ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో అయోధ్య అభివృద్ధికి అత్యధిక నిధులు ఖర్చుచేసింది. పలు అభివృద్ధి పనులకు సుమారు రూ.31 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. యూపీలోని ఏ జిల్లాలోనూ ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన దాఖలాలు లేవు.
అయోధ్యకు వచ్చే పర్యాటకుల సంఖ్య గత నాలుగేళ్లలో 2.25 లక్షల నుంచి 2.25 కోట్లకు పెరిగింది. భూముల ధరలు పదిరెట్ల మేరకు పెరిగాయి. ఈ నగరం సీతామాత శాపానికి గురైందని స్థానికులు అంటుంటారు. గతంలో ఇక్కడి యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు పయనమయ్యింది. అయితే రామ మందిరం నిర్మాణం ప్రారంభంతో అయోధ్య ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. పర్యాటకులు, రామభక్తులతో సందడిగా మారింది.
ప్రాపర్టీ డీలర్ బ్రిజేంద్ర దూబే పదేళ్లుగా అయోధ్యలో భూముల క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల కిందట చదరపు అడుగు భూమి
రూ.1000కి లభించేదని, ఇప్పుడు రూ. రూ.4,000 వెచ్చించినా దొరకడంలేదని తెలిపారు. నగరంలోని రామ్‌పథంలో భూముల ధరలు భారీగా పెరిగాయని చదరపు అడుగు భూమి ధర రూ.1000 నుంచి రూ.6 వేలకు పెరిగిందన్నారు.
అయోధ్యలోని రామమందిర్ ట్రస్ట్ వైకుంఠథామం సమీపంలో 14 వేల 730 చదరపు మీటర్ల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ భూముల కొనుగోలు ద్వారా ప్రభుత్వానికి రూ.55 కోట్ల 47 లక్షల 800 ఆదాయం వచ్చింది. ఇదేవిధంగా హౌసింగ్ డెవలప్‌మెంట్ అథారిటీ 1,194 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.
లోధా గ్రూప్ నగరంలోకి ప్రవేశించాక ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్ని అంటాయని ప్రాపర్టీ డీలర్ బ్రిజేంద్ర దూబే చెప్పారు. ఈ గ్రూపు అయోధ్య వెలుపల రాంపూర్ హల్వారా, రాజేపూర్ ప్రాంతం మధ్యలో సొసైటీని నిర్మించడానికి భారీగా భూములను కొనుగోలు చేసింది.
గడచిన కాలంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన స్థానిక యువత అయోధ్య శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడికి తిరిగివస్తోంది. మలవన్‌కు చెందిన అనుప్ పాండే గుజరాత్‌లో పనిచేసేవాడు. అయోధ్యలో ఉపాధి అవకాశాలు పెరగడాన్ని చూసి, అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఇక్కడికి తిరిగివచ్చాడు. ఒక కారును కొనుగోలు చేసి, దానిని పర్యాటక ప్రాంతాలకు తిప్పుతూ ఉపాధి పొందుతున్నాడు. ఇదేవిధంగా ఇంజనీర్ బ్రిజేష్ పాఠక్ ప్రయాగ్‌రాజ్‌లో తన ఉద్యోగాన్ని వదిలి, అయోధ్యకు చేరుకుని ఆయుర్వేద ఔషధాల తయారీని ప్రారంభించాడు. అవినాష్ దూబే తన ఉద్యోగం వదిలిపెట్టి, అయోధ్యలో బెల్లం తయారీ పరిశ్రమను ప్రారంభించాడు. అరవింద్ చౌరాసియా చండీగఢ్ నుండి ఇక్కడకు తిరిగి వచ్చి, హోటల్ ప్రారంభించాడు.
ఇది కూడా చదవండి: నేడు ఆలయ ప్రాంగణంలోకి బాలరాముని విగ్రహం!
Comments
Please login to add a commentAdd a comment