అభివృద్ధికి అడ్డంకిగా టీడీపీ అండ్‌కో | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి అడ్డంకిగా టీడీపీ అండ్‌కో

Published Sat, Sep 9 2023 12:34 AM | Last Updated on Sat, Sep 9 2023 2:37 PM

- - Sakshi

శ్రీకాకుళం: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి టీడీపీ, ఎల్లో మీడియా ఓర్వలేకపోతోంది. చెప్పినవన్నీ సీఎం జగన్‌ చేసేస్తుండటంతో బాబు అండ్‌ కో తట్టుకోలేకపోతున్నారు. రోజుకో రకంగా విషం చిమ్మడం, స్థానికులను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు కిడ్నీ రీసెర్చ్‌ కమ్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఇప్పటికే నిర్మితమైంది. ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు పూర్త యింది. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు వంశధార లిప్ట్‌ ఇరిగేషన్‌ యూ నిట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇంకోవైపు మూలపేట పోర్టు పనులు జెట్‌ స్పీడ్‌లో జరుగుతున్నాయి. ఇంకేముంది టీడీపీ అండ్‌కోకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

చూసి ఓర్వలే క మూల పేట పోర్టు పనులపై పడ్డారు. విషం చిమ్ముతూ స్థానికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక రకంగా మూలపేట పోర్టునైనా అడ్డుకుని, పనులు జరగకుండా బ్రేక్‌ వేయాలని చూస్తున్నారు.వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయరనే భ్రమలో ఇన్నాళ్లూ పచ్చగుంపు ఉండేది. కొన్నాళ్లు పనులు జరగలేదని దుమ్మెత్తిపోసింది. మరికొన్నాళ్లు పనులు పడకేశాయని దు ష్ప్రచారం చేసింది. ఇంకొన్నాళ్లు పనులు నిలిచిపోయాయని విష ప్రచారానికి ఒడిగొట్టింది. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం ఇవేవీ పట్టించుకోలేదు. అనుకున్నవన్నీ చేసేసింది. పది పైసల పనిచేసి వంద రూపాయల ప్రచారం చేసుకున్నట్టుగా కాకుండా సైలెంట్‌గా చేయాల్సిన కార్యక్రమాలన్నింటికీ శ్రీకారం చుట్టింది.

రూ.50కోట్లతో కిడ్నీ రీసెర్స్‌ కమ్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసేసింది. రూ.700కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేసింది. ఇప్పుడీ రెండూ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ముందే చెప్పినట్టుగా వంశధార జలాలను నిర్దేశిత ఆయకట్టుకు నీరందించే ఉద్దేశంతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు తాగునీటితో పాటు సాగునీరు అందించేందుకు దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తలపెట్టిన ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పనులను శరవేగంగా చేపడుతోంది. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తోంది.

నాగావళి–వంశధార నదుల అనుసంధానం ప్రాజెక్టు పూర్తి కావస్తోంది. వంతెనలు, రోడ్లు, పక్కా ఆస్పత్రి భవనాలు,విద్యాలయాలు.. ఇలా ఒకటేంటి అన్నీ ఏకకాలంలోనే జరుగుతున్నాయి. నాడు వైఎస్సార్‌ హయాంలో ఏ రకంగానైతే ల్యాండ్‌ మార్క్‌ ఉండేలా అభివృద్ధి పనులు జరిగాయో అంతకుమించి ఇప్పుడు జరుగుతున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

దీంతో టీడీపీ నాయకులకు, ఎల్లో మీడియాకు వణుకు పుట్టింది. దీంతో ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావాలని, గందరగోళం సృష్టించి రెచ్చగొట్టేందుకు ప్రేరేపిత కార్యక్రమాలు చేపడుతున్నాయి. చంద్రబాబు సభలకు, లోకేష్‌ యువగళం పాదయాత్రకు ప్రజా స్పందన లేక డైవర్షన్‌ రాజకీయాల్లో భాగంగా ఎక్కడికక్కడ దాడులకు పాల్పడుతున్నట్టు.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై కూడా లేనిపోని దుష్ప్రచారం చేసి, ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని చూస్తున్నాయి.

 ప్రస్తుతం జిల్లాలో స్పీడ్‌గా జరుగుతున్న మూలపేట పోర్టు పనులను అడ్డుకోవాలని టీడీపీ, ఎల్లో మీడియా కుట్ర పన్నాయి. ఇది కూడా పూర్తయితే టీడీపీ పుట్టి మునగడమే కాకుండా అచ్చెన్నాయుడు, గౌతు ఫ్యామిలీ రాజకీయాలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందన్న భయంతో అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయి. ఓ మాజీ సర్పంచ్‌, మండల పార్టీ అధ్యక్షుడిని ముందు పెట్టి, వారి వెనక ఓ 20 మందిని పంపించి తరుచూ పోర్టు పనులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ సానుకూలత రాకపోవడంతో స్థానికులను రెచ్చగొట్టేందుకు దుష్ప్రచారం చేస్తోంది.

ఒకరోజు టీడీపీ నాయకులు, మరో రోజు వారికి వత్తాసు పలుకుతున్న రాజకీయ నాయకులతో కలిసి పోర్టు పనులకు ఆటంకం కల్పిస్తుండగా, వారికి కొనసాగింపుగా ఈనాడు పత్రిక విషం చిమ్మే కథనాలు ప్రచురిస్తోంది. దాని వత్తాసుగా ఆంధ్రజ్యోతి అసత్యాలను వల్లె వేస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేసేలా కథనాలు వండి వార్చుతోంది. వీరి గూబ గుయ్యమన్నట్టుగా జిల్లా యంత్రాంగం అసత్య రాతలను ఖండించడమే కాకుండా వారి ఉద్దేశాలను కడిగిపారేసేలా, కుట్రలను చిత్తు చేసేలా బహిరంగ ప్రకటనలను విడుదల చేస్తోంది.

తామెన్నీ రాసినా ఏ ఒక్కరూ అడగరు.. పట్టించుకోరు అన్నట్టుగా రాస్తున్న కథనాలకు అధికారులు సైతం చెక్‌ పెట్టడం వారు ఊహించలేదు. జిరాయితీ భూముల్లో ఉన్న చెట్లకే పరిహారం ఇస్తామని యంత్రాంగం మొదటి నుంచి చెబుతుండగా దాన్నీ వక్రీకరించి ప్రభుత్వ భూము ల్లో ఉన్న చెట్లకు కూడా పరిహారం ఇస్తామని చెప్పి అన్యా యం చేశారని ‘ఈనాడు’ తప్పుడు కథనాలను రాసింది. ఇలాంటివి అనేక ఇవ్వని హామీలను ఇచ్చినట్టు పత్రికలో రాసి ప్రజల్ని గందరగోళానికి గురిచేసి, రెచ్చగొట్టే ప్రయ త్నం చేస్తోంది. మూడు అడుగుల ఎత్తు చేసిన భూముల్లో నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తుంటే... ముంపు ప్రాంతంలో పునరావాసం కల్పిస్తున్నారని అవాస్తవాలతో ‘ఆంధ్రజ్యోతి’ తప్పుడు కథనాలు వండి వార్చింది.

ఇలా రోజూ మూలపేట పోర్టుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూనే ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కనుసన్నల్లో ఆయన అనుచర వర్గం అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, చంద్రబాబు డైరెక్షన్‌లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు కథనాలు రాసి ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నాయి. కాకపోతే, స్థానికులెవరూ ఆ కథనాలను, దుష్ప్రచారాన్ని, టీడీపీ నేతల కుట్రలను నమ్మడం లేదు. కళ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి సంతోషిస్తున్నారు.

ముంపు లేదు
మూలపేట పోర్టు నిర్వాసితులకు కేటాయించిన పునరావాస స్థలం ముంపు ప్రాంతం కాదు. రేటు అయిన మా వ్యవసాయ భూములను అభివృద్ధికి సహకరించి ఇచ్చాము. పునరావాస ప్రాంతం అంతా మట్టి వేసి మూడు అడుగులు ఎత్తు చేశారు.
– కర్రి కాంతారావు, రైతు, నౌపడ

నిరాటంకంగా పనులు
పునరావాస కాలనీలో పనులు నిరాటంకంగా జరుగుతున్నాయి. నాణ్యతతో కూడిన పనులను చేపడుతున్నారు. మట్టి వేసి ఆ ప్రాంతం అంతా ఎత్తు చేశారు. యంత్రాల సాయంతో పను లు వేగంగా జరుగుతున్నాయి.
– పి. రవికుమార్‌రెడ్డి, నౌపడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement