
పినాకిని నది సాక్షిగా జిల్లా కేంద్రం నెల్లూరులో ప్రగతి పరుగులు పెడుతోంది. నగరం సరికొత్త హంగులను సంతరించుకుంటోంది. సింహపురి రూపురేఖలు మారిపోయి కొత్త సొబగులను అద్దుకుంది. ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచేలా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారు. నెల్లూరులో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.వంద కోట్లకు పైగా ఖర్చు చేసింది. నగరంలో ఇప్పటికే 90 శాతం రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టులు, పైపులైన్లు నిర్మాణం పూర్తి కాగా మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి కానున్నాయి. - చిలకా మస్తాన్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, నెల్లూరు
నెల్లూరు కార్పొరేషన్ పరిధి – 149.20 చదరపు కి.మీ.
జనాభా (2011 ప్రకారం) 6 లక్షలకు పైగా ప్రస్తుత
జనాభా (అంచనా) 8 లక్షలకు పైగా
నాడు
టీడీపీ పాలనలో నేతల కుమ్ములాటలు, నిధులు మంజూరులో జాప్యం, ఖర్చు పెట్టడంలో నిర్లక్ష్యం. నీరు–చెట్టు, ఇసుక, మద్యంలో నిధుల స్వాహా, గుంతల రోడ్లు, అస్తవ్యస్త డ్రైనేజీ, మురికి కూపంలా పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తాగునీటి సమస్యలు. నగరం మొత్తం దుమ్ము, ధూళి, ఏ వీధి చూసినా చెత్త కుప్పలు. వెరసి పడకేసిన అభివృద్ధి.
నేడు
నగరంలోని జంక్షన్లు అభివృద్ధి చెందాయి. రోడ్లు విశాలంగా మారాయి. వివిధ ప్రాంతాల్లోని 12 జంక్షన్లను సుందరీకరించారు. అభివృద్ధి పనులకు రూ.వంద కోట్లు ఖర్చు పెట్టారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమయ్యాయి. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. క్రమంగా సింహపురి నగర రూపురేఖలు మారుతూ వచ్చాయి. ఈ మార్పు కేవలం నాలుగున్నరేళ్లలోనే సాధ్యమైంది. నగర వాసుల కష్టాలకు చెక్ పడింది.
ఫ్లై ఓవర్ వంతెన.. సీసీ రోడ్ల నిర్మాణం
కేంద్ర నిధులతో నగరంలోని మినీబైపాస్ రోడ్డు, రామలింగాపురం జంక్షన్ వద్ద రూ.41.88 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో 810 మీటర్ల పొడవున ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. తద్వారా ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరాయి. రూ.9 కోట్లతో 2.7 కి.మీ. మేర మైపాడు ప్రధాన రహదారిని నాలుగు లేన్ల సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. నగరంలోని జీఎన్‌టీ రోడ్డు, మినీబైపాస్ రోడ్డు, స్టోన్‌హౌస్‌పేట తదితర ప్రాంతాల్లో దాదాపు 23 కి.మీ. మేర రూ.60 లక్షలు వెచ్చించి సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేశారు.
వేగంగా ప్రగతి బాటలు..
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నీటి సరఫరా, డ్రైనేజీ, చెత్త సేకరణ, వీధిదీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్స్, సఫాయి మిత్ర ప్రైజ్ మనీ వంటి వివిధ వనరుల నుంచి రూ.8.5 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
బాగుపడ్డ ప్రభుత్వ బడులు
నాడు–నేడు ఫేజ్–2 కార్యక్రమం మంజూరైన నిధులు – రూ.31 కోట్లు
►ఇందులో కొత్త ఏసీఆర్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలు, మరమ్మతులు, పునరుద్ధరణలు, 47 పాఠశాలలు నిర్మాణాలు ఉన్నాయి. వాటితోపాటు 101
అదనపు తరగతి గదులు కూడా స్లాబ్ లెవల్‌కు పూర్తయ్యాయి.
►‘గడప గడపకు మన ప్రభుత్వం’లో మంజూరైన నిధులు – రూ.46.60 కోట్లు
►నగర వ్యాప్తంగా చేపట్టిన పనుల వివరాలు – 598
►పూర్తయిన పనులు – 288
►వీటికైన ఖర్చు – రూ.18.93 కోట్లు
►పురోగతిలో ఉన్న పనుల వివరాలు –182
►చేపట్టాల్సిన పనులు – 128
సొంతింటి కల సాకారం
►టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్లు: 22,512
►నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాలు: వెంకటేశ్వరపురం, అల్లీపురం, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి, కొండ్లపూడి
► నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఏర్పాటైన లే అవుట్‌లు: 10
►ఇందుకోసం చేసిన ఖర్చు: రూ.176 కోట్లు
►నిర్మించిన గృహాలు: 9,293
►రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేసిన గృహాలు: 10,237
► ఇందుకైన వ్యయం:రూ.200 కోట్లు
ప్రజారోగ్యానికి పెద్దపీట
►అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు మంజూరైన నిధులు రూ. 10.40 కోట్లు
►ఇప్పటికే పూర్తయిన యూపీహెచ్‌సీలు – 12
►పూర్తయ్యే దశలో 1 ఉంది.
2020–21 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు
►ప్రతిపాదించిన నిధులు రూ.43.60 కోట్లు
►గుర్తించిన పనులు – 140
►పూర్తయిన పనులు – 70
►ఇందుకు ఖర్చు చేసిన నిధులు రూ.16.61 కోట్లు
2021–22 సంవత్సరానికి రూ.10.22 కోట్లతో చేపట్టిన పనులు
►ప్రతిపాదించిన పనులు – 28
►పూర్తయిన పనులు –8
►ఖర్చు చేసిన నిధులు – రూ. 2.92 కోట్లు
ప్రజ్వరిల్లే పురోగతి..
►ప్రశాంతినగర్, నవాబుపేట, టీచర్స్‌కాలనీ, జ్యోతినగర్ తదితర ప్రాంతాల్లో రూ.94.79 కోట్ల వ్యయంతో 100 కి.మీ. మేర సీసీ, బీటీ రోడ్లను ఏర్పాటు
►15వ ఆర్థిక సంఘం నిధులు, నగరపాలక సంస్థ సాధారణ నిధులు రూ.8.04 కోట్లతో 70 కి.మీ. మేర తాగునీటి పైపులైన్ల ఏర్పాటు
►బుజబుజనెల్లూరు ప్రాంతాల్లో రూ.59.82 కోట్ల వ్యయంతో 60 కి.మీ. మేర మురుగునీటి కాలువల నిర్మాణం
►నగరపాలక సంస్థ సాధారణ నిధులు, ఎన్‌సీఏపీ నిధులు రూ.0.67 కోట్లతో నగరంలోని వివిధ పార్కుల అభివృద్ధి, సుందరీకరణ పనులు
►నగరపాలక సంస్థ సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.84 కోట్లతో రోడ్లకిరువైపులా 60 వేల మొక్కల ఏర్పాటు
►నగరపాలక సంస్థ సాధారణ నిధులు, సీఎస్‌ఆర్ నిధులు రూ.0.46 కోట్లతో 5.95 కి.మీ. మేర డివైడర్ల సుందరీకరణ పనులు
►నగరపాలక సంస్థ పరిధిలోని మైనారిటీలను దృష్టిలో ఉంచుకుని రూ.0.10 కోట్లతో 1078.23 చ.మీ. విస్తీర్ణంలో షాదీమంజిల్ (జీ+2) నిర్మాణం
►బీవీఎస్ పాఠశాల క్రీడామైదానంలో బాలికల కోసం రూ. 2.09 కోట్లతో ప్రత్యేకంగా ఇండోర్ షటిల్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్టులు ఏర్పాటు
►రూ.5.5 కోట్ల స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతో 64 ప్రాంతాల్లో కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం
జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం ద్వారా గడిచిన 2020–21, 2022, 2023 సంవత్సరాల్లో ట్రాక్టర్ల కొనుగోలు, సీసీ ప్యాచ్ వర్క్‌లు, వాటర్ ఫౌంటెయిన్లు, రోడ్లు వేయడం, పార్కుల అభివృద్ధి పనుల కోసం రూ.7.82 కోట్లు విడుదలయ్యాయి.
► ఇందులో చేసిన ఖర్చు – రూ.5.84 కోట్లు
► మిగిలిన రూ.1.98 కోట్లు పనుల కోసం వినియోగించనున్నారు.
►2023–24 సంవత్సరానికి రూ.14.55 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు కాలుష్య నియంత్రణ మండలికి సమర్పించారు.
కార్పొరేషన్ జనరల్ ఫండ్స్‌తో చేసిన పనులు
►2023–24 సంవత్సరానికి పురపాలక సాధారణ నిధుల నుంచి మంజూరైన నిధులు – రూ.19.75 కోట్లు
►ఇందులో రూ.4.83 కోట్లతో 67 పనులు పూర్తి
►రూ.4.83 కోట్లతో 49 పనుల పురోగతి
►రూ.5.69 కోట్లతో 74 పనులు ప్రారంభించాల్సి ఉంది.
►మరో రూ.4.43 కోట్లకు సంబంధించిన 40 పనులకు టెండర్ ప్రక్రియలో ఉంది.
నగరాన్ని సుందరీకరిస్తున్నాం
నెల్లూరు నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేలా చర్యలు చేపడుతున్నాం. అవసరమైన ప్రాంతంలో రోడ్లు, డ్రెయిన్లు, వీధిదీపాలు, పార్కులు తదితర పనులు చేపడుతున్నాం. నగరాన్ని ఆహ్లాదకరంగా ఉండేలా సుందరీకరిస్తున్నాం. – వికాస్‌మర్మత్, కమిషనర్, నెల్లూరు నగర పాలక సంస్థ
రోడ్డు బాగుపడింది
నెల్లూరు నగరం నుంచి ఇందుకూరుపేట మండలం మైపాడుకు వెళ్లే ప్రధాన రహదారి మైపాడు రోడ్డును వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు లేన్ల సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేశారు. – సుబ్బారెడ్డి, బంగ్లాతోట, నెల్లూరు