
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఫేస్ యాప్’ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. భవిష్యత్తులో, ముఖ్యంగా వృద్ధాప్యంలో వ్యక్తులు ఎలా ఉంటారో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఓ ఔత్సాహిక నెటిజన్.. భారత క్రికెట్ జట్టు సభ్యులు కడు వృద్ధాప్యంలో ఎలా ఉంటారో.. ఈ యాప్ ద్వారా రూపొందించి.. ట్విటర్‌లో షేర్ చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ తదితరులు వృద్ధాప్యంలోనూ విభిన్నమైన లుక్‌తో కనిపించి.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఫేస్‌యాప్ ద్వారా టీమిండియా క్రికెటర్ల రూపురేఖల్ని మార్చి.. వయోవృద్ధులుగా మలిచిన ఈ ఫొటోలు ఇప్పుడు నెటిజన్లను కితకితలు పెట్టిస్తున్నాయి.
ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ భారత జట్టుకు, టీమిండియా అభిమానులకు ఒకింత నిరాశనే మిగిల్చింది. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన టీమిండియా.. సెమీఫైనల్‌లో చేతులెత్తేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ధోనీ, రవీంద్ర జడేజాలు రాణించినా.. చివరిదశలో ధోనీ రన్నౌట్ కావడంతో భారత్ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ఒకింత బాధలో ఉన్న భారత క్రికెట్ ప్రేమికుల్ని.. టీమిండియా క్రికెటర్ల ఓల్డ్ మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఆ బాధను దూరం చేసి.. కొంత ఆనందాన్ని పంచుతోంది.
Ladies and Gentlemen presenting you the some faces of
— Mansi Singh (@MansiSingh99) July 16, 2019
2053 World Cup Winning Team 🥇
😏🤣🤣#FaceApp #faceappchallenge #MSDhoni #DhoniForever #TeamIndia #CWC19 #worldcup pic.twitter.com/RQM15a15qN

వృద్ధాప్యంలో ఇలా ఉంటారట మన క్రికెటర్లు