సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు మహిళలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తాయో చూస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీలు ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నాయని ఆమె ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ టికెట్ల పంపిణీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ట్విట్టర్ వేదికగా కవిత మండిపడ్డారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. పార్లమెంటులో మెజారీటీ ఉన్నా మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎందుకు నిలదీయడం లేదని కాంగ్రెస్ అధిష్టానాన్ని రేవంత్ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో 15 మందికి మాత్రమే అసెంబ్లీ సీట్లు కేటాయించారని, అక్కడ 34 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం దక్కిందని ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment