బాబు చేసింది పెద్ద నేరమే!  | Chandrababu committed crimes that public servant should not commit | Sakshi
Sakshi News home page

బాబు చేసింది పెద్ద నేరమే! 

Published Sun, Sep 10 2023 5:04 AM | Last Updated on Sun, Sep 10 2023 5:04 AM

Chandrababu committed crimes that public servant should not commit - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సీఐడీ బలమైన ఆధారాలతో అంతకంటే బలమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ముఖ్యంగా చట్టం పట్ల విధేయత చూపుతానని ప్రమాణం చేసిన ప్రజా సేవకుడు దురుద్దేశంతో ఆ చట్టాలను ఉల్లంఘించడం, తప్పుడు లేదా నకిలీ సంస్థలను సృష్టించి ప్రజా ధనాన్ని సొంతం చేసుకునేందుకు ఫోర్జరీ పత్రాలను నిజమైనవిగా వినియోగించడాన్ని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు.

ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈ నేరాలకు పాల్పడినట్లు సీఐడీ భావిస్తోంది. మొత్తం 11 ఐపీసీ సెక్షన్లు, రెండు అవినీతి నిరోధక సెక్షన్ల కింద అరెస్టు చేసింది. తీవ్రమైన నేరాలు చేయడంతో పాటు నేరాలను ప్రోత్సహించిన చంద్రబాబుకు ఈ చట్టాల కింద 7 నుంచి 25 ఏళ్ల కారాగార శిక్ష, భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. బాబుపై నమోదైన కేసులో సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే..  

ఐపీసీ సెక్షన్లు 
120–బి: నేరపూరిత కుట్ర 
166: ప్రభుత్వ సేవకుడు ఎవరికైనా హాని కలిగించే ఉద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించడం, చట్టం పట్ల విధేయత చూపుతానని ప్రమాణం చేసిన వారు దురుద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించి నేరానికి పాల్పడటం 
167: పబ్లిక్‌ సర్వెంట్‌ ఉద్దేశపూర్వకంగా లేని/తప్పుడు సంస్థలను, పత్రాలను సృష్టించి మోసం చేయడం 
418: ఎవరికైనా నష్టం వాటిల్లుతుందని తెలిసీ ఉద్దేశ పూర్వకంగానే మోసం చేయడం 
420: మోసం చేయడం 
465: ఫోర్జరీ చేయడం 
468: మోసం చేయాలనే ఉద్దేశంతో ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించడం  
471: ఫోర్జరీ పత్రాలను అసలైన పత్రాలుగా ఉపయోగించడం 
409: నేరపూరిత విశ్వాస ఘాతుకం 
201: నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయడం, లేదా నేరస్థుడు దొరక్కుండా తప్పుడు సమాచారం ఇవ్వడం 
109: నేరాన్ని ప్రేరేపించడం, ఆ నేరం లేదా కుట్రలో భాగస్వామిగా ఉండటం 
పీసీ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌) యాక్ట్‌  
12(బి)(1): అవినీతికి పాల్పడటం 
13(1)(సి)(డి): పబ్లిక్‌ సర్వెంట్‌గా ఉండి అవినీతికి పాల్పడడం   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement