ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
మీరు పెట్టే ప్రతి పెట్టుబడికి తగిన ప్రతిఫలం ఉంటుంది
న్యూజెర్సీలో ప్రవాసులతో ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రవా సులు ఇకపై తెలంగాణకు అత్యధిక పెట్టుబడులతో రావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపుని చ్చారు. ‘తెలంగాణ మీ జన్మభూమి. దేశంలో మీరు పెట్టే ప్రతి పెట్టుబడికి ప్రయోజనంతో పాటు మంచి ప్రతిఫలం కూడా ఉంటుంది. నైపుణ్యాలు, ప్రతి భా పాటవాలతో అమెరికాను సంపన్నంగా, పటి ష్టంగా మార్చిన ప్రవాసులు తెలంగాణలో సేవలు అందించాలి. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాము లైతే సంతృప్తి బోనస్‌గా లభిస్తుంది. కాంగ్రెస్ పాలనలో అపోహలు, ఆందోళనలకు తావు లేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు కొత్త పారిశ్రా మిక విధానం తీసుకువస్తాం.
నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి మేలు జరిగేలా ఉపాధి కల్పన, నైపుణ్యాభిృద్ధికి కొత్త పాలసీలో ప్రాధాన్యత నిస్తాం. తెలంగాణను మెట్రో కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడుల కోసం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేస్తాం. హైద రాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతాం. ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్‌తో హైదరాబాద్‌ను అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రవాసులు కలిసి రావాలి..’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ప్రవాస భారతీయులతో జరిగిన ఆత్మీయ సమ్మేళ నంలో ఆయన మాట్లాడారు.
అపోహలు సృష్టించేవారికి బుద్ధి చెబుతాం..
‘ఎన్నికల ముందు కాంగ్రెస్ అంటే గిట్టని వాళ్లు విష ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదని, వచ్చినా కొనసాగదని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తోందంటూ అపోహలు కల్పిస్తున్నారు. వాళ్లకు తగిన బుద్ధి చెప్పడంతో పాటు వారివి అబద్ధాలని నిరూపిస్తాం. గత ఏడాది టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో అమెరి కాలో పర్యటించినప్పుడు.. తెలంగాణలో పదేళ్లుగా సాగుతున్న దుష్పరిపాలన, విధ్వంసాలకు విముక్తి కల్పిస్తానని మాట ఇచ్చా.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తాననే మాట మేరకు మళ్లీ వచ్చా. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. హామీల అమల్లో భాగంగా ఇప్పటికే రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేప ట్టాం. భవిష్యత్తు ప్రణాళికలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది..’ అని సీఎం చెప్పారు.
సీఎంకు ఓవర్‌సీస్ కాంగ్రెస్ స్వాగతం
అమెరికాలో ముఖ్యమంత్రికి ఓవర్‌సీస్ కాంగ్రెస్ పార్టీ అమెరికా విభాగం అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియాన్ నేతృత్వంలో వేలాది మంది ప్రవాసులు స్వాగతం పలికారు. సీఎంగా రేవంత్‌రెడ్డి పనితీరును అభినందించడంతో పాటు తెలంగాణలో పెట్టుబడుల కోసం సహకరిస్తామని హామీ ఇచ్చారు. రేవంత్‌ను సీఎంగా చూడాలనే కోరిక తీరిందని, రాహుల్ గాంధీని భారత ప్రధానిగా చేసేందుకు అందరం కష్టపడదామని మొహిందర్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు తెలంగాణ సంస్కృతిని చాటేలా పాటలు పాడటంతో పాటు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కాగా అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ముఖ్యులతోనూ సీఎం సమావేశమయ్యారు.
స్కిల్స్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా
’యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ’ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రా మికవేత్త, పద్మభూషణ్ ఆనంద్ మహీంద్ర వ్యవహరి స్తారు. ఈ మేరకు ఆనంద్ మహీంద్రా అంగీకారం తెలిపినట్లు న్యూజెర్సీలో జరి గిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. త్వరలోనే ఆయన బాధ్య తలు స్వీకరిస్తారని చెప్పారు. తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపు ణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చి దిద్దేందుకు ఏర్పాటు చేసిన స్కిల్స్ యూని వర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రము ఖుడిని చైర్మన్‌గా నియమిస్తామని సీఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి విది తమే.
కాగా ఇటీవల ఆనంద్ మహీంద్రాతో ఈ విషయమై రేవంత్ చర్చించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి చేయనున్న ‘ఫ్యూచర్ సిటీ’ పరిధిలోని బ్యాగరికంచె వద్ద స్కిల్స్ యూనివర్సిటీ భవనానికి సీఎం ఇటీవల శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment