
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ జూనియర్ లైన్‌మెన్ పేపర్ లీక్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. లీక్‌లో ఐదుగురు విద్యుత్ అధికారులు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
చదవండి: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు, జీహెచ్‌ఎంసీ అత్యవసర భేటీ
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం జులై 17,2022 న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాత పరీక్షలో విద్యుత్ సంస్థలకు చెందిన ఐదు మంది ఉద్యోగుల ప్రమేయంతో మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు తేలింది. మొహమ్మెద్ ఫిరోజ్ ఖాన్, సపావత్ శ్రీనివాస్, కేతావత్ దస్రు, షైక్ సాజన్, మంగళగిరి సైదులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment