‘టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ’ | minister ayyannapatrudu comments on 2019 elections | Sakshi
Sakshi News home page

‘టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ’

Published Tue, Apr 18 2017 11:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

‘టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ’ - Sakshi

‘టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ’

విశాఖ : వచ్చే ఎన్నికలపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఆయన తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని, కావాలంటే పేపర్‌ మీద రాసుకోవాలంటూ అయ్యన్న పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.

కాగా 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా జనసేన ఇప్పుడు ఎన్డీయే భాగస్వామి పక్షం కాదని, పార్టీ నిర్మాణం పూర్తయ్యాకే పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు.  మరోవైపు మంత్రి అయ్యన్న వ్యాఖ్యలపై జనసేన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement