Central Crime Station
-
సీసీఎస్‌ను ఆశ్రయించిన ఏడో నిజాం మనవరాలు
సాక్షి, హైదరాబాద్: నిజాం ఆస్తులకు సంబంధించిన ఓ వివాదం హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్)కు చేరింది. తన పేరిట ముగ్గురు వ్యక్తులు నకిలీ జీపీఏ సృష్టించి కోర్టు ద్వారా వారసత్వ సర్టిఫికెట్ పొందారని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మనవరాలు ఫాతిమా ఫౌజియా సీసీఎస్‌లో క్రిమినల్ ఫిర్యాదు చేశారు. ఏడో నిజాం రెండో కుమారుడైన వాలాషాన్ ప్రిన్సెస్ మౌజ్జమ్ ఝా బహదూర్ కుమార్తె ఆమె. తొలుత నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కేసు నమోదు చేయకపోవడంతో హైదరాబాద్‌లోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. స్పందించిన న్యాయస్థానం.. కేసు నమోదు చేయాలని సీసీఎస్‌ను ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారసత్వ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలి..: ‘బషీర్‌బాగ్‌కు చెందిన మిలాద్ అలీ ఖాన్, నాంపల్లికి చెందిన సాజిద్ అలీఖాన్, బంజారాహిల్స్‌కు చెందిన మీర్ మిర్జా అలీఖాన్ ఉమ్మడిగా ఏడో నిజాంకు సంబంధించిన ఆస్తులకు వారసులమని.. నా పేరిట నకిలీ జీపీఏతో 2016లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ద్వారా వారసత్వ సర్టిఫికెట్ పొందారు. అనంతరం నా ఆస్తిలోనూ వాటా ఉందంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అలాగే తమిళనాడులోని నీలగిరి, ఊటీల్లో ఉన్న దాదాపు రూ. 121 కోట్ల విలువైన ఏడో నిజాం ఎస్టేట్స్‌లో వాటా పంచాలని కోర్టుకెక్కారు. నా తండ్రి, సోదరుడి నుంచి నాకు సంక్రమించిన 36 శాతం ఆస్తుల వాటాను తక్కువగా చూపించడంతోపాటు పూర్తిగా ఎస్టేట్‌ను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారు’అని ఫాతిమా కోర్టులో వేసిన ప్రైవేటు ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు పొందిన వారసత్వ సరి్టఫికెట్ బోగస్ అని, దాన్ని రద్దు చేయాలని కోరారు. -
సాహితి ఇన్ఫ్రాపై ప్రత్యేక బృందం ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: సాహితి ఇన్ఫ్రాపై సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్)పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సాహితి ఇన్ఫ్రాపై ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. ఫ్రీలాంచ్ పేరుతో కస్టమర్ల నుంచి వందల కోట్లను సాహితి ఇన్ఫ్రా వసూల్ చేసిన విషయం తెలిసిందే. సాహితి ఇన్ఫ్రా స్కామ్ మొత్తం రూ. 1800 కోట్లుగా పోలీసులు తేల్చారు. 9 ప్రాజెక్టుల పేరుతో భారీ మోసం చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో 1700 మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు సాహితీ ఇన్ఫ్రాపై ఆరోపణలున్నాయి. 38 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం పేరుతో భారీ మోసానికి తెరతీసినట్లు కేసు ఫైల్ అయ్యింది. ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ.900 కోట్లు సాహితీఇన్‌ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. చదవండి: నా భర్తను దారుణంగా కొట్టి చంపేశారు’ -
పేపర్ లీకేజీ కేసు.. సీసీఎస్ సిట్‌కు బదిలీ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను మంగళవారం సీసీఎస్(సెంట్రల్ క్రైమ్ స్టేషన్)కు బదిలీ చేశారు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. సీసీఎస్ తరపున సిట్ ఇకపై ఈ కేసు దర్యాప్తును కొనసాగించనుంది. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు నిందితులను కస్టడీకి కోరుతూ కోర్టులో బేగంబజార్ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈలోపే సంచలనం సృష్టించిన ఈ కేసు సీసీఎస్ సిట్‌కు బదిలీ అయ్యింది. ఇదీ చదవండి: ప్రవీణ్ లీక్ చేశాడు.. రేణుక అసలు కథ నడిపించింది -
డిటెన్షన్ సెంటర్ @ వికారాబాద్!
సాక్షి, హైదరాబాద్: నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులకు ‘విదేశీయుల’ వేధింపులు తప్పనున్నాయి. తమ సొంత దేశాలకు బలవంతంగా తిప్పి పంపాల్సిన (డిపోర్టేషన్) వారిని ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉంచేందుకు ఉద్దేశించిన డిటెన్షన్/డిపోర్టేషన్ సెంటర్ వికారాబాద్‌కు మారనుంది. కనిష్టంగా 40 మందిని ఉంచేలా దీన్ని నిర్మిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది. నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు వంటి ఆఫ్రికన్ దేశాల నుంచి అనేక మంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్ వస్తున్నారు. వీరిలో అనేక మంది వీసా, పాస్‌పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. నకిలీ గుర్తింపుకార్డుల సహకారంతో తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేవాళ్లు. అనుమానాస్పద కదలికలు ఉన్నా, కొన్ని రకాలైన నేరాలకు పాల్పడినా ఇలాన చేసేవాళ్లు. దీంతో కోర్టులో ఆ కేసుల విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్‌కు అవకాశం ఉండేది కాదు. బెయిల్‌పై బయటకు వచ్చే వాళ్లు సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఇలా అత్యంత సమస్యాత్మక వ్యక్తులుగా మారుతున్న వీరి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది. ఇది గమనించిన నగర పోలీసులు ఇలాంటి వారిని అరెస్టు చేయడానికి బదులు డిపోర్ట్ చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ డిపోర్టేషన్ ప్రక్రియలో అనేక ఘట్టాలు ఉంటాయి. ఆయా ఎంబసీలకు సమాచారం ఇచ్చి వీరి గుర్తింపులు, ఢిల్లీ కార్యాలయం నుంచి టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్లు పొందాలి. ఆపై విమాన టిక్కెట్లు ఖరీదు చేసి సదరు ఎయిర్వేస్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి పట్టే రెండు నెలల కాలంలో వీరిని డిపోర్టేషన్ సెంటర్ ఉంచాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ఆపై తాత్కాలిక ప్రాతిపదికన హైదరాబాద్ సీసీఎస్ డిపోర్టేష¯న్ సెంటర్‌గా మారింది. కేవలం అయిదుగురిని మాత్రమే ఉంచడానికి సరిపోయే జైలు గదినే దీనికి వాడుతున్నారు. దీంతో పాటు వారికి అనువైన ఆహారం అందించలేకపోవడంతో ఆయా విదేశీయులు చేసే రాద్ధాంతంతో సీసీఎస్ పోలీసులకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు విభాగం ప్రత్యేకంగా డిపోర్టేషన్ సెంటర్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వికారాబాద్‌లో డిపోర్టేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఆయా దేశీయుల భాష తర్జుమా చేయడానికి ట్రాన్స్‌లేటర్లు, వారికి అనువైన ఆహారం వండి ఇవ్వడానికి కుక్స్‌తో సువిశాల స్థలం మధ్యలో భవంతులతో నిర్మిస్తున్నారు. కనిష్టంగా 40 మందికి సరిపోయేలా రూపొందుతోంది. (చదవండి: తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం.. రైతన్నలకు డ్రోన్లు) -
మదుపరుల అనుమతి లేకుండా సుమారు రూ.1000 కోట్లు కాజేశాడు!...అనుగ్రహ్’ కేసులో ఎన్ఎస్ఈ సీఈఓ
సాక్షి, హైదరాబాద్: మదుపరుల డీ–మ్యాట్ ఖాతాల్లోని షేర్లను వారి అనుమతి లేకుండా ట్రేడింగ్ చేసి, ఆ మొత్తాలు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుగ్రహ్ స్టాండ్ అండ్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు నమోదు చేసిన కేసులో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థ అక్రమాల విషయం తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా పరోక్షంగా సహకరించారని ఆరోపిస్తూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు (ఎన్ఎస్ఈ) చెందిన కీలక వ్యక్తులనూ నిందితులుగా చేర్చారు. దాని మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ లిమయేతో పాటు చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ ప్రియ సుబ్బరామన్ ఈ జాబితాలో ఉన్నారు. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన అనుగ్రహ్ సంస్థ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్తో (ఎన్ఎస్ఈ) పాటు ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టరై ఉంది. ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను ఈ సంస్థ పర్యవేక్షించింది. ఆయా ఖాతాల్లో క్లైంట్కు సంబంధించిన షేర్లతో పాటు కొంత నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టడం ద్వారా వాటి విలువలో 80 శాతం వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని వినియోగించుకుంటూ అనేక మంది మదుపరులు రుణాలు తీసుకుని ఆ మొత్తాన్ని మరిన్ని షేర్లు ఖరీదు చేయడానికి వినియోగిస్తుంటారు. దీనిని తనకు అనువుగా మార్చుకున్న అనుగ్రహ్ డైరెక్టర్ పరేష్ ముల్జీ కరియా మదుపరుల అనుమతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నాడు. ఇలా దాదాపు రూ.1000 కోట్ల మేర మదుపరుల సొమ్ము కాజేశాడు. ఈ పంథాలో నగరంలోని చిక్కడపల్లికి చెందిన కంపెనీ సెక్రటరీ టి.రవిప్రకాష్ రూ.1,87,47,493 నష్టపోయారు. ఈయన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు బుధవారం అనుగ్రహ్‌పై కేసు నమోదు చేశారు. అనుగ్రహ్ సంస్థ వద్ద ఉండాల్సిన మదుపరుల షేర్లతో భారీ తగ్గుదల ఉన్నట్లు ఎన్ఎస్సీతో పాటు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్‌కు (సీడీఎస్ఎల్) ముందే తెలుసని రవి ప్రకాష్ ఆరోపించారు. సెబీ ఆధీనంలో పని చేసే సీడీఎస్ఎల్తో పాటు ఎన్ఎస్ఈ సైతం ఈ విషయాన్ని పట్టించుకోకుండా అనుగ్రహ్‌కు పరోక్షంగా సహకరించినట్లు ఆరోపించారు. ఇదే విషయాన్ని సెబీ గతేడాది మార్చిలో ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొందని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 2017–18 నాటికే అనుగ్రహ్ వద్ద ఉండాల్సిన మదుపరుల షేర్లకు సంబంధించి రూ.112 కోట్లు గోల్మాల్ అయ్యాయని తెలిసినప్పటికీ ఎన్ఎస్ఈ, సీడీఎస్ఎల్ 2020 వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సెబీ స్పష్టం చేసినట్లు రవి ప్రకాష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎడిల్వైజ్ కస్టోడియన్ సర్వీసెస్ లిమిటెడ్‌కు పాత్ర ఉందని ఆరోపించారు. ఈయన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు అనుగ్రహ్‌పై నమోదు చేసిన కేసులో ఆ సంస్థతో పాటు దాని యజమాని పరేష్, దీంతో సంబంధం కలిగి ఉన్న తేజిమండి.కామ్ వెబ్సైట్ యజమాని అనిల్ గాంధీ, ఎన్ఎస్ఈ, దీని సీఈఓ, ఎండీగా ఉన్న విక్రమ్ లిమయే, చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ ప్రియ సుబ్బరామన్, ఎడిల్వైజ్ కస్టోడియన్ సర్వీసెస్ లిమిటెడ్, సీడీఎస్‌ఎల్‌లను నిందితులుగా చేర్చారు. దీనికి సంబంధించిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘రవి ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగా ఈ కేసు నమోదు చేశాం. దాని ప్రకారమే నిందితుల జాబితా రూపొందించాం. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే వివరాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. -
మళ్లీ సెంట్రల్ ‘క్రైమ్’ స్టేషన్!
సాక్షి హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అంటే ఒకప్పుడు చోరులు, దోపిడీ దొంగలు, బందిపోట్లకు హడల్. జూపార్క్‌లో పులి సాఖీని చంపిన సలావుద్దీన్ నుంచి పాతబస్తీలోని మహంకాళి ఆలయంలో చోరీకి పాల్పడిన గౌస్, సలీంల వరకు ఎందరో కరుడుగట్టిన నేరగాళ్లను అరెస్టు చేసిన ఘన చరిత్ర దీనికి ఉంది. కొంత కాలంగా నిర్వీర్యమైన సీసీఎస్ క్రైమ్ టీమ్స్‌ను పునరుద్ధరించాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో విభాగాలు... నగరంలో చోటు చేసుకున్న సంచలనాత్మక కేసులను ఒకప్పుడు సీసీఎస్‌కు బదిలీ చేసే వాళ్లు. రూ.30 లక్షలకు పైబడిన సొత్తుతో కూడిన భారీ చోరీలతో పాటు దోపిడీ, బందిపోటు దొంగతనం, కార్ల తస్కరణ తదితరాలన్నీ ఇక్కడకే వచ్చేవి. దీనికోసం ఇందులో యాంటీ డెకాయిటీ అండ్ రాబరీ టీమ్, ఆటోమొబైల్ టీమ్, క్రైమ్ బృందం... ఇలా వివిధ విభాగాలు పని చేసేవి. నగర టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్ ఎస్ఓటీలతో పాటు క్రైమ్ వర్క్‌కు సంబంధించి అప్పట్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న గోషామహల్ ఏసీపీ టీమ్‌లకు పోటీగా సీసీఎస్ అధికారులు పని చేసే వాళ్లు. ఫలితాలు కూడా అదే స్థాయిలో సాధించారు. ప్రస్తుతానికి అంతర్గతంగా నియామకం... ఆయా జోన్లలో జరిగే భారీ నేరాలను ఈ బృందాలు దర్యాప్తు చేస్తాయి. కేసులను కొలిక్కి తీసుకువచ్చి నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. అత్యంత సంచలనాత్మక కేసులను పర్యవేక్షించడానికి మరో ప్రత్యేక టీమ్ పని చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఆరు టీమ్స్‌లోని సీసీఎస్‌లో పని చేస్తున్న వారినే తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారు ముందుకు రావాలంటూ అంతర్గతంగా సమాచారం ఇచ్చారు. రానున్న రోజుల్లో నగరంలోని ఠాణాలు, ఇతర విభాగాల్లో ఉన్న అనుభవజ్ఞులను నియమించడం ద్వారా సీసీఎస్ క్రైమ్ టీమ్స్‌ను దీటుగా తీర్చిదిద్దడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఆర్థిక నేరాల కేసులతోనే.. కాలక్రమంలో సీసీఎస్‌లోని ఈ క్రైమ్ టీమ్‌లు తమ ఉనికిని కోల్పోయాయి. అప్పట్లో ఆర్థిక నేరాలు, మోసాల కేసులను దర్యాప్తు చేయడానికి పరిమిత సంఖ్యలో టీమ్స్ ఉండేవి. అయితే రానురాను ఈ తరహా కేసులు పెరగడంతో పాటు అనుభవజ్ఞలైన సిబ్బంది దూరం కావడంతో సీసీఎస్‌లో క్రైమ్ వర్క్ తగ్గింది. ప్రస్తుతం దాదాపు అన్ని బృందాలు ఈ ఆర్థిక నేరాలనే దర్యాప్తు చేస్తున్నాయి. ఈ విషయం గమనించిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లకు సంబంధించి ఐదు, ప్రత్యేకంగా మరొకటి కలిపి ఆరు క్రైమ్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఘరానా మోసం..
సాక్షి, హైదారాబాద్: నగరంలో భారీ సైబర్ మోసం బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు మంగళవారం రట్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నకిలీ వెబ్సైట్లతో ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా అక్రమాలకు పాల్పడుటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల నుంచి నగదు, సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
సీసీఎస్‌ను సందర్శించిన ఎంపీ కవిత
హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నగర పోలీసులు సాధిస్తున్న సత్ఫలితాలపై ఎంపీ కవిత సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆమె నాంపల్లిలోని సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్)ను సందర్శించారు. ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న వివిధ రకాలైన నేరాల అదుపునకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న తీరును ఆమెకు డీజీపీ అనురాగ్ శర్మ వివరించారు. స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరును ఆమెకు స్వయంగా చూపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కవిత పోలీసు అధికారుల నుద్దేశించి మాట్లాడారు. పోలీసు శాఖ సాధిస్తున్న విజయాలను, తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. -
