‘మదర్‌’ మిమిక్రీకి ఫిదా అయిన బుమ్రా..! | Elder Lady Imitates Jasprit Bumrah Bowling Action | Sakshi
Sakshi News home page

‘మదర్‌’ మిమిక్రీకి ఫిదా అయిన బుమ్రా..!

Published Sun, Jul 14 2019 10:14 AM | Last Updated on Sun, Jul 14 2019 5:45 PM

Elder Lady Imitates Jasprit Bumrah Bowling Action - Sakshi

న్యూఢిలీ​ : టీమిండియా యార్కర్‌కింగ్‌, స్పీడ్‌గన్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఆటకే కాదు.. విభిన్నమైన అతని బౌలింగ్‌ శైలికి కోట్లాది మంది అభిమానులున్నారు. అద్భుతమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తూ బుమ్రా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. తక్కువ లెంగ్త్‌ తీసుకుని వేగంగా బంతులు విసిరే బుమ్రా బౌలింగ్‌ను ఓ క్రికెట్‌ వీరాభిమాని తల్లి అనుకరించారు. ఆమె మిమిక్రీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ‘యువత మాదిరిగానే.. పెద్దవాళ్లు కూడా ప్రపంచకప్‌లో బుమ్రా బౌలింగ్‌కు ఫిదా అయ్యారు. అందుకే మా అమ్మ అతని బౌలింగ్‌ శైలిని అనుకరించారు’అని ఓ అభిమాని ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఇది వైరల్‌ అయింది. పెద్దావిడ బౌలింగ్‌ అనుకరణకు బుమ్రా ఫిదా అయ్యాడు. ‘మీ ఉత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నింది’అని రిప్లై ఇచ్చాడు.

ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మూడేళ్లకాలంలోనే బుమ్రా టాప్‌ బౌలర్‌గా మారాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో నెంబర్‌ 1 పొజిషన్‌లో కొనసాగుతున్నాడు. ఇక తాజా ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లాడి 18 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. జట్టు విజయాల్లో ‘రోహిత్‌కు సమానంగా బుమ్రా’ కీలక పాత్ర పోషించాడని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొనడం గమనార్హం. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 18 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement