సన్‌రైజర్స్‌ తడబాటు... | Chennai won by 78 runs against Hyderabad | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ తడబాటు...

Published Mon, Apr 29 2024 4:05 AM | Last Updated on Mon, Apr 29 2024 4:05 AM

Chennai won by 78 runs against Hyderabad

చెన్నై చేతిలో 78 పరుగులతో ఓటమి 

చెలరేగిన రుతురాజ్, మిచెల్, తుషార్‌ 

చెన్నై: మొన్న బెంగళూరు  బౌలర్లు... ఇప్పుడేమో చెన్నై  బౌలర్లు... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బ్యాటర్ల ఆటల్ని సాగనివ్వలేదు. దీంతో 250 ప్లస్‌ స్కోర్లను అవలీలగా చేసిన హైదరాబాద్‌ తాజాగా 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోయింది. 

సొంతగడ్డపై చెన్నై 78 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీస్కోరు చేసింది.  కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (54 బంతుల్లో 98; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 

మిచెల్‌ (32 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌), శివమ్‌ దూబే (20 బంతుల్లో 39 నాటౌట్‌; 1 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది.  తుషార్‌ దేశ్‌పాండే (4/27) సన్‌రైజర్స్‌ ను దెబ్బ కొట్టాడు.  

స్కోరు వివరాలు 
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) షహబాజ్‌ (బి) భువనేశ్వర్‌ 9; రుతురాజ్‌ (సి) నితీశ్‌ (బి) నటరాజన్‌ 98; మిచెల్‌ (సి) నితీశ్‌ (బి) ఉనాద్కట్‌ 52; దూబే (నాటౌట్‌) 39; ధోని (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–19, 2–126, 3–200. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–38–1, నితీశ్‌ 1–0–8–0, షహబాజ్‌ 3–0– 33–0, నటరాజన్‌ 4–0–43–1, ఉనాద్కట్‌ 4–0–38–1, కమిన్స్‌ 4–0– 49–1. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) మిచెల్‌ (బి) తుషార్‌ 13; అభిõÙక్‌ (సి) మిచెల్‌ (బి) తుషార్‌ 15; అన్‌మోల్‌ప్రీత్‌  (సి) మొయిన్‌ అలీ (బి) తుషార్‌ 0; మార్క్‌రమ్‌ (బి) పతిరణ 32; నితీశ్‌ (సి) ధోని (బి) జడేజా 15; క్లాసెన్‌ (సి) మిచెల్‌ (బి) పతిరణ 20; సమద్‌ (సి) సబ్‌–రిజ్వీ (బి) శార్దుల్‌ 19; షహబాజ్‌ (సి) మిచెల్‌ (బి) ముస్తఫిజుర్‌ 7; కమిన్స్‌ (సి) మిచెల్‌ (బి) తుసార్‌ 5; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 4; ఉనాద్కట్‌ (సి) మొయిన్‌ (బి) ముస్తఫిజుర్‌ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్‌) 134. వికెట్ల పత నం: 1–21, 2–21, 3–40, 4–72, 5–85, 6–117, 7–119, 8–124, 9–132, 10–134  బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–22–0, తుషార్‌ 3–0–27–4, ముస్తఫిజుర్‌ 2.5–0–19–2, జడేజా 4–0–22–1, శార్దుల్‌ 4–0–27–1, పతిరణ 2–0–17–2. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement