సాక్షి, హైదరాబాద్: తెలంగాణను పట్టి కుదిపేస్తున్న టీఎస్‌సీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయంగా మరింత వేడిపెంచింది. ఈనేపథ్యంలోనే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో తాను చేసిన వ్యాఖ్యలకుగానూ ఆధారాలను వ్యక్తిగతంగా హాజరై.. తమకు సమర్పించాలంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సిట్ నోటీసులపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు.
ఈమేరకు ఆయన సిట్ అధికారికి ఆదివారం లేఖ రాశారు. ‘నాకు సిట్ మీద నమ్మకం లేదు. పార్లమెంట్ సమావేశాల కారణంగా బిజీగా ఉన్నాను అని ఇప్పటికే తెలిపాను. అయినా మళ్ళీ నోటీస్ లు ఇచ్చారు. మీ పరిస్థితి ని అర్థం చేసుకోగలను. ఆ బాధ్యత గల మంత్రి ఇద్దరు మాత్రమే ఉన్నారు అని అన్నారు. లీక్ లో చాలా మంది ఉన్నారని సిట్ హెడ్ గా మీకు తెలుసు. స్కాం ను తక్కువ చేసి చుపెట్టే ప్రయత్నం మొదటి నుండి జరుగుతుంది.
రాజకీయాల ను పక్కన పెట్టి మీ ఆత్మ సాక్షి తో ఆలోచించండి. ఈ స్కాం తో ఎన్నో లక్షల మంది మనో వేదనకు గురవుతున్నారు. ఒక గ్రామం నుండి ఎక్కువ మంది గ్రూప్ వన్ కి సెలెక్ట్ అయ్యారని సమాచారం నాకు వచ్చింది. దాన్ని ప్రజల ముందు పెట్టాను. ప్రజా ప్రతినిధి గా వివిధ మార్గాల నుండి సమాచారం వస్తుంది.. ఈ సమయం లో పూర్తి వివరాలను బహిర్గతం చేయడం భావ్యం కాదని అనుకుంటున్నాను. అసలు విషయం పై విచారణ జరపకుండా. మీరు నాకు నోటీస్ లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు నేపథ్యం లో నేను హాజరు కావడం లేదు’ అని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment