సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి హెడ్ ఆఫీసులో ఏపీ సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాలెన్స్ షీట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఏ1 రామోజీ, ఏ2 శైలజను సీఐడీ విచారించింది. అయితే, విచారణలో డాక్యుమెంట్లను చూపేందుకు రామోజీ, శైలజ నిరాకరించారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా నగదు మళ్లించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
వైఎస్ ఛైర్మన్, ఫైనాన్స్ డైరెక్టర్లను విచారించిన సీఐడీ.. మరో నలుగురు కీలక ఉద్యోగులను పశ్నించింది. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీ, శైలజ, ఉద్యోగుల స్టేట్‌మెంట్‌లను సీఐడీ పరిశీలించింది.
మార్గదర్శి ఫండ్స్ పెట్టుబడుల రూపంలో ఇతర కంపెనీలకు మళ్లించారు. మార్గదర్శి కస్టమర్ల సొత్తును రిస్క్ ఎక్కువగా ఉండే షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ రంగంలో యాజమాన్యం పెట్టుబడులు పెట్టింది. కస్టమర్ల చిట్స్ కోసం సేకరించిన సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మార్గదర్శి యాజమాన్యం జమ చేసుకుంది. మనీలాండరింగ్ జరిగినట్లు ఏపీ సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. దర్యాప్తు జరపాలని ఈడీ, సీబీడీటీకీ సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు.
చదవండి: ‘చెక్కు’తో చిక్కారు!..
Comments
Please login to add a commentAdd a comment