
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్ లీక్ కేసును సిట్ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో సిట్ పురోగతి సాధించింది. సిట్ విచారణలో ప్రవీణ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.
విచారణ సందర్బంగా.. కంప్యూటర్ నుంచి ఐదు ప్రశ్నాపత్రాలను ప్రవీణ్ కొట్టేసినట్టు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే లక్ష్మి నుంచి ప్రవీణ్ పాస్‌వర్డ్ చోరీపై కూడా సిట్ ఆరా తీసింది. అయితే, ప్రవీణ్‌కు లబ్ధి చేయడం కోసమే రాజశేఖర్ కంప్యూటర్ లాన్‌లో మార్పులు చేశాడని తెలిపింది. టెక్నికల్ ఎక్స్‌పర్ట్ రాజశేఖర్ సహాయంతో పేపర్లను ప్రవీణ్ కొట్టేశాడు. ఏఈ ప్రశ్నాపత్నంతో పాటుగా మరికొన్ని పేపర్లను కూడా ప్రవీణ్ కొట్టేశాడు. భవిష్యత్తులో జరుగనున్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ పోస్టుల పేపర్లను ప్రవీణ్ తన వద్దే పెట్టుకున్నట్టు సిట్ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment