముందే అలెర్ట్ చేసి ఉంటే ఈ దారుణం జరిగేది కాదు కదా? అన్న ఆయన, ఇకనైనా ప్రభుత్వ పెద్దలు సొంత భజన మానుకోవాలని సూచించారు. -
బాబు తప్పిదమే ముంచేసింది
సాక్షి, అమరావతి: విజయవాడతోపాటు లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వకుండా బుడమేరుపై వెలగలేరు వద్ద ఉన్న రెగ్యులేటర్ గేట్లను శనివారం అర్థరాత్రి దాటాక హఠాత్తుగా ఎత్తివేయడంపై రిటైర్డు ఈఎన్సీలు (ఇంజనీర్–ఇన్–చీఫ్), చీఫ్ ఇంజనీర్లు, సాగు నీటిరంగ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం విజయవాడలో జల ప్రళయానికి.. కనీవినీ ఎరుగని ప్రాణ, ఆస్తి నష్టానికి దారి తీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం చెలగాటమాడేలా వ్యవహరించడంపై నివ్వెరపోతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల 30వతేదీ (శుక్రవారం), 31న (శనివారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని గత నెల 28న ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో శుక్రవారం పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు బుడమేరు ఉప్పొంగింది. శనివారం ఉదయానికి వెలగలేరు రెగ్యులేటర్ వద్దకు దూసుకొచ్చింది.బుడమేరు డైవర్షన్ ఛానల్ గుండా కృష్ణా నది వైపు పరుగులు తీసింది. ఎగువ నుంచి బుడమేరుకు భారీ వరద వస్తోందని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి, ఎస్ఈ, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు శనివారం ఉదయమే సమాచారం ఇచ్చామని డీఈ మాధవ్ నాయక్ ‘సాక్షి’కి చెప్పారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు వరద విజయవాడ చేరడానికి 20 గంటల సమయం పడుతుందని కూడా చెప్పామన్నారు. నిలువెల్లా నిర్లక్ష్యానికి తార్కాణం.. వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు దానికి దిగువన బుడమేరు పరీవాహక లోతట్టు ప్రాంతాల గ్రామాలు, విజయవాడలోని సింగ్ నగర్, కండ్రిక, పాత రాజరాజేశ్వరిపేట, పాయకాపురం తదితర కాలనీల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసేలా చాటింపు వేయించాలి. సురక్షిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాలకు తరలించాలి. ఆ తర్వాత గేట్లు ఎత్తడానికి వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బందికి అనుమతి ఇవ్వాలి. కానీ.. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బంది పంపిన సమాచారంపై శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ కనీసం స్పందించలేదు. కృష్ణా, బుడమేరు ఒకేసారి ఉప్పొంగడం.. బుడమేరు నుంచి 60 వేల క్యూసెక్కులపైగా వరద పోటెత్తడంతో సీఎం చంద్రబాబు ఇంటికి ముంపు ముప్పు ముంచుకొస్తుండటంతో శనివారం రాత్రి ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు ఇంటికి ముంపు ముప్పు తప్పించడం కోసం వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తేసి బుడమేరు వరదను మళ్లించాలని రెగ్యులేటర్ సిబ్బందిని ఆదేశించింది. విజయవాడలో జల ప్రళయం.. లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో శనివారం ఎప్పటిలానే బుడమేరు లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు, విజయవాడ ప్రజలు నిద్రకు ఉపక్రమించారు. అనంతరం రాత్రి వెలగలేరు రెగ్యులేటర్ గేట్లను ఎత్తేశారు. ఆదివారం తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న విజయవాడ లోతట్టు ప్రాంతాల వాసులపై బుడమేరు వరద ఒక్కసారిగా విరుచుకుపడింది. తేరుకునే లోపే బుడమేరు వరద చుట్టుముట్టి ఇళ్లను ముంచెత్తింది. జలప్రళయానికి దారి తీసింది. అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. చంద్రబాబు సర్కారు చారిత్రక తప్పిదం వల్లే ఈ ప్రళయం చోటుచేసుకుందని ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. గేట్లు ఎత్తాలంటే ప్రోటోకాల్ ఇదీ⇒ ఏదైనా ఒక ప్రాజెక్టు లేదా రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేయాలంటే సంబంధిత ప్రాజెక్టు ఎస్ఈ (సూపరిండెంట్ ఇంజనీర్), జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని ఆర్డీవో, ఆయా మండలాల తహసీల్దార్లకు కనీసం 12 గంటల ముందు సమాచారం ఇవ్వాలి. ⇒ ఇదే రీతిలో ప్రాజెక్టు ఉన్న జిల్లా ఎస్పీ, ప్రాజెక్టు దిగువ ప్రాంతాల పరిధిలోని డీఎస్పీ, సీఐలకు కూడా సంబంధిత ఎస్ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయాలి. ⇒ కలెక్టర్, ఆర్డీవోలు దీనిపై తక్షణమే స్పందించి సంబంధిత తహసీల్దార్లను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూ ఆయా ప్రాంతాల్లో చాటింపు వేయించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసుల సహకారంతో సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకు తరలించాలి. ⇒ లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించే ప్రక్రియ పూర్తయ్యాక గేట్లు ఎత్తాలి.ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చెందిన ప్లాంట్‌కు ఎన్వోసీని రద్దు చేస్తూ 2021లో ఇచ్చిన ఉత్తర్వులు ఆ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన రాధాకృష్ణ.. వాటిపై స్టే ఇచ్చిన హైకోర్టు రాధాకృష్ణకు రాసిచ్చారు..!బుడమేరు డైవర్షన్ ఛానల్(బీడీసీ)లో ఏడాది పొడవున రోజూ కనీసం 2 వేల క్యూసెక్కుల నీరు ఉంటుంది. ఈ నేపథ్యంలో బీడీఎస్‌పై 1,400 కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 1994లో జెన్కో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకోవడానికి సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు నాడు చంద్రబాబు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారు. 1,020 క్యూసెక్కులు వినియోగిస్తూ 500 కిలోవాట్ల సామర్థ్యంతో రెండు ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన ‘యాక్టివ్’ పవర్ ప్లాంట్‌కు 1998 ఏప్రిల్ 13న చంద్రబాబు అనుమతిచ్చారు. ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1,520 క్యూసెక్కులు వినియోగించి ఒక్కో కేంద్రంలో 700 కిలోవాట్లు ఉత్పత్తి చేసేలా 1999 ఫిబ్రవరి 15న అనుమతి ఇచ్చారు. అయితే కృష్ణాలో బుడమేరు ప్రవాహం కలవడానికి యాక్టివ్ పవర్ ప్లాంట్ అడ్డంకిగా మారింది. దాంతో వరద వెనక్కి ఎగదన్నడంతో బీడీసీ కరకట్టకు గండిపడి తరచూ విజయవాడ లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. బుడమేరు వరదతో 2005లోనూ ఇదే రీతిలో విజయవాడ ముంపునకు గురైంది. ఈ క్రమంలో బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచేలా ఆధునికీకరించడం ద్వారా విజయవాడకు ముంపు ముప్పును శాశ్వతంగా తప్పించే పనులకు 2008 ఆగస్టు 12న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పనులు చేపట్టడానికి వీలుగా 2009 ఆగస్టు 29న రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌కు నో అబ్జెక్షన్ సరి్టఫికెట్ (ఎన్వోసీ)ని రద్దు చేశారు. అయితే వైఎస్సార్ హఠాన్మరణంతో బీడీసీ ఆధునికీకరణ పనులు ముందుకు కదల్లేదు. రాష్ట్ర విభజనకు ముందు నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌కు షరతులతో ఎన్వోసీని పునరుద్ధరించింది. ఇక విభజన తర్వాత టీడీపీ సర్కారు రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడం కోసం బీడీసీ ఆధునీకరణను అటకెక్కించేసింది. అనంతరం 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక బీడీసీ ఆధునీకరణపై దృష్టి పెట్టింది. ఇందుకోసం 2021 జనవరి 6న రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌కు ఎన్వోసీని రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా ఎన్వోసీ రద్దుపై స్టే విధించడంతో బీడీసీ ఆధునికీకరణ పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి చెప్పాంశుక్రవారం బుడమేరు పరీవాహక ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో శనివారం బుడమేరుకు భారీ వరద వస్తుందని మాకు ముందే తెలుసు. వెలగలేరు రెగ్యులేటర్ వద్దకు 45 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశాం. గరిష్టంగా వరద వస్తున్న నేపథ్యంలో వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి శనివారం మధ్యాహ్నంలోపే సమాచారం ఇచ్చాం. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తిన 20 గంటల్లో విజయవాడకు వరద చేరుతుందని చెప్పాం. ప్రభుత్వ అనుమతితోనే శనివారం రాత్రి వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేశాం.– మాధవ్ నాయక్, డీఈ, వెలగలేరు రెగ్యులేటర్‘‘గత శనివారం ఉదయమే బుడమేరుకు ఎగువ నుంచి వరద ఉద్ధృతి ప్రారంభమైందన్నది ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. కృష్ణా నదికి గరిష్ట ప్రవాహం వస్తుందన్నది కూడా తెలుసు. వెలగలేరు రెగ్యులేటర్ దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు కావాల్సినంత సమయం ఉంది. కానీ.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా హఠాత్తుగా వెలగలేరు గేట్లు ఎందుకు ఎత్తేశారు? ఎవరు ఎత్తమన్నారు? విజయవాడలో జల ప్రళయానికి ఇదే కారణం. అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారి తీసింది. ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమే దీనికి కారణం’’ ఉమ్మడి రాష్ట్రంలో పలువురు సీఎంల వద్ద సలహాదారులుగా (జలవనరులు) పనిచేసిన రిటైర్డు ఈఎన్సీల నిశ్చితాభిప్రాయం ఇది.‘‘2005లో బుడమేరుకు 70–75 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది. నాడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాక వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం. అప్పటితో పోల్చితే ఇప్పుడొచ్చిన వరద తక్కువే. ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ఆశ్చర్యకరం. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు హఠాత్తుగా ఎత్తేస్తే విజయవాడను బుడమేరు ముంచెత్తుతుందని, భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించింది?’’ కృష్ణా డెల్టాలో సుదీర్ఘకాలం పనిచేసిన ఇంజనీర్ సూటి ప్రశ్న ‘‘2009 అక్టోబర్ 2న శ్రీశైలానికి 25.10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కృష్ణా నదికి వచ్చిన గరిష్ట వరద ఇదే. దాన్ని సమర్థంగా నియంత్రించి ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరే వరదను 11.10 లక్షల క్యూసెక్కులకు తగ్గించగలిగాం. విజయవాడకు ముంపు ముప్పు తప్పించాం. దాంతో పోల్చితే ఇప్పుడు కృష్ణాకు, బుడమేరుకు వచ్చిన వరద తక్కువే. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా నివారించి ఉండొచ్చు. కానీ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం విజయవాడలో జల విలయానికి దారితీసింది. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడంలో ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ పనితీరు ఎంత దయనీయంగా ఉందో బహిర్గతమవుతోంది’’ 2009లో కృష్ణా వరదలను సమర్థంగా నియంత్రించడంలో కీలక భూమిక పోషించిన రిటైర్డు ఈఎన్సీ -
బెజవాడ ‘ప్రళయానికి’ బాబే కారణం
సాక్షి, అమరావతి/జి.కొండూరు: కృష్ణా, బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీసీ) ఒకేసారి ఉప్పొంగాయి. ఉండవల్లి కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ సౌధాన్ని వరద చుట్టుముట్టే ప్రమాదం వచ్చింది. ఆ అక్రమ బంగ్లాను ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు అర్ధరాత్రి కుట్ర పన్నారు. బుడమేరు వరదను శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత (తెల్లవారుజామున) మళ్లించేశారు. ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వకుండా వెలగలేరు రెగ్యులేటర్ 11 గేట్లు ఒకేసారి ఎత్తేయడంతో 60 వేల క్యూసెక్కుల బుడమేరు వరద విజయవాడ నగరంపై పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చేసింది. ఇదే విజయవాడలో జలప్రళయానికి, భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం జమ్ములవోలు దుర్గం కొండల్లో పురుడుపోసుకునే బుడమేరు.. ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లాల్లో పలు వాగులను కలుపుకుని రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, విజయవాడ శివారులోని సింగ్‌నగర్, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ మీదుగా ప్రవహించి కైకలూరు మండలం ఇళ్లపర్రు వద్ద కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు పరివాహక ప్రాంతం 1,321 చదరపు కిలోమీటర్లు. బుడమేరు వరదల వల్ల గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాలు.. ప్రధానంగా విజయవాడ ముంపునకు గురయ్యేవి. అందుకే బుడమేరును బెజవాడ దుఃఖదాయిని అంటారు.బీడీఎస్‌పై రాధాకృష్ణకు పవర్ ప్లాంటువిజయవాడ, కృష్ణా జిల్లాలకు బుడమేరు ముంపు ముప్పు నుంచి తప్పించడానికి 1960లో వెలగలేరు వద్ద రెగ్యులేటర్ నిర్మించారు. అక్కడి నుంచి 7,500 క్యూసెక్కుల సామర్థ్యంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీఎస్) తవ్వి కృష్ణా నదిలో కలిపారు. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్) నుంచి 2 వేల క్యూసెక్కుల వేడి నీటిని కూడా బీడీఎస్‌లో కలిపేలా 1979లో మరో కాలువ తవ్వారు. అంటే ఏడాది పొడవునా బీడీఎస్‌లో రోజూ కనీసం 2 వేల క్యూసెక్కులు నీరు ఉంటుంది. దాంతో బీడీఎస్‌పై 1400 కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని 1994లో జెన్కో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే, 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకోవడానికి సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చంద్రబాబు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారు. 1020 క్యూసెక్కులు వినియోగిస్తూ 500 కిలోవాట్లు సామర్థ్యంతో 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన ‘యాక్టివ్’ పవర్ ప్లాంట్‌కు 1998 ఏప్రిల్ 13న చంద్రబాబు అనుమతిచ్చారు. ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1,520 క్యూసెక్కులు వినియోగించి ఒక్కో కేంద్రంలో 700 కిలోవాట్లు ఉత్పత్తి చేసేలా 1999 ఫిబ్రవరి 15న అనుమతి ఇచ్చారు. ముంపు శాశ్వతంగా తప్పించడానికిబుడమేరుకు 2005లో 70 వేల క్యూసెక్కుల వరద రావడంతో విజయవాడ ముంపునకు గురైంది. దాంతో బుడమేరు ముంపు ముప్పు నుంచి విజయవాడను శాశ్వతంగా తప్పించడంపై అధ్యయనానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు వెలగలేరుపై జి.కొండూరు మండలం కుంటముక్కల వద్ద మరో రెగ్యులేటర్ నిర్మించి 20 వేల క్యూసెక్కులను కృష్ణా నదిలో కలిపేలా డైవర్షన్ ఛానల్ తవ్వకం, బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచేలా ప్రణాళిక రూపొందించారు. రూ.241.45 కోట్ల ఖర్చుతో ఈ పనులు చేపట్టేందుకు 2008 ఆగస్టు 12న నాటి సీఎం వైఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈలోగా కృష్ణా డెల్టా ఆధునికీకరణలో భాగంగా ఎనికేపాడు నుంచి కొల్లేరులో కలిసే బుడమేరును అభివృద్ధి చేశారు. బీడీసీని ఆధునికీకరిస్తే రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌ను తొలగించాలి. ఇందుకోసం 2009 ఆగస్టు 29న రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ని రద్దు చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో బీడీసీ ఆధునికీకరణ పనులు ముందుకు కదల్లేదు. ఇది బాబు చేసిన తప్పేబుడమేరు వరద శనివారం గంటగంటకు పెరుగుతుండడంతో స్థానిక ఏఈ ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. వారు ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియజేస్తూ వచ్చారు. శనివారం మధ్యాహ్నం కలువూరు వద్ద హెడ్ రెగ్యులేటర్ లాకులు ఎత్తివేయాల్సిన అవసరం వస్తుందని కూడా ప్రభుత్వాధికారులకు సమాచారం అందించారు. ప్రభుత్వం అనుమతితోనే శనివారం రాత్రి లాకులు పూర్తిగా ఎత్తివేశారు. ఇలా ముందుగానే ప్రభుత్వానికి తెలిసినా విజయవాడ నగర పరిధిలోని లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయకపోవడం వెనుక సందేహాలు తలెత్తుతున్నాయి. ఒక్కసారిగా హెడ్ రెగ్యులేటర్ వద్ద నిల్వ ఉన్న వేలాది క్యూసెక్కుల వరద కిందకు వస్తున్న క్రమంలో ప్రభుత్వం ముందస్తుగా ఎటువంటి సమాచారం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.బీడీసీ ఆధునికీకరణను పట్టించుకోని టీడీపీ సర్కార్రాష్ట్ర విభజనకు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌కు కొన్ని షరతులతో ఎన్వోసీని పునరుద్ధరించింది. విభజన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడం కోసం బీడీసీ ఆధునికీకరణను అటకెక్కించేసింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక బీడీసీ ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఇందుకోసం 2021 జనవరి 6న రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌కు ఎన్వోసీని రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్వోసీ రద్దుపై హైకోర్టు స్టే విధించడంతో బీడీసీ ఆధునికీకరణ పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది.వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దుష్ప్రచారంచంద్రబాబు తప్పిదం వల్లే విజయవాడలో జలప్రళయం చోటుచేసుకుంది. అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వరద సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు సర్కార్ తీరుపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుండటంతో సీఎం చంద్రబాబు నుంచి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వరకూ ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైకి నెట్టేందుకు పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారు. బీడీసీ ఆధునికీకరణ పనులు 2014–19 మధ్య తాము చేపట్టామని, మిగిలిన పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేయకపోవడం వల్లే భారీ వరదకు బీడీసీ కరకట్టకు గండ్లు పడి విజయవాడలో జలవిలయం చోటుచేసుకుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.అర్ధరాత్రి వరద మళ్లించారువరద వస్తుందన్న విషయం మాకు చెప్పలేదు. అర్ధరాత్రి బుడమేరు నుంచి వరద వదిలారు. ఒక్కసారిగా వచ్చిన వరదతో ఇళ్లు నీటమునిగాయి. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.రోజానమ్మ, బాధితురాలు, సుందరయ్యనగర్ కట్ట ముందుగా హెచ్చరించలేదుఎటువంటి హెచ్చరికలు లేకుండా బుడమేరు వరద మాపైకి వదిలారు. వరద ఉధృతికి ఇళ్లు నీటమునిగాయి. వరద వచ్చిన నాటి నుంచి నేటి వరకు కంటిమీద కునుకు లేదు. తిందామంటే తిండిలేదు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణం. నల్లూరి లక్ష్మి, లక్ష్మీనగర్, 62వ డివిజన్ -
భయపెడుతున్న బుడమేరు.. మళ్లీ పెరిగిన వరద
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు మరోసారి భయపెడుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులోకి వరద ఉధృతి కొసాగుతోంది. దీంతో, వంతెనకు సమానంగా బుడమేరు ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.కాగా, బుడమేరులో వరద ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ క్రమంగా వరద పెరుగుతోంది. మంగళవారం సుమారు వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. కానీ బుధవారం ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో మరో అడుగు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం మూడు అడుగులకు చేరింది. మరోవైపు.. గడచిన 24 గంటల్లో జి.కొండూరు మండలంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఎగువన కురిసిన భారీ వర్షాలతో నందివాడలో కూడా బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో భయాందోళనలో బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు ఉన్నారు. మరోవైపు.. ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, బుడమేరు పరివాహాక ప్రాంతాల్లో బలహానంగా ఉన్న గట్లకు గండి పడకుండా ప్రజలు ఇసుక బస్తాలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఐదు దశాబ్దాల్లో ఈ తరహా బుడమేరులో ఇతంటి ఉధృతి చూడలేదని స్థానికులు చెబుతున్నారు. Why Vijayawada Floods Are a Man-Made DisasterThe primary cause of flooding in Vijayawada is the overflowing of the Budameru, not a breach. (breach happened on Sep 3, not before). It's called “The Sorrow of Vijayawada.” To mitigate this, the Budameru Diversion Channel (BDC) is… pic.twitter.com/AEMAJbZche— Gordon Gekko (@gultwarrior) September 4, 2024 -
మరోసారి.. గాంధీ హత్య
ఇబ్రహీంపట్నంలో అర్ధరాత్రి గాంధీ విగ్రహం తొలగింపు * కనీస జాగ్రత్త చర్యలు తీసుకోని అధికారులు * కాళ్లూ చేతులు విరిగిపోయిన వైనం * గుట్టుచప్పుడు కాకుండా బుడమేరులో పడేసిన సిబ్బంది * రాష్ట్ర ప్రభుత్వ తీరుపై స్థానికుల ఆగ్రహం.. సాక్షి ప్రతినిధి, అమరావతి / ఇబ్రహీంపట్నం: జాతిపితకు ఘోర అవమానం జరిగింది. యావత్తు దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా.. రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా మహాత్మాగాంధీ విగ్రహాన్ని పెకిలించి పారేసింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడికి కనీస గౌరవమైనా ఇవ్వకుండా ఏట్లో పడేసింది. తెల్లవారే కాలువలో మహాత్ముడి విగ్రహాన్ని చూసిన స్థానికుల్లో ఆగ్రహం మిన్నంటింది. కాళ్లూ చేతులూ విరిగిపోయిన దుస్థితిలో ఉన్న విగ్రహాన్ని బయటకు తీసుకువచ్చి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దేవుళ్లు, మహనీయుల విగ్రహాలను తొలగిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. చివరకు సుమారు ఏడు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన గాంధీ విగ్రహాన్ని కూడా తొలగించివేసింది. విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నం రింగ్‌రోడ్డు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి పొక్లెయిన్‌తో వచ్చిన ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది.. పోలీసు బందోబస్తు మధ్య గాంధీజీ విగ్రహాన్ని పెకిలించారు.నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విగ్రహం కాళ్లు, చేతులు విరిగిపోయాయి. దీంతో విగ్రహాన్ని ఎవరికీ కన్పించకుండా చేయాలని భావించిన అధికారులు దాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న బుడమేరులో పడేశారు. తెల్లవారిన తర్వాత విగ్రహం కన్పించకపోవడంతో స్థానికులు ఆరా తీశారు. వారికి రెవెన్యూ అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.కాసేపటికి బుడమేరులో పడి ఉన్న గాంధీజీ విగ్రహాన్ని కొందరు గమనించడంతో బయటకు పొక్కింది. స్థానికులు పెద్దయెత్తున గుమిగూడి విగ్రహాన్ని బయటకు తెచ్చారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. విగ్రహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించడానికి అధికారులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. విగ్రహ పునఃప్రతిష్టకు సబ్ కలెక్టర్ ఫోన్ ద్వారా ఇచ్చిన హామీతో నిరసనకారులు మధ్యాహ్న సమయంలో తమ ఆందోళన విరమించారు. ఏడు దశాబ్దాల చరిత్ర : ఇబ్రహీంపట్నం జాతీయ రహదారి నుంచి ఫెర్రీ స్నాన ఘట్టానికి వెళ్లే రోడ్డు ప్రారంభంలో త్రిభుజాకృతిలో ఏర్పాటు చేసిన గద్దెపై 1948లో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి గాంధీబొమ్మ సెంటర్ అనే పేరు వచ్చింది.విగ్రహం పాతబడి పోవడంతో తమ స్థలంలో గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్టించడానికి నేషనల్ హైవే అథారిటీ రోడ్డు పక్కన స్థలంతో పాటు విగ్రహాన్ని ఇచ్చింది. దీంతో 1999లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. పునఃప్రతిష్టించాల్సిందే..: ఈ విగ్రహం తొలగింపుపై స్థానికులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశాలతోనే అధికారులు తెగబడ్డారని ఆరోపిస్తున్నారు. విగ్రహాన్ని అదే స్థలంలో తక్షణం పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేస్తున్నారు.