శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల | TTD is set to release the online quota of darshan for April 2024 | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

Published Thu, Jan 18 2024 9:58 AM | Last Updated on Thu, Jan 18 2024 10:52 AM

TTD is set to release the online quota of darshan - Sakshi

తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. .ప్రత్యేక దర్శనానికి 4 గంటలు సమయం పడుతుంది.  నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,263 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,518 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.65 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

 ఏప్రిల్ నెల‌ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల: శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల‌ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జనవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లను జనవరి 22వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు జరుగునుంది. ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

శ్రీ‌వాణి ట్ర‌స్టు బ్రేక్ ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.

వృద్ధులు, దివ్యాంగులకు ద‌ర్శ‌న టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం రూ.300 టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల చేస్తారు.

తిరుమ‌ల‌, తిరుప‌తిలో వ‌స‌తి గ‌దుల బుకింగ్‌ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.

భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement