ఏపీలో వరద నష్టం.. కమిటీ వేసిన కేంద్రం | Central Committee Announced Over AP Flood Effects | Sakshi
Sakshi News home page

ఏపీలో వరద నష్టం.. కమిటీ వేసిన కేంద్రం

Published Wed, Sep 4 2024 7:52 PM | Last Updated on Wed, Sep 4 2024 8:24 PM

Central Committee Announced Over AP Flood Effects

సాక్షి, విజయవాడ: విజయవాడలో దారుణ పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యటిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు

కాగా, అమిత్‌ షా ట్విట్టర్‌ వేదికగా..‘విజయవాడ ముంపు, వరదలపై కేంద్ర కమిటీ నియామకం. కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ నేతృత్వంలో నిపుణుల కమిటీ నియామకం జరుగుతుంది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో ఈ కమిటీ పర్యటిస్తుంది. వరద నష్టం, వరద నివారణ, డ్యామ్‌ల భద్రతపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రేపు(గురువారం) కమిటీ ఏపీకి రానున్నట్టు సమాచారం. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement