Fans Demand Remove Rohit Sharma From Captaincy Instead Himself Retire After India Lose WTC Final - Sakshi
Sakshi News home page

#RetireRohit: 'కెప్టెన్‌గా దిగిపో.. కాదంటే రిటైర్‌ అయిపో'

Published Sun, Jun 11 2023 7:14 PM | Last Updated on Mon, Jun 12 2023 11:54 AM

Fans Demand Remove Rohit Sharma From Captaincy Instead Himself Retire - Sakshi

డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలవ్వగానే అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓటమికి తొలి బాధ్యుడిగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మనే టార్గెట్‌ చేశారు అభిమానులు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం #Retire #Rohitsharma హ్యాష్‌ట్యాగ్స్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయంటేనే కోపం ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది.

ఇక అభిమానులు కూడా రోహిత్‌ను ట్రోల్‌ చేశారు. ''నువ్వు కెప్టెన్‌గా పనికిరావు.. నువ్వు ఏదో చేస్తావని కోహ్లి నుంచి నీకు ఇచ్చారు.. కానీ కెప్టెన్‌గా దారుణంగా విఫలమవుతున్నావు.. చేతగాకపోతే కెప్టెన్‌గా దిగిపో.. అదీ కాదంటే రిటైర్‌ అయిపో బాగుంటుంది.. ప్లీజ్‌రిటైర్‌ వడాపావ్‌'' అంటూ కామెంట్‌ చేశారు.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కనీసం పోరాడే ప్రయత్నం కూడా చేయకుండా ఆలౌట్‌ కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఏదో చేస్తారనుకున్న కోహ్లి, రహానేలు కూడా జట్టును రక్షించడంలో విఫలమయ్యారు. ఇక రోహిత్‌ శర్మ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.

రెండో ఇన్నింగ్స్‌లో ఆడిన బ్యాటింగ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆడి ఉంటే టీమిండియా పరిస్థితి కచ్చితంగా వేరుగా ఉండేది.  ఐపీఎల్‌లో నమోదు చేసిన చెత్త ప్రదర్శననే ఇక్కడా కొనసాగించాడు. ఒక కెప్టెన్‌ అయ్యుండి బాధ్యతగా ఆడాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకోవడం అతనికే చెల్లింది.

ఒక బ్యాటర్‌గా విఫలమైన రోహిత్‌.. తాజాగా కెప్టెన్‌గానూ పనికిరాలేకపోయాడు. కోహ్లి నుంచి కెప్టెన్సీ తీసుకున్న రోహిత్‌.. తాను నాయకుడిగా ఒక్క మేజర్‌ ట్రోఫీని గెలవలేకపోగా కొన్ని సిరీస్‌లు కోల్పోయాడు. రోహిత్‌ కెప్టెన్‌ అయ్యాకా టీమిండియా టి20 ప్రపంచకప్‌తో పాటు ఆసియా కప్‌ను గెలవలేకపోయింది.

తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ నిరాశే ఎదురైంది. దీనికి తోడు బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలకు అతని కెప్టెన్సీలోనే టీమిండియా సిరీస్‌ కూడా కోల్పోయింది.  ఇన్ని ప్రతికూలతల మధ్య రోహిత్‌ మరో నాలుగు నెలల్లో వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను నడిపించనున్నాడు. ఇక్కడ కూడా రోహిత్‌ విఫలమైతే కెప్టెన్సీ పోవడమే కాదు కెరీర్‌కు ఎండ్‌కార్డ్‌ పడే అవకాశం కూడా ఉంది.

ఇప్పటికిప్పుడు రోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని చెప్పలేం కానీ ఆ అవకాశముంది.  ఒకవేళ​ రోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తొలగిస్తే అతని ​స్థానంలో అజింక్యా రహానే కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే క్రమంగా టి20 కెప్టెన్సీ హార్దిక్‌ పాండ్యా చేతుల్లోకి వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. రానున్న టి20 సిరీస్‌ల్లో రోహిత్‌ ఆడడం అనుమానమే.. దీంతో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా జట్టును నడిపించడం దాదాపు ఖాయమే.

ఇక వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకొని రోహిత్‌ను కేవలం వన్డేలకే కెప్టెన్‌గా పరిమితం చేసే చాన్స్‌ కూడా ఉంది. ఈ లెక్కన రోహిత్‌ ఒకవేళ వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను విజేతగా నిలపకపోవతే కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగానూ అతని కెరీర్‌ ప్రమాదంలో పడ్డట్లే!

చదవండి: 'ఇదొక గుణపాఠం.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ మా కొంపముంచింది'

ఆస్ట్రేలియా చరిత్ర..  అన్ని ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement