హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా అన్నివిధాల సిద్దమైంది. శనివారం సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. ఆఖరి టీ20లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్‌టెన్ డోస్‌చేట్ విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు.
ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్నదే మా జట్టు, అభిమానుల కోరిక. కచ్చితంగా అలాగే ముగించేందుకు ప్రయత్నిస్తాము అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మనస్తత్వం గురించి మాట్లాడాడు.
దేశం తరపున ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని గంభీర్ భావిస్తాడు. ప్రతీసారి ఆటగాళ్లని కూడా ఒత్తిడికి గురిచేస్తాడన్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్‌కు కూడా అన్ని మ్యాచ్‌లకు సన్నద్దమైనట్లే సిద్దమయ్యాము. ప్రస్తుతం భారత జట్టు అద్బుతంగా ఆడుతోంది.
కుర్రాళ్లు కూడా బాగా రాణిస్తున్నారు. తొలిసారి భారత జట్టు తరపున ఆడుతున్న కుర్రాళ్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జితేష్ శర్మ, తిలక్ వర్మ, హర్షిత్ రానాలకు ఆడే అవకాశం ఇంకా రాలేదు. మూడో టీ20 జట్టు ఎంపిక కు ఈ యంగ్ ప్లేయర్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము. కుర్రాళ్లందరికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం వచ్చేలా ప్రయత్నిస్తున్నామని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ర్యాన్‌టెన్ డోస్‌చేట్ పేర్కొన్నాడు.
చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప
Comments
Please login to add a commentAdd a comment