భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అవతరించిన తెలుగు రాష్ట్రాల తొలి రాజధాని కర్నూలు.. సీమ ముఖ ద్వారం. విశాఖ, విజయవాడ, గుంటూరు తర్వాత నాలుగో అతి పెద్ద నగరం. కానీ అభివృద్ధిలో వెనుకడుగు. అది నిన్నటి మాట. నేడు కర్నూలు స్వరూపం మారిపోయింది. పాలకుల చిత్తశుద్ధి లేక వెనుకబడిన ఈ ప్రాంతం ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.
నాలుగున్నరేళ్లుగా కర్నూలు నూతన శోభను సంతరించుకుంది. థీమ్ పార్క్‌లు, ఫ్లైఓవర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, రోడ్లు, బ్యూటిఫికేషన్, శానిటేషన్, వీధిదీపాలు.... ఒక్కటి కాదు అన్ని రంగాల్లోనూ, అన్ని రకాలుగా మెట్రోనగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతోంది. క్లీన్‌సిటీగా, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెంది స్వచ్ఛతలో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. వీధి వ్యాపారులకు కూడా ‘హాకర్స్ జోన్’ ఏర్పాటైంది. –మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి కర్నూలు
నాలుగున్నరేళ్లలో మారిన నగర రూపురేఖలు
- న్యాయ రాజధాని దిశగా అడుగులు
- లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఆర్‌సీ సంస్థల ఏర్పాటుతో కళకళ
- సైన్స్, మ్యూజిక్, కార్టూన్ వంటి 9 థీమ్ పార్క్‌లు ఏర్పాటు
- షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్ స్పోర్ట్స్ అకాడమీలు
- కార్పొరేషన్‌లో రూ.720 కోట్లతో అభివృద్ధి పనులు.. రూ.500 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం
- పెద్దాస్పత్రిలో అధునాతన పరికరాలతో పేదలకు మెరుగైన వైద్యం
- నూతన రహదారులతో రయ్.. రయ్ మంటూ వేగంగా నగరాభివృద్ధి
- ట్రాఫిక్ కష్టాలు తొలిగేలా ఫ్లై ఓవర్‌ల నిర్మాణం – తుంగభద్ర పుష్కరాల కోసం శాశ్వతంగా ఘాట్లు
- క్లస్టర్ యూనివర్శిటీగా రూపుమారిన సిల్వర్‌జూబ్లీ కళాశాల
కర్నూలులో అభివృద్ధి పనులు ఇలా..
నాడు–నేడు కింద రూ.34.99కోట్లతో మున్సిపల్ స్కూళ్ల అభివృద్ధి
- కర్నూలు నగరంలో ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి చేసిన ఖర్చు: రూ.8 కోట్లు
- 15 వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన అభివృద్ధి ఖర్చు: రూ.45.60 కోట్లు
- రూ.13.22కోట్లతో డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించారు.
- రూ.82 కోట్లతో సుంకేసుల నుంచి సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు పైపులైన్ నిర్మించారు. దీంతో నగరవాసులకు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరింది.
- కార్పొరేషన్ పరిధిలోని మునగాలపాడులో రూ. 15కోట్లతో సేవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మించారు. దీంతో కల్లూరు, కార్పొరేషన్ పరిధిలోని కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నారు.
- రూ.26కోట్లతో నగరపాలక నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు.
- 6.70 కోట్లతో తుంగభద్ర నది వద్ద 7 శాశ్వత పుష్కరఘాట్లు నిర్మించారు.
- రూ. 8 కోట్లతో వెంకటరమణ కాలనీలో మోడరన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు.
- రూ. 2 కోట్లతో బిర్లాగేట్ వద్ద ‘ఖానా–ఖజానా’ పేరుతో ఈట్‌స్ట్రీట్ నిర్మించారు.
- నగరశివారులోని రుద్రవరంలో 27 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు
- రూ. 252కోట్లతో అమృత్ కింద తాగునీటి పథకాలు, 16 ఉపరితల రక్షిత నీటి ట్యాంకులు నిర్మించారు.
- కర్నూలు మార్కెట్‌యార్డులో రూ.6.50కోట్లతో జంబోషెడ్డు నిర్మిస్తున్నారు. పనులు పురోగతిలో ఉన్నాయి.
- రూ.16కోట్లతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ కార్యాలయాన్ని నిర్మించారు.
కర్నూలు పురోగతి ఇలా..
► గడపగడపకు మొదటి దశలో మంజూరైన నిధులు (రోడ్లు, డ్రైనేజీలు, సచివాలయాలకు) రూ.17. 99 కోట్లు
► గడపగడపకు రెండో దశలో మంజూరైన నిధులు రూ.22.53 కోట్లు
► పట్టణ ఆరోగ్య కేంద్రాలు, భవనాలు, యూపీహెచ్‌సీ మరమ్మతులకు రూ. 14.82.కోట్లు
► నీటి శుద్ధి కేంద్రాలకు రూ. 13.18 కోట్లు
► రెండో దశ నీటి శుద్ధి కేంద్రాలకు రూ.47.93 కోట్లు
► నీటి శుద్ధి కేంద్రానికి (స్పెషల్ ప్రాజెక్ట్) రూ.15.00 కోట్లు
► థీమ్ పార్కులు (స్పెషల్ ప్రాజెక్ట్) రూ.7. 09.కోట్లు
► మంచినీటి సరఫరా , పైప్‌లైన్ పనులు రూ. 82.00కోట్లు
జ్యుడీషియల్ సిటీ..
► లోకాయుక్త
► మానవహక్కుల కమిషన్
► ఏపీ ఈఆర్‌సీ
► వక్ఫ్‌ట్రిబ్యునల్
► సీబీఐ కోర్టులు
► నేషనల్ లా యూనివర్శిటీ
► స్టేట్ క్వాజీ జ్యుడీషియల్ అండ్ లీగల్ ఇన్‌స్టిట్యూషన్స్
► హైకోర్టు, ట్రిబ్యునల్స్
► మరో 43 అనుబంధ కోర్టులు
► వీటన్నిటి కోసం 150 ఎకరాలు కేటాయింపు
► మొత్తంగా జ్యుడీషియల్ సిటీ నిర్మాణానికి శ్రీకారం
► టీడీపీ అడ్డుపడటంతో ఒక్క హైకోర్టు వ్యవహారం మాత్రం కొలిక్కి రావల్సి ఉంది
మార్పు కోసం నిధుల వరద
- మొత్తం పనులు: 552
- తొలిదశ: 219 పనులు పూర్తయినవి
- ఖర్చు చేసిన నిధులు: 11.64 కోట్లు
- రెండో దశ: 144 పనులు పూర్తయినవి
- ఖర్చు చేసిన నిధులు: 10.16 కోట్లు
- పురోగతిలో ఉన్నవి: 188 పనులు రోడ్లు, మురుగుకాలవల కోసం చేసిన ఖర్చు
- గుర్తించిన అభివృద్ధి పనులు: 426
- ప్రతిపాదిత ఖర్చు: 54.72 కోట్లు
- పూర్తి చేసినవి: 272 పనులు
- చేసిన ఖర్చు: 26.16 కోట్లు
వీధిదీపాల కోసం చేసిన ఖర్చు
- కాలనీల్లో ఏర్పాటు చేసిన వీధిలైట్లు: 220 సెంట్రల్ మీడియన్ లైట్లు: 96
- వీటి కోసం చేసిన ఖర్చు: 66 లక్షలు
- పట్టణంలోని మొత్తం పార్కులు: 156
- వీటిలో అభివృద్ధి చేసిన పార్కులు: 35
- థీమ్ పార్క్ పేరుతో అభివృద్ధి చేస్తున్నవి: 8
- పూర్తయినవి: 6
- వీటి కోసం చేసిన ఖర్చు: రూ.7.70 కోట్లు
శానిటేషన్ డివిజన్ కార్యాలయాల కోసం చేసిన ఖర్చు
- శానిటేషన్ డివిజన్ కార్యాలయాలు: 16
- కొత్తగా నిర్మించినవి: 11
- వీటి కోసం చేసిన ఖర్చు: 8.80 కోట్లు
కొండారెడ్డి బురుజును ఆధునికీకరించడంతో పాటు పార్క్, లైటింగ్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు. ఇందుకోసం రూ.2కోట్లు ఖర్చు చేశారు. అక్కడే షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కృష్ణానగర్, సంతోషనగర్ వద్ద నేషనల్ హైవేపై ఫ్లైఓవర్‌లు నిర్మించారు. బిర్లాగేట్ నుంచి గుత్తి పెట్రోల్ బంకు వరకూ ఆర్‌వోబీ నిర్మించారు. నగరంలో ప్రధాన రోడ్లను రూ.65.30కోట్లతో అభివృద్ధి చేశారు.
రూ.9.58 కోట్లతో కలెక్టరేట్ ఆధునికీకరణ
► టీడీపీ హయాంలో కర్నూలు నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించకపోగా 2010 ఆగస్టులో పాలకవర్గం గడువు ముగిసింది. ఆ తర్వాత 11 ఏళ్లు పాలకవర్గం లేదు. వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించి 2021 మార్చిలో కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కర్నూలు అభివృద్ధి కోసం రూ.720కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో 1,736 పనులు పూర్తయ్యాయి.
► కలెక్టరేట్,జాయింట్ కలెక్టర్, సీపీఓ కార్యాలయాలు, వీడియో కాన్ఫరెన్స్ హాల్, మినీ కాన్ఫరెన్స్ హాలు, కాన్ఫరెన్స్ హాలు, వ్యవసాయ, సమాచార, పౌరసంబంధాల కార్యాలయాల పనులు పూర్తి. మరో 15శాఖల కార్యాలయాలు త్వరలో పూర్తి చేసేందుకు సన్నాహాలు.
► స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, థీమ్ పార్క్‌లు
► షటిల్ బ్యాట్మింటన్ ఇండోర్ స్టేడియాలు
► సింథటిక్ టెన్నిస్‌కోర్టులు,క్రికెట్ అకాడమీలు
► మ్యూజిక్‌పార్క్, సైన్స్‌పార్క్,
► కల్చరల్ పార్క్, ఫ్రూట్ పార్క్,
► గ్లోగార్డెన్, చిల్ర్డన్స్‌పార్క్‌లు
► ఒక్కో పార్కు కోసం రూ.1.20 కోట్లు
► చిల్ర్డన్స్ పార్క్ కోసం రూ.1.70 కోట్లు
రూ. 65.30కోట్లతో రహదార్లు పురోభివృద్ధి
- ఆనంద్ టాకీస్ నుంచి కేసీ కెనాల్ అక్విడిక్ట్ వరకూ బ్రిడ్జి!: రూ.3.50కోట్లు
- బళ్లారి చౌరస్తా నుంచి పెద్దపాడు రోడ్డు వరకూ రోడ్డు నిర్మాణం: 4కోట్లు
- కర్నూలు పట్టణంలో 9రోడ్లు ఆధునికీకరణకు రూ.9కోట్లు
- బిర్లా గేట్ నుండి గుత్తి పెట్రోల్ బంకు వరకూ ఆర్‌వోబీ నిర్మాణం: 18కోట్లు
- కర్నూలు–సుంకేసుల రోడ్డు: 1.30కోట్లు
- పీపుల్స్ పార్క్ నుంచి రాజ్ విహార్, కలెక్టరేట్ వరకూ రోడ్డు నిర్మాణం: 9.80కోట్లు (టెండర్ దశలో ఉంది)
- కర్నూలు–బళ్లారి రోడ్డు విస్తరణ నిర్మాణం: 13.20కోట్లు( పనులు జరుగుతున్నాయి)
- సఫా కాలేజీ నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకూ రోడ్డు నిర్మాణం: రూ.3.50కోట్లు( పెండింగ్‌లో ఉంది. పూర్తి కావల్సి ఉంది)
ఆసుపత్రిలో ఆధునాతన పరికరాలు
► స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణం కోసం రూ.120 కోట్లు
► కేతలాబ్ మిషన్ కొనుగోలు కోసం రూ.6కోట్లు మంజూరు
► అకస్మాత్తుగా గుండెనొప్పి బారిన పడినవారి కోసం ‘స్టెమీ ప్రాజెక్టు’ రూపొందించారు.
► కర్నూలు మెడికల్ కాలేజీలో రూ.3.2కోట్లతో ఎగ్జామ్ హాల్ నిర్మిస్తున్నారు.
► రూ. 2.17కోట్లతో కాలిన రోగుల వార్డు నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి.
► రూ.12.9కోట్లతో డయాగ్నొస్టిక్ బ్లాక్ నిర్మాణం
► ఈ భవనంపై రూ.3 కోట్లతో మరో రెండు అంతస్తులతో ఐసీయూ నిర్మాణం
► రూ.4.5కోట్లతో బాలికల యూజి, పీజీ హాస్టల్ నిర్మాణ దశలో ఉంది.
► రూ.25 లక్షలతో పుల్లీ ఆటోమేటెడ్ మిషన్ కొనుగోలు
► రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి
► ఎస్‌ఎన్‌సియూ, ఎన్‌ఐసీయూను రూ.70 లక్షలతో ఆధునికీకరిస్తున్నారు.
► రీజినల్ డ్రగ్ టెస్టింగ్ లేబరేటరీని రూ.1.79 కోట్లతో నిర్మిస్తున్న పనులు చివరి దశలో ఉన్నాయి.
► రూ.3.5 కోట్లతో ఆధునిక సిటీ స్కాన్ మిషన్ కొనుగోలు
► 3.5కోట్లతో రెండు న్యూరో మైక్రోస్కోప్స్ కొనుగోలు
Comments
Please login to add a commentAdd a comment