టీమిండియాతో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో తలపడబోయే వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కోర్ట్నీ బ్రౌన్ నేతృత్వంలోని సెలక్షన్ బోర్డు జాసన్ హోల్డర్ సారథ్యంలోని 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అక్టోబర్‌లో కరీబియన్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా విండీస్ జట్టు టీమిండియాతో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
స్వదేశంలో జరిగిన సిరీస్‌లలో ఆకట్టుకున్న 36 ఏళ్ల సీనియర్ ఆటగాడు, టాపార్డర్ బ్యాట్స్‌మన్ డెవోనో స్మిత్‌కు జట్టులో చోటు దక్కలేదు. గాయం కారణంగా గత సిరీస్‌లకు దూరమైన సునీల్ ఆంబ్రిస్ తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్భుతంగా రాణిస్తున్న జాసన్ హోల్డర్‌పై సెలక్షన్ కమిటీ ప్రశంసల వర్షం కురిపించింది. తొలి టెస్టు మ్యాచ్‌కు రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదిక కానుండగా.. రెండో టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
తొలి టెస్టు: అక్టోబర్ 3 నుంచి 8 వరకు, రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియం
రెండో టెస్టు: అక్టోబర్ 12 నుంచి 16 వరకు, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం
విండీస్ టెస్టు జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషూ, బ్రాత్‌వైట్, రోస్టన్ చేస్, షేన్ డౌరిచ్, షెన్నాన్ గాబ్రియల్, జహ్మార్ హామిల్టన్, షిమ్రాన్ హెట్మెర్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, కీమో పాల్, కీరన్ పావెల్, కీమర్ రోచ్, జోమెల్ వరికన్.
Comments
Please login to add a commentAdd a comment