
కొరుక్కుపేట(చెన్నై): చైన్నెలోని చేపాక్ మైదానంలో ఈనెల 12న చైన్నె – రాజస్థాన్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబందించి ఆదివారం టిక్కెట్ల విక్రయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐపీఎల్ సీజన్ ఈనెల 3న అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. చైన్నెలోని చేపాక్కంలోని ఎంఏ చిదంబరం గ్రౌండ్‌లో మొత్తం 7 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 3వ తేదీన లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో చైన్నె సూపర్ కింగ్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్ 12వ తేదీ రాత్రి చైన్నె సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. చేపాక్కం క్రికెట్ స్టేడియంలోని రెండు కౌంటర్లలో రూ.1,500 రూ.2,000కు విక్రయిస్తారు. టిక్కెట్లను టికెట్ కౌంటర్, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. రూ. 3,000 ధర కలిగిన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయిస్తారు. ఒక్కో వ్యక్తికి 2 టిక్కెట్ల కంటే ఎక్కువ ఇవ్వబోమని చైన్నె సూపర్ కింగ్స్ యాజమాన్యం తెలిపింది. మూడేళ్ల తర్వాత చైన్నె వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతుండడం ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమాను లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలో, అభిమానులకు విక్రయించే టిక్కెట్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment