IPL 2024: సన్‌రైజర్స్‌, సీఎస్‌కే మ్యాచ్‌కు తొలగిన కరెంటు కష్టం | IPL 2024, SRH vs CSK: Power Supply Restored At Uppal Stadium | Sakshi
Sakshi News home page

IPL 2024: సన్‌రైజర్స్‌, సీఎస్‌కే మ్యాచ్‌కు తొలగిన కరెంటు కష్టం

Published Fri, Apr 5 2024 10:28 AM | Last Updated on Fri, Apr 5 2024 3:03 PM

IPL 2024 SRH VS CSK: Power Supply Restored At Uppal Stadium - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్‌ 5) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య బిగ్‌ ఫైట్‌ జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్‌కు ముందు రోజు బిల్లులు చెల్లించని కారణంగా ఉప్పల్‌ స్టేడియానికి పవర్‌ కట్‌ చేశారు అధికారులు. స్టేడియం నిర్వహకులు రూ. 1.67 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, అందుకే విద్యుత్‌ సరఫరా నిలిపివేశామని సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ సాధ్యాసాధ్యాలపై అభిమానులు ఆందోళన చెందుతుండగా అధికారులు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు విద్యుత్ అధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం విద్యుత్‌ పునరుద్దరణ జరిగింది. ఐపీఎల్‌ మ్యాచ్‌ దృష్ట్యా బిల్లులు చెల్లించేందుకు ఒక రోజు గడువు ఇచ్చినట్లు తెలుస్తుంది. విద్యుత్‌ అధికారులు వెసులుబాటును ఇవ్వడంతో సన్‌రైజర్స్‌, సీఎస్‌కే మ్యాచ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement