
సాక్షి, విజయవాడ: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ వరద నీటిలో మునిగిపోయింది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ వరద నీటిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సందర్భంగా వరద బాధితుల్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని టీడీపీ కార్యకర్తలు, బాధితులు మండిపడుతున్నారు.
వరద బాధితులు(టీడీపీ అభిమాని) మాట్లాడుతూ.. విజయవాడలో వర్షాలు, వరద ముంపుపై మాకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు. మమ్మల్ని ఎవరూ అలర్ట్ చేయలేదు. బాధితులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫేయిల్ అయ్యింది. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము వెళ్లి వారిని తీసుకువస్తాం అంటే వెళ్లనివ్వడం లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క బోటు కూడా మా కోసం రాలేదు. కనీసం ప్రైవేటు బోట్లు అయినా తెప్పించాల్సింది. అది కూడా ప్రభుత్వం చేయడం లేదు. ప్రైవేటు బోట్లకు మేమే డబ్బులు ఇస్తాం. మా వాళ్లను రక్షించుకుంటాం. ఇప్పటికైనా వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడండి అంటూ వేడుకున్నాడు.
వరద బాధితుల్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వరస్ట్ అంటున్న టీడీపీ కార్యకర్తలు..
విజయవాడలో వరద ముంపుపై కనీసం అలెర్ట్ కూడా ఇవ్వలేదు
బాధితులకి కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ ఫెయిల్@JaiTDP కూటమి ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న టీడీపీ కార్యకర్తలు. pic.twitter.com/oTQdOAaSbb— YSR Congress Party (@YSRCParty) September 2, 2024
మరోవైపు.. కనీసం వరద ఉద్ధృతిపై అప్రమత్తం చేసి ఉన్నా జాగ్రత్తలు తీసుకునే వాళ్లమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి తిండి, నీరు లేదని.. కూటమి నేతలు తమని అస్సలు పట్టించుకోలేదని ఎల్లో మీడియా ముందే బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న వరద బాధితులు
కనీసం వరద ఉద్ధృతిపై అప్రమత్తం చేసి ఉన్నా.. జాగ్రత్తలు తీసుకునేవాళ్లమని ఆవేదన
నిన్నటి నుంచి తిండి, నీరు లేదని.. కూటమి నేతలు తమని అస్సలు పట్టించుకోలేదని ఎల్లో మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు pic.twitter.com/c0AjKStFZw— YSR Congress Party (@YSRCParty) September 2, 2024
.@JaiTDP కూటమి ప్రభుత్వం మమ్మల్ని గాలికొదిలేసింది.. విజయవాడలో తిట్టిపోస్తున్న వరద బాధితులు
సహాయక చర్యల్లేవు.. కనీసం తిండి, మంచి నీరు కూడా తమకి ఇవ్వడం లేదంటూ ఆవేదన
ప్రజల్ని అప్రమత్తం చేయడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం pic.twitter.com/aFuRVMBGFd— YSR Congress Party (@YSRCParty) September 2, 2024
Comments
Please login to add a commentAdd a comment