హామీలిచ్చాం.. నిధులివ్వండి | Chandrababu met Union Home Minister Amit Shah | Sakshi
Sakshi News home page

హామీలిచ్చాం.. నిధులివ్వండి

Published Wed, Jul 17 2024 5:46 AM | Last Updated on Wed, Jul 17 2024 7:49 AM

Chandrababu met Union Home Minister Amit Shah

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఎన్డీయే కూటమి హామీలు ఇచ్చిందని, ఇవి సాధ్యం చేయాలంటే కేంద్రం నిధులు సమకూ­ర్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఏపీ సీఎం చంద్రబాబు కోరి­నట్లు తెలిసింది. అమరావతి అభివృద్ధికి నిధులు కావాలని చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు మంగళవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. 

అరగంటకు పైగా ఈ సమావేశం సాగింది. అనంతరం చంద్ర­బాబు మీడియాతో మాట్లా­డకుండానే బసకు చేరుకున్నారు. ఎన్నికల హామీలు, వాటి­కి సమకూర్చాల్సిన నిధులపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. హామీల అమలు, అమరావతి అభివృద్ధి.. ఇలా అన్నీ పూర్తి కావాలంటే ఏటా కనీసం రూ.20 వేల కోట్లు అయినా అవసరం ఉంటుందని, ఆ మేరకు ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేసి­నట్లు తెలి­సింది. 

అలాగే  విభజన హామీ­లకు సంబంధించి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధు­లు కేటా­యించాలని బాబు కోరి­నట్లు సమాచారం. సీఎం బుధవారం కేంద్ర ఆర్థిక­మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు పలు­వురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement