ప్యాసివ్ ఫండ్స్‌ను ప్రోత్సహించే విధంగా సెబీ మ్యూచువల్ ఫండ్స్ లైట్ (ఎంఎఫ్ లైట్) నిబంధనల కార్యాచరణను ప్రకటించింది. ప్యాసివ్ ఫండ్స్ విభాగంలో కొత్త సంస్థల ప్రవేశాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పెట్టుబడుల వైవిధ్యాన్ని విస్తృతం చేయడమనే లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు), ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) సహా ప్యాసివ్ పథకాలకు ఈ కార్యాచరణ అమలవుతుందని సెబీ తెలిపింది.
ప్యాసివ్ ఫండ్స్‌ను మాత్రమే నిర్వహించే సంస్థలకు అవరోధాలను తొలగించడం, మార్కెట్లో లిక్విడిటీని పెంచడం, కొత్త సంస్థల ప్రవేశాన్ని సులభతరం చేయడం ఇందులో లక్ష్యాలని పేర్కొంది. ఎంఎఫ్ లైట్ నిబంధనలు 2025 మార్చి 16 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ సైతం ఎంఎఫ్ లైట్ సంస్థలకు మద్దతుగా (స్పాన్సర్) నిలవొచ్చని ప్రకటించింది. కాకపోతే కీలక స్థానాల్లోని ఉద్యోగులకు 20 ఏళ్ల అనుభవాన్ని అర్హతగా ఖరారు చేసింది. స్పానర్లకు సంబంధించి భిన్నమైన అర్హత ప్రమాణాలను నిర్ణయించింది. ఎంఎఫ్ లైట్ కార్యాచరణ తొలుత దేశీ ఈక్విటీ సూచీల ఆధారిత ప్యాసివ్ ఫండ్స్‌కు వర్తిస్తుందని తెలిపింది. యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ అందించే ప్రస్తుత సంస్థలు సైతం నూతన కార్యాచరణ కింద తమ ప్యాసివ్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను వేరొక సంస్థ కింద నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: మళ్లీ మొబైల్ టారిఫ్‌లు పెంపు..?
ఏమిటీ ఫ్యాసివ్ ఫండ్స్?
నిఫ్టీ 50 లేదా ఎస్ అండ్ పీ 500 వంటి ఒక నిర్దిష్ట మార్కెట్ ఇండెక్స్ పనితీరును ప్రతిబింబించడానికి ఉద్దేశించిన పెట్టుబడి సాధనాలే ప్యాసివ్ ఫండ్స్. యాక్టివ్ ఫండ్ల(ప్రత్యేకంగా ఫండ్ మేనేజర్ ఉండే మ్యుచువల్ ఫండ్స్) మాదిరిగా కాకుండా, ప్యాసివ్ ఫండ్స్ మార్కెట్ ఇండెక్స్‌ను అనుసరిస్తాయి. వీటికి ఎక్కువగా నిర్వహణ ఖర్చులు అవసరం లేదు. కాబట్టి కొంత యాక్టివ్ ఫండ్లతో పోలిస్తే రాబడులు మారవచ్చు. ఇది ఇండెక్స్‌ను అనుసరిస్తూ ఆయా విభాగాల్లోని మెరుగైన స్టాక్‌లను కలిగి ఉంటాయి. దాంతో డైవర్సిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది. నష్టభయం తక్కువగా ఉంటుంది. ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment