TSPSC Leakage Case: Hyderabad CP Transfers Case To CCS SIT - Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసు.. విచారణను సీసీఎస్‌ సిట్‌కు బదిలీ

Published Tue, Mar 14 2023 6:42 PM | Last Updated on Tue, Mar 14 2023 10:58 PM

TSPSC Leakage Case: Hyderabad CP Transfers Case To CCS SIT - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసు పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసు  విచారణను మంగళవారం సీసీఎస్‌(సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌)కు బదిలీ చేశారు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. సీసీఎస్‌ తరపున సిట్‌ ఇకపై ఈ కేసు దర్యాప్తును కొనసాగించనుంది. సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలోని విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. 

మరోవైపు నిందితులను కస్టడీకి కోరుతూ కోర్టులో బేగంబజార్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈలోపే సంచలనం సృష్టించిన ఈ కేసు  సీసీఎస్‌ సిట్‌కు బదిలీ అయ్యింది. 

ఇదీ చదవండి: ప్రవీణ్‌ లీక్‌ చేశాడు.. రేణుక అసలు కథ నడిపించింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement