రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : రాయచూరు జిల్లా లింగస్గూరు తాలూకా హట్టి బంగారు గనుల కంపెనీ ఏడాదిలో రూ.130 కోట్ల లాభం గండించిందని కంపెనీ ఎండీ మోనప్ప వెల్లడించారు. ఆయన రాయచూరులో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. 2013-14లో 1,556 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేశామని, అయితే ఇది 2012-13తో పోల్చితే 26 కేజీలు తక్కువని వివరించారు.
ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధర పడిపోవడంతో 2014-15లో లాభాలు తగ్గే అవకాశముందన్నారు.
ఉత్పాదనకు అయ్యే ఖర్చును తగ్గించేందుకు రూ.105 కోట్లతో సౌరవిద్యుత్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
‘హట్టి’కి రూ.130 కోట్ల లాభం
Published Sat, Jun 7 2014 1:50 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement
Advertisement