central committe
-
ఏపీలో వరద నష్టం.. కమిటీ వేసిన కేంద్రం
సాక్షి, విజయవాడ: విజయవాడలో దారుణ పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యటిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారుకాగా, అమిత్ షా ట్విట్టర్ వేదికగా..‘విజయవాడ ముంపు, వరదలపై కేంద్ర కమిటీ నియామకం. కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ నేతృత్వంలో నిపుణుల కమిటీ నియామకం జరుగుతుంది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో ఈ కమిటీ పర్యటిస్తుంది. వరద నష్టం, వరద నివారణ, డ్యామ్ల భద్రతపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రేపు(గురువారం) కమిటీ ఏపీకి రానున్నట్టు సమాచారం. The Modi government is closely monitoring the ongoing flood situation in Andhra Pradesh. The MHA today constituted a central team of experts, led by the Additional Secretary (Disaster Management), MHA. The team will visit the flood-affected areas for an on-the-spot assessment…— Amit Shah (@AmitShah) September 4, 2024 -
కృష్ణా జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
-
బయటపడ్డ బాగోతం
-
కిడ్నీమార్పిడి కేసు..సెంట్రల్ కమిటీ వివరణ
గుంటూరు : కిడ్నీ మార్పిడి రాకెట్ గుట్టురట్టు కావడంతో సెంట్రల్ కమిటీ ఈ విషయంపై స్పందించింది. శుక్రవారం సెంట్రల్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..శివనాగేశ్వరరావు కిడ్నీ మార్పిడి వ్యవహరంలో విజయవాడ ఆయుష్ హస్పటల్ యాజమాన్యం నిబంధలు పాటించలేదని తెలిపారు. గుంటూరు వేదాంత ఆసుపత్రిలో మాత్రమే శివనాగేశ్వరరావుకు కమిటి పర్మిషన్ ఇచ్చిందని వివరించారు. ఆయుష్ ఆసుపత్రి శివనాగేశ్వరరావుకు కిడ్నీ మార్పిడికి సంబంధించి తమకు దరఖాస్తు చేసుకోలేదని వెల్లడించారు. ఒక ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడికి అనుమతి తీసుకుని మరో ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయించుకోకూడదన్నారు. ఏ ఆసుపత్రి అయినా కిడ్నీ మార్పిడి చేసే ముందు కిడ్నీ మార్పిడి కమిటి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. -
తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన
హైదరాబాద్: తెలంగాణలో సోమవారం నుంచి కేంద్ర బృందం పర్యటించనుంది. అకాల వర్షాలకు జరిగిన నష్టంపై పరిశీలన చేయనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి యూకే సింగ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులు పర్యటిస్తారు. మూడు బృందాలుగా ఆరు జిల్లాల్లో పర్యటించి వీరు పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో ఒక బృందం, కరీంనగర్, నిజమాబాద్ జిల్లాకు ఒకటి, నల్లగొండ, వరంగల్ జిల్లాకు మరో బృందం వెళ్లి పర్యటించనుంది. అకాల వర్షాలు, వడగళ్ల వాన కారణంగా రాష్ట్రంలో వ్యవసాయానికి రూ.150 కోట్లు నష్టం వాటిల్లునట్లు కేంద్రానికి ఇప్పటికే తెలంగాణ సర్కార్ నివేదిక సమర్పించింది.