‘ల్యాప్స్ పాలసీ’ల ఆధారంగా లూటీ
* బీమా మొత్తం ఇప్పిస్తామంటూ మోసాలు * ఢిల్లీ కేంద్రంగా కథ నడిపిన గ్యాంగ్ * పది మందిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ కాప్స్ * రూ.7.3 లక్షలు స్వాధీనం. రూ.1.5 కోట్ల ఫ్రీజ్ సాక్షి, హైదరాబాద్: ల్యాప్స్ అయిన ఇన్సూరెన్స్ పాలసీ డేటానే ఆధారం... ఢిల్లీలోని మీట్నగర్లోని కాల్‌సెంటర్ కేంద్రం... ఆరుగురు సూత్రధారులు... సీన్ కట్ చేస్తే దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు కోల్పోయిన బాధితులు... ఈ ఘరానా గ్యాంగ్ గుట్టును రట్టు చేసిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు పది మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.7.3 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, వివిధ బ్యాంక్ ఖాతాల్లోని ఉన్న రూ.1.54 కోట్లు ఫ్రీజ్ చేశామని సంయుక్త పోలీసు కమిషనర్ టి.ప్రభాకరరావు వెల్లడించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్ఎంకే ఇస్మాయిల్‌తో కలసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సేల్స్ ప్రమోషన్‌తో షురూ: ఢిల్లీలోని మీట్నగర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు సూత్రధారులు రెండు నెలల క్రితం ఎమరిక్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, యునిక్ యాంబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఖాతాదారులను వెతికే సేల్స్ ప్రమోషన్ ఈ కాల్‌సెంటర్ల ఉద్దేశం. ఇందుకు 200 మంది టెలీకాలర్స్‌ను నియమించారు. ఈ వ్యాపారం లాభసాటిగా లేకపోవడంతో మోసాలకు తెరలేపారు. గతంలో వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల్లో పనిచేసి, వాటి కస్టమర్స్ డేటాను సంపాదించగలిగే ఏడుగుర్ని పాత్రధారులుగా చేశారు. వీరి ద్వారా ఆయా కంపెనీల్లో ‘ల్యాప్స్ పాలసీదారుల’ వివరాలు సేకరించారు. వివిధ ‘పేర్ల’తో టోకరా... ఈ డేటాబేస్ ఆధారంగా టెలీకాలర్స్ ల్యాప్స్ అయిన పాలసీ వివరాలు చెప్తూ ఖాతాదారులకు ఫోన్ చేసి నమ్మకం కలిగిస్తారు. బీమా మెచ్యూరిటీ మొత్తాన్ని ఇప్పిస్తామంటూ వల వేస్తారు. ఆకర్షితులైన వారికి దాని నిమిత్తం తమ సంస్థల్లో కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలని షరతు విధిస్తారు. ఇండియా వాల్యూ కార్డ్ సహా 14 స్కీములు, సంస్థల పేరు చెప్పి డబ్బు డిపాజిట్ చేయించుకుంటారు. ఇలా నగదు డిపాజిట్ చేయడానికి అవసరమైన 45 బ్యాంకు ఖాతాలను లక్నోకు చెందిన ముగ్గురు నిందితులు తెరిచారు. డబ్బు డిపాజిట్ అయిన తరువాత వారి నెంబర్లు బ్లాక్ చేసేస్తారు. ఈ పంథాలో హైదరాబాద్‌కు చెందిన మాజీ పోలీసు అధికారి మహ్మద్ లియాఖత్ అలీఖాన్‌కు కూడా టోకరా వేశారు. రూ.8.15 లక్షలు మోసపోయిన ఆయన గత నెల 24న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పది మంది అరెస్టు: సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేశారు. బ్యాంకు ఖాతాలతో సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన ప్రత్యేక బృందం ఢిల్లీలో ఏడుగురు పాత్రధారులు, లక్నోలో ముగ్గురు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన వారిని అరెస్టు చేసింది. వీరి నుంచి పోలీసులు రూ.7.3 లక్షలు, మూడు ల్యాప్‌టాప్‌లు, 11 హార్డ్‌డిస్క్‌లు, 37 సెల్ఫోన్లు, 11 రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. సూత్రధారులు ఢిల్లీకి చెందిన ప్రశాంత్ అరోరా, దీపక్ అరోరా, రాహుల్ విర్మానీ, జ్ఞానేశ్వర్, సమ్రత్ గుప్తా, పియూష్‌లు పరారీలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా మోసపోయిన వారి వివరాలు హార్డ్‌డిస్క్‌లు విశ్లేషించడం ద్వారా తెలుస్తాయని ప్రభాకరరావు తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసు స్టేషన్లు లేదంటే సైబర్ క్రైమ్ పోలీసులకు 9490616648 (ఇన్స్పెక్టర్ ప్రసాద్), 9490616622 (ఏసీపీ ఇస్మాయిల్)కు ఫిర్యాదు చేయాలని కోరారు. చిక్కింది వీరే:ఢిల్లీకి చెందిన రాకేష్ కుమార్ మిశ్రా, ఉదయ్ మహాజన్, సర్దుల్ సిద్ధు, రాజీవ్‌సింగ్, రాజీవ్ వర్మ, దిల్బార్ కైంతురా, సరోజ్ కుమార్, లక్నో వాసులు అలోక్ శుక్లా, రమేష్ యాదవ్, ఇఫ్తెకారుద్దీన్. ఈ కంపెనీల పేర్లతోనే మోసాలు: ఇండియన్ వాల్యూ కార్డ్స్, ఇండియన్ సొల్యూషన్స్, యునిక్ సొల్యూషన్స్, స్టార్ క్లబ్, క్యాపిటల్ వాల్యూ, సిటీ వాల్యూ కార్డ్స్, స్టాండర్డ్ వాల్యూ, స్టాండర్డ్ సొల్యూషన్స్, ద అవెన్యూ, ఆమ్రో సొల్యూషన్స్, ఫ్యూచర్ సొల్యూషన్స్, యునిక్ యాంబిష్ ప్రైవేట్ లిమిటెడ్, సావరిన్ ఇన్సూరెన్స్ కంపెనీ, నాలెడ్జ్ యాంబిషన్స్. -
సీసీఎస్‌లో ఐదుగురిపై వేటు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లో అక్రమాలను వెలుగులోకి తెస్తూ ‘సాక్షి’లో వచ్చిన కథనాలపై నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. అవినీతికి పాల్పడిన సీసీఎస్‌లోని ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సస్పెండైన వారిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్, హెడ్‌కానిస్టేబుల్ ఉన్నారు. సీసీఎస్‌కు చెందిన ఆటో మొబైల్ టీం(ఏటీఎం) ఇన్స్పెక్టర్ తుమ్మపూడి శ్రీనివాస ఆంజనేయప్రసాద్, సబ్ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ ఆర్.ఎం.గురునాథుడు, హెడ్‌కానిస్టేబుల్ ఎ.మోహన్లతో పాటు సీసీఎస్ వైట్ కాలర్ అఫెన్స్ టీం ఇన్స్పెక్టర్ మధుమోహన్ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. విచారణాధికారులు బుధవారం సాయంత్రం కమిషనర్ మహేందర్‌రెడ్డికి నివేదిక సమర్పించారు. దీంతో వారిపై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. నెల రోజుల క్రితమే ఇన్‌కమ్‌ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌ను బెదిరించి అతని ఆస్తులను బలవంతంగా మరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారంలో ఇదే సీసీఎస్‌లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ను కూడా కమిషనర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు రికవరీ చేసిన వాహనాల మాయంపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలపై ఆయన స్పం దించారు. 60 ఠాణాల పరిధిలో రికవరీ వాహనాలపై ఆరా తీయడంతో పలువురు పోలీసులు అక్రమంగా వాడుతున్న 140 వాహనాలు తిరిగి ఠాణాలకు చేరుకున్నాయి. -
‘ఆన్లైన్’ చీటర్ అరెస్టు
నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు కాజేసిన నిందితుడు సిటీబ్యూరో: ఆన్లైన్లో నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు కాజేస్తున్న ఓ మోసగాడిని నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీసీఎస్ డీసీపీ సి.రవివర్మ కథనం ప్రకారం... ఆటో కన్సల్టెన్సీ వ్యాపారం చేస్తున్న కర్ణాటకకు చెందిన మ్మద్ ఆసీఫ్ అలియాస్ సైఫుల్లా (23) వెబ్‌సైట్‌ను తెరిచాడు. ఈ వెబ్సైట్ ద్వారా నిరుద్యోగులతో చాటింగ్ చేసేవాడు. తమ సంస్థలో రూ.2000 చెల్లించి సభ్యుడిగా చేరితే మంచి ఉద్యోగం చూపిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలోనే వారి సెల్‌నెంబర్, ఏటీఎం, క్రెడిట్ కార్డు నెంబర్లను చాకచక్యంగా తెలుసుకొనేవాడు. తర్వాత వారి బ్యాంక్ ