హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫీవర్ అప్పుడే మొదలైంది. లీగ్ ప్రారంభానికి రెండు వారాలకు పైగా సమయం ఉండగానే సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఇవాళ తొలి టీమ్ మీటింగ్ జరిగింది. స్టార్ బౌలర్ టి నటరాజన్, లోకల్ ఆటగాళ్లు కొందరు ఇవాళ జరిగిన ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.
First team huddle of the season at Uppal ft. a whole lotta orange 🥹🧡 pic.twitter.com/JV4dvzwicE
— SunRisers Hyderabad (@SunRisers) March 5, 2024
ఆటగాళ్లకు చెందిన కొన్ని ఫోటోలను సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ లోకల్ టీమ్ కేకేఆర్‌ను ఢీకొంటుంది. తొలి విడతలో విడుదల చేసిన ఫిక్షర్స్‌లో సన్‌రైజర్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.
Nattu's #FlameComing 𝘢𝘯𝘵𝘦 wickets incoming 🤩
— SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024
Welcome back, @Natarajan_91 🧡 pic.twitter.com/sPyVJAGlVb
మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో, మార్చి 31 గుజరాత్ టైటాన్స్‌తో, ఏప్రిల్ 5 చెన్నై సూపర్‌కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. వీటిలో ముంబై ఇండియన్స్, సీఎస్‌కే మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగనుండగా.. గుజరాత్‌తో మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది.
Mark your dates, #OrangeArmy 😍
— SunRisers Hyderabad (@SunRisers) February 22, 2024
We start our 🔥 days against the Knights 🧡💜
And we’ll see you at Uppal on the 27th 😍#IPL2024 #IPLSchedule pic.twitter.com/j9kuIIDyfE
కొద్ది రోజుల కిందటే సన్‌రైజర్స్ యాజమాన్యం పాత కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్‌ను తప్పించి పాట్ కమిన్స్‌ను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసింది. కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ ఈ సీజన్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ టీమ్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అన్ని విభాగాల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లతో కళకళలాడుతుంది.
సన్‌రైజర్స్ జట్టు వివరాలు..
అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు
రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు
ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు
గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు
హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు
మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు
ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు
అన్మోల్‌ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు
ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు
షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు
నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు
అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు
మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు
వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు
సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు
పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు (కెప్టెన్)
భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు
టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు
వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు
మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు
ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు
ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు
జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు
ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు
ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ వివరాలు..
హెడ్ కోచ్: డేనియల్ వెటోరీ
బ్యాటింగ్ కోచ్: హేమంగ్ బదానీ
స్పిన్ బౌలింగ్ మరియు స్ట్రాటజిక్ కోచ్: ముత్తయ్య మురళీథరన్
ఫాస్ట్ బౌలింగ్ కోచ్: జేమ్స్ ఫ్రాంక్లిన్ (తాత్కాలికం)
అసిస్టెంట్ కోచ్: సైమన్ హెల్మట్
ఫీల్డింగ్ కోచ్: ర్యాన్ కుక్
Comments
Please login to add a commentAdd a comment