
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలకలం రేపుతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. అయితే ప్రధాన నిందితుడైన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ విచారణలో కీలక అంశాలు బయటపడ్డాయి. ఓ యువతి సోదరుడి కోసం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న రేణుక అనేక యువతి తన తమ్ముడి కోసం పేపర్ లీక్ చేయించింది.
దీంతో నెట్వర్క్ అడ్మిన్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న రాజశేజర్‌ను పేపర్ గురించి ప్రవీణ్ అడిగాడు. టౌన్ ప్లానింగ్ పేపర్ సెక్షన్ ఆఫీసర్ సిస్టమ్‌లో ఉందని రాజశేఖర్ చెప్పగా.. ప్రవీణ్ తన పెన్‌డడ్రైవ్‌లో పేపర్‌రను కాపీ చేసుకున్నాడు. దీనిని పేపర్ పప్రింట్ తీయించి రేణుకకు ఇచ్చాడు. పేపర్‌ను తన సోదరుడికి చూపించి వెంటనే తెచ్చి ఇవ్వమని ఆమెను ఆదేశించాడు.
అయితే డబ్బు మీద ఆశతో రేణుక క్వశ్చన్ పేపర్‌ను ఓ సర్పంచ్ కొడుక్కి పంపింంది. ఆ వ్యక్తి..మరో ముగ్గురు యువకులకు చెప్పడంతో వాళ్ల నుంచి రేణుక రూ. 14 లక్షల వరకు డబ్బలు వసూలు చేసింది.దీంట్లో రూ. 10 లక్షల రూపాయలను ప్రవీణ్‌కు ఇచ్చింది. అనంతరం ప్రింట్ ఇచ్చిన పేపర్లను ప్రవీణ్ కాల్చి వేసినట్టు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. కాగా డబ్బులు వ్యవహారంలో సఖ్యత కుదరకపోవడంతో ఓ అభ్యర్థి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment