పవిత్ర గోదావరి సమీపాన ఉజ్వరిల్లే నగరం రాజమహేంద్రవరం. ఇదొక చారిత్రక, సాంస్కృతిక రాజధానిగా ప్రతీతి చెందిన ప్రాంతం. హోల్ సేల్ వస్త్ర వాణిజ్యానికి చుక్కాని. నవ్య తూర్పు గోదావరి జిల్లాకు కేంద్రం. ఐదు లక్షలు పైగా జనాభాతో తులతూగే సిరులు కలిగిన నగరం. గత పాలకులు కేవలం పుష్కరాల సమయంలోనే నామమాత్రంగా పనులు చేసేవారు. కానీ నాలుగున్నరేళ్లలో నగర అభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
ఇందుకోసం సాధారణ, మున్సిపాలిటీ, ప్రత్యేక, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) నిధులు రూ.558 కోట్లు వెచ్చించింది. ఇందులో రూ.217 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి పథకాల నిర్వహణ చేపడుతోంది. పచ్చదనం పెంపొందించి, పార్కులను అభివృద్ధి చేస్తోంది. అర్బన్ ఫుడ్ ప్లాజా, కంబాల చెరువు పార్కు, పుష్కర ఘాట్ వద్ద పుష్కర ప్లాజా, హ్యాపీ స్ట్రీట్, ఫుడ్ స్ట్రీట్‌లను వినియోగంలోకి తీసుకు వచ్చింది. ప్రభుత్వ వైద్య కళాశాల తరగతులు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రూ.7 కోట్లతో 100 అడుగుల రోడ్ల అభివృద్ధి జరిగింది. నగర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.125 కోట్ల ప్రత్యేక నిధులు అందించారు. – షేక్ ఫయాజ్ బాషా, సాక్షి, రాజమహేంద్రవరం
మెడికల్ కళాశాల నిర్వహణ ఇలా..
► సెంట్రల్ జైల్ ప్రాంగణంలో రూ.475 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం
► అకడమిక్ కార్యకలాపాలకు ఉద్దేశించిన ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) నిర్మాణం
► 2023–24 విద్యా సంవత్సరానికి అందుబాటులోకి 150 మెడికల్ సీట్లు
► సిబ్బందికి టీచింగ్ స్టాఫ్ క్వార్టర్లు
► మెడికో హాస్టళ్లు
► నర్స్ హాస్టళ్లు
► ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, బోధనాసుపత్రిలో 54 మంది వైద్యులు,
► 484 మంది నర్సులు
► ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని 500 పడకల బోధనాసుపత్రిగా విస్తరణ
నాలుగున్నరేళ్లలో వివిధ అభివృద్ధి పనులకు విడుదలైన నిధులు
► రహదార్లు రూ.98 కోట్లు
► డ్రెయిన్లు రూ.54కోట్లు
► మంచినీటి సరఫరా రూ.28 కోట్లు
► వీధి దీపాలకు రూ.9 కోట్లు
► పార్కులకు రూ.9కోట్లు
► సుందరీకరణకు రూ.13 కోట్లు
► సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ రూ.16కోట్లు
► భవనాలు రూ.6 కోట్లు
► ప్రత్యేక నిధులు రూ.100 కోట్లు
► సీఎం మంజూరు చేసిన నిధులు రూ.125 కోట్లు
పురోగతి సాధించిందిలా..
► రూ.4.3 కోట్లతో 7.3 కిలోమీటర్ల మేర డివైడర్ల మధ్యలో పచ్చదనం
► 17 కిలోమీటర్లలో 15,000 మొక్కలు
► ఎయిర్‌పోర్టు రోడ్డులో 12 కిలోమీటర్ల మేర రుడా, మున్సిపల్ నిధులతో ఉద్యానవనం
► 40 ఎకరాల విస్తీర్ణంలో 37 పార్కుల సుందరీకరణకు మరో రూ.4.3 కోట్లు
► కొత్తగా 5 పార్కులు (మహాలక్ష్మి పార్క్, గాదాలమ్మ నగర్ పార్క్, ఏకేసీ పార్క్, అంబేద్కర్ పార్క్, సాయిచైతన్య కాలనీ పార్క్, ఎస్‌బీఐ కాలనీ పార్క్)
► రూ.7.26 కోట్లతో జంక్షన్ల ఆధునీకరణ
► రూ. 7.26 కోట్లతో పుష్కర ఘాట్, దేవీచౌక్, దండి మార్చ్ వంటి 12 జంక్షన్లు ఆధునికీకరణ
► రూ.4.6 కోట్లతో అధునాతన కమాండ్ కంట్రోల్ రూము, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
► వై–జంక్షన్, హ్యాపీ స్ట్రీట్ వద్ద రూ.1.2 కోట్లతో వాటర్ ఫౌంటేన్లు
► ఆర్ట్స్ కళాశాల వద్ద ఈట్ స్ట్రీట్ అందుబాటులోకి తెచ్చారు.
► రూ.1.2 కోట్లతో ఆనం కళాకేంద్రం వద్ద అతి పెద్ద ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం
► రూ. 2 కోట్లతో పద్మావతీ నగర్ పార్కు వద్ద చిన్నారులకు స్విమ్మింగ్ పూల్
► రూ.53.85 కోట్లతో నగరంలో 51 కిలోమీటర్ల మేర మురుగు కాలువల నిర్మాణాలు, ఆధునీకరణ పనులు
► ఇప్పటికే 39 కిలోమీటర్ల పనులు పూర్తి
► పురోగతిలో 12 కిలోమీటర్ల మేర పనులు
► రూ.5 కోట్లతో 5 అర్బన్ హెల్త్ సెంటర్ల మరమ్మతులు
► ఒక్కో కేంద్రానికి రూ.80 లక్షలు
► 6 యూపీహెచ్‌సీల నిర్మాణం పనులు
► గోదావరి నదిపై హేవలాక్ బ్రిడ్జిపై (పాత రైల్వే వంతెన) 2.7 కిలోమీటర్ల మేర ఆర్నమెంటల్ లైటింగ్
‘నాడు–నేడు’తో నూతన రూపు
► రూ. 28 కోట్లతో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా 35 పాఠశాలలు ఎంపిక
► మొదటి దశలో శ్రీ పంతం సత్యనారాయణ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్, లాలాచెరువు హైసూ్కళ్లు ఆధునికీకరణ. రెండో దశలో మరో 60 పాఠశాలల అభివృద్ధి
ప్రతిపాదనలు, టెండర్ల దశలో ఉన్న ప్రాజెక్టులు
► నాగులగుట్ట చెరువు వద్ద రూ.12 కోట్లతో క్రికెట్ స్టేడియం నిర్మాణం
► రూ.23 కోట్లతో గోదావరి తీరం వద్ద గోదావరి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఆధునీకరణ
► వీఎల్‌పురం వద్ద రూ.23 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం
► రానున్న రూ.80 కోట్లతో అమృత్ స్కీమ్‌తో చేపట్టనున్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం
► ఖేలో ఇండియా పథకం కింద రూ.40 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు
► రూ.3 కోట్లతో గాంధీ పురం వద్ద గ్లో గార్డెన్ నిర్మాణాలు
పర్యాటక కేంద్రంగా కంబాలచెరువు
- కంబాల చెరువు విస్తీర్ణం 10 ఎకరాలు
- పార్కులో 6 ఎకరాల్లో చెరువు అభివృద్ధి
- బోటింగ్ సదుపాయం
- 4 ఎకరాల్లో జాగింగ్ ట్రాక్,
- బోట్ సైక్లింగ్, 4 లేజర్ షో,
- 360 డిగ్రీ సైక్లింగ్,
- 360 డిగ్రీ అమ్యూజ్ మెంట్ రైడ్,
- ట్రాంపోలిస్ ఎక్విప్‌మెంట్,
- స్కై బెలూన్ (చిల్ర్డన్స్),
- స్కై రోలర్,
- వాటర్ వాకింగ్ బాల్స్,
- బాడీ బార్బింగ్ బాల్స్,
- 4 పురుషుల జిమ్,
- సీటింగ్ గ్యాలరీ,
- మెయిన్ ఎంట్రన్స్ ప్లాజా,
- ఓఏటీ జోన్,
- స్టేట్ ప్రైడ్ జోన్,
- చిల్ర్డన్స్ ప్లే ఏరియా
- ఆక్వా లేజర్ షో
- చౌడేశ్వర్ నగర్‌లో రూ. 3 కోట్లతో గ్లో థీమ్ పార్క్
- రూ.90 లక్షలతో సివిల్ పనులు
- రూ.2 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టారు.
- అందుబాటులోకి 300 మీటర్ల వాకింగ్ ట్రాక్
బాపూజీ స్ఫూర్తికి నిదర్శనం దండి మార్చ్
మహాత్మా గాంధీ రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నగరాన్ని బాపూజీ ఐదుసార్లు సందర్శించారు. ఆ అనుబంధానికి ప్రతీకగా దండి మార్చ్ రూపుదిద్దుకుంది. ఇందుకోసం రూ.1.5 కోట్లు నిధులు వెచ్చించారు. 200 మీటర్ల పుష్కర ప్లాజా రోడ్డును పూర్తిగా ఆధునీకరించారు. సందర్శకులు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సైన్ బోర్డులు, విద్యుద్దీపాలతో అలంకరించారు. పచ్చదనం పెంపొందించడంతో సెల్ఫీల కోసం యువత పోటీ పడుతోంది. ఏకేజీ కళాశాల వద్ద రూ. 80 లక్షలతో ఏర్పాటైన హ్యాపీ స్ట్రీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
జగనన్న స్మార్ట్ రోడ్స్
► రూ. 8.5 కోట్లతో ‘జగనన్న స్మార్ట్ రోడ్లు
► వై జంక్షన్ నుంచి లాలాచెరువు జంక్షన్ వరకూ 3 కిలో మీటర్లు అధునాతన రహదారి
► రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పున ఫుట్‌పాత్‌లు
► మధ్యలో ఆహ్లాదాన్ని నింపేలా ముచ్చటగొలిపే ఉద్యానవనాలు
► అక్కడక్కడా అందుబాటులోకి సెల్ఫీ స్పాట్లు
► గోడలపై రంగురంగుల బొమ్మలు
► రూ.5 కోట్లతో వై–జంక్షన్ నుంచి పుష్కర ఘాట్ వరకు ఫుట్‌పాత్‌లు, పార్కింగ్, డస్ట్‌బిన్స్
► రూ.12.6 కోట్లతో 16 కిలోమీటర్ల మేర 15 రకాల రహదారుల నిర్మాణం
ప్రశాంత వాతావరణంలో జీవించాలి
ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలి. రోడ్డు, డ్రెయిన్లు, వీధి దీపాలు, పార్కులను ఆధునీకరించాం. పచ్చదనాన్ని పెంపొందిస్తున్నాం. తాగునీటి పనుల నిర్వహణకు పెద్దపీట వేస్తున్నాం. నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటాం. – కె.మాధవీలత, కలెక్టర్, తూర్పు గోదావరి
హరిత నగరంగా తీర్చిదిద్దుతాం
సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆహ్లాదకర ప్రదేశాలతో హరిత నగరంగా తీర్చిదిద్దుతున్నాం. న్యూయార్క్, ఇంగ్లండ్ దేశాల్లో ఓపెన్ ఆడిటోరియంలలో ఓపెన్ స్క్రీన్‌లపై చిత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ ఆనందంగా గడుపుతూంటారు. అలాంటి అనుభూతిని కల్పించేందుకు ఆనం కళాకేంద్రంలో ఓపెన్ స్క్రీనింగ్ ఆడిటోరియం తీర్చిదిద్దుతున్నాం – కె.దినేష్ కుమార్, కమిషనర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ
Comments
Please login to add a commentAdd a comment