కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌కు సీఎం చంద్రబాబు వినతి
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌లతో భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, త్వరితగతిన నిధులు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులతో కలిసి చంద్రబాబు వివిధ శాఖల కేంద్ర మంత్రులకు వినతి పత్రాలను అందచేశారు. త్వరలో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో రాజధాని, పోలవరం, ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు.
అంతకుముందు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంను సీఎం చంద్రబాబు కలుసుకున్నారు. అనంతరం ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. కేంద్ర సామాజిక సాధికారిత సహాయ మంత్రి రాందాస్ అఠావాలేను కలిశారు. అశోకా రోడ్డులోని నివాసంలో వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్, ఎనీ్టపీసీ సీఎండీ గురుదీప్ సింగ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. పారిశ్రామిక వేత్తలతో చర్చల అనంతరం హైదరాబాద్‌కు పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment