
చెన్నై: వాహన పరిశ్రమకు కావాల్సిన విడిభాగాల తయారీలో ఉన్న సుందరం ఫాస్టనర్స్ రూ.2,044 కోట్ల భారీ కాంట్రాక్ట్‌ను ఓ విదేశీ ఆటో కంపెనీ నుంచి దక్కించుకుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన సబ్ అసెంబ్లీస్, డ్రైవ్ గేర్ సబ్ అసెంబ్లీస్‌ను సుందరం ఫాస్టనర్స్ సరఫరా చేయనుంది. 60 ఏళ్ల కంపెనీ చరిత్రలో అతిపెద్ద ఈవీ కాంట్రాక్ట్ అని సంస్థ బుధవారం తెలిపింది.
నూతన ఆర్డర్‌ను అనుసరించి తయారీ కోసం రూ.200 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు సుందరం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీ, తమిళనాడులోని చెంగల్పట్టు వద్ద ఉన్న మహీంద్రా వరల్డ్ సిటీలో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి. డీల్‌లో భాగంగా 2026 నాటికి ఏటా 15 లక్షల యూనిట్ల ట్రాన్స్‌మిషన్ సబ్–అసెంబ్లీస్ సరఫరా చేసే అవకాశం ఉందని సుందరం అంచనా వేస్తోంది.
చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment