ఇండియన్‌-2 బుకింగ్స్‌.. టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే? | Sankar And Kamal Haasan Bharateeyudu Movie Ticket Price Hike In Telangana, Check Rates Details | Sakshi
Sakshi News home page

Indian 2 Movie Tickets Prices: ఇండియన్‌-2 బుకింగ్స్‌.. టికెట్ రేట్లు ఎంత పెంచారంటే?

Published Wed, Jul 10 2024 5:23 PM | Last Updated on Wed, Jul 10 2024 6:44 PM

Sankar and Kamal haasan Indian 2 Ticket Price Hike In Telangana

శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్‌-2. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమవ్వగా.. చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఇండియన్-2 చిత్రబృందానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయుడు2 టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులిచ్చింది. దీంతో రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 చొప్పున టికెట్‌పై పెంచుకునేందుకు వీలు కల్పించింది.  ఈ నెల 12 నుంచి 19 వరకు వారం రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని ఉ‍త్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా వారం రోజుల పాటు ఐదో ఆట ప్రదర్శనకు కూడా ఓకే చెప్పింది.

కాగా.. ఇటీవల తెలంగాణ సీఎం డ్రగ్స్‌ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేలా వీడియోను తయారు చేసి ఇవ్వాలని సినీ ఇండస్ట్రీని కోరారు. అందులో భాగంగా కమల్ హాసన్, సిద్ధార్థ, సముద్రఖని లాంటి యాంటి డ్రగ్స్‌పై వీడియోను రిలీజ్ చేశారు. దీంతో టికెట్స్‌ పెంపుతో పాటు బెనిఫిట్ షో వేసుకునేందుకు అనుమతులు జారీ చేశారు. కాగా.. ఈ  చిత్రంలో ఈ సినిమాలో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్రఖని, ఎస్ జె సూర్య కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement