
గంటా ఫ్లాప్ షో..
వరుసగా దెబ్బ మీద దెబ్బ
ఫిల్మ్‌నగర్ క్లబ్ స్థలం లీజు రద్దు
బీచ్ లవ్ ఫెస్టివల్‌పై సర్కారు వెనక్కి?
ఆ రెండింటిలోనూ గంటా పెత్తనం
దానికి చెక్ పెట్టేసిన వైరివర్గం
{పభుత్వంలో మంత్రి పరపతిపై నీలినీడలు
గంటా శ్రీనివాసరావు.. విశాఖ జిల్లాలో మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నప్పటికీ తనదైన శైలిలో హల్‌చల్ చేస్తూ జిల్లా దేశం రాజకీయాల్లో చక్రం తిప్పేస్తుంటారు. విశాఖలో ఉత్సవాలు, పండుగలు, పబ్బాలు.. వెరసి ఆడంబరాల సారధిగా అటు జనం నోట నానాలని.. ఇటు ప్రభుత్వం వద్ద పేరు కొట్టేయాలని తాపత్రయపడిపోతుంటారు. మరోవైపు వర్గ రాజకీయలతో పార్టీలోనూ పెత్తనం చేయాలని భావించే గంటా వ్యవహారశైలి పట్ల కొంతకాలంగా సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గుర్రుగా ఉన్నారన్న ప్రచారం గణగణమని మోగుతోంది. సామాజికవర్గ సమీకరణల నేపథ్యంలో బాబు చూసీచూడనట్టు వదిలేస్తున్నారన్న అభిప్రాయమూ నిన్నమొన్నటి వరకూ వినిపించింది. కానీ ఇటీవలి కాలంలో జరిగిన వరుస పరిణామాలు చూస్తుంటే గంటల చప్పుడు చప్పబడిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నారుు.
ఫిల్మ్‌నగర్ క్లబ్ స్థలం లీజు రద్దు చేయడమే కాకుండా.. బీచ్ లవ్ ఫెస్టివల్‌పై వెనక్కి తగ్గాలని సర్కారు నిర్ణరుుంచడం గంటా మాట చెల్లుబాటు కావడం లేదన్న వాదనకు బలం చేకూరుస్తోందని ఆ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ రెండింటితో గంటాకేం సంబంధం.. ఈ వ్యవహారాల్లో ఏ విధంగా ఆయనకు వరుసగా దెబ్బ మీద దెబ్బ పడింది, వైరి వర్గం గంటాకు ఎలా చెక్ పెట్టింది.. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వారం విశాఖ తీరానికి రండి.
విశాఖపట్నం పవర్ + పాలిట్రిక్స్ = గంటా. ఆయన గురించి రాజకీయవర్గాల్లో సహజంగా వినిపించే మాట ఇది. కానీ ఇప్పుడు గంటా రాజకీయ పరపతిపై నీలినీడలు కమ్ముకుంటున్నారుు. వరుసగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువు కావడంతో పాటు ఆయన స్వయంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీలోనే వైరివర్గంగా చెలామణీ అయ్యే అయ్యన్నపాత్రుడి శిబిరం వరుసగా పైచేరుు సాధిస్తున్న దరిమిలా టీడీపీలో గంటా హవాకు బ్రేక్ పడినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీచ్ లవ్ దుమారం
తీవ్ర వివాదం రేపిన బీచ్ లవ్ ఫెస్టివల్ దుమారం కూడా మంత్రి గంటానే కమ్మేసింది. విశాఖ తీరంలో వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ప్రేమోత్సవం నిర్వహించేందుకు సర్కారు సరదా పడిన సంగతి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరు వేల విదేశీ జంటలతో లవ్ ఫెస్టివల్ జరిపేందుకు ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ ముందుకొచ్చింది. ప్రఖ్యాత పాప్ గాయని షకీరాతో మ్యూజికల్ నైట్, క్యాట్‌వాక్, వెస్టన్ర్ డ్యాన్‌సలు, ఫ్యాషన్ షో, లైవ్‌షోలు ఏర్పాటు చేయాలని భావించింది. విదేశీ అతిధలు మందు, విందులతో మజా చేస్తూ బీచ్‌లో బికినీలు ధరించి యథేచ్ఛగా విహరించేందుకు విశాఖ బీచ్ వేదికగా సన్నాహాలు చేసింది. ఈ ప్రతిపాదనపై ప్రజా, మహిళా సంఘాలు దుమ్మెత్తిపోశారుు. ప్రేమోత్సవాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారుు. ఈ వ్యవహారంలో కూడా గంటా అనవసర జోక్యం వివాదాస్పదమైంది. జిల్లా మంత్రిగా ఆయన స్పందించవచ్చు కానీ.. అంతకుమించి అంతా తానే అన్నట్టుగా లవ్ ఫెస్టివల్‌ను నిర్వహించితీరుతామని ప్రకటించారు.
పాశ్చాత్య పోకడలతో గోవా మాదిరిగా విశాఖ బీచ్‌ను మారిస్తే చూస్తూ ఊరుకోమని ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలన్నీ తెగేసి చెప్పడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ప్రభుత్వంతో పాటు పార్టీ పరువు కూడా పోయే ప్రమాదం తలెత్తడంతో సీఎం చంద్రబాబు బీచ్ లవ్ ఫెస్టివల్ రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో జరిగిన టెలికాన్ఫరెన్‌సలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. జిల్లా మంత్రిగా ఇక్కడి పరిస్థితులను ముందుగానే అంచనా వేసి సీఎంకు నచ్చజెప్పి ప్రేమోత్సవాన్ని రద్దు చేరుుంచి ఉంటే సీన్ మరోలా ఉండేది. కానీ గంటా ఆ ఛాన్‌స కూడా మిస్ చేసుకుని విమర్శల పాలయ్యారు.ఏతావాతా.. విశాఖ రాజకీయ తీరంలో ఇటీవల తుపాను సృష్టించిన రెండు వివాదాలకు ఆద్యుడు, బాధితుడు, క్షతగాత్రుడు కూడా గంటానే.. అందుకే ఆయనది ఫ్లాప్ షో అనడానికి.. ఎనీ డౌట్.
బుద్ధిస్టుల్లో అ‘శాంతి’
పవిత్రమైన బౌద్ధారామం చెంతన క్లబ్ పేరిట అపచారానికి పాల్పడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తారుు. అరుుతే ఇవేమీ ఆయన పట్టించుకోలేదు. మరోవైపు బుద్ధిస్టులు గంటాకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేశారు. బుద్ధుడు నడయాడిన అమరావతిలో రాజధాని నిర్మాణం చేస్తున్నామని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ బౌద్దారామంలో చేసే నిర్వాకం ఇదేనా అంటూ బుద్ధిస్టులు ధ్వజమెత్తారు. సరిగ్గా వీరికి గంటా వ్యతిరేక శిబిరం అండ లభించింది. ఇదే అదనుగా పావులు కదిపిన మంత్రి అయ్యన్నపాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలు స్థల వివాదాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ విషయంలో మొండిగా ముందుకెళ్తే ప్రభుత్వ పరుపుపోతుందని, దేశ విదేశాల్లో బుద్ధిస్టులు ఏపీకి వ్యతిరేకమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. దీంతో ఎందుకొచ్చిన గొడవని బాబు ఆ స్థలంలో క్లబ్ నిర్మాణం లీజును రద్దు చేస్తామని హామీనిచ్చారు. చిరంజీవికి గంటా సన్నిహితుడు కావడంతో అయ్యన్న వర్గం బాలకృష్ణను ఆశ్రరుుంచి గంటాపై ఉసిగొల్పిందన్న ప్రచారం సాగింది. ఇదెంత వరకు వాస్తవమో పక్కన పెడితే ఫిల్మ్‌నగర్ క్లబ్ స్థల విషయంలో గంటాకు పరాభవ సినిమా కనబడిందన్నది మాత్రం యదార్ధం.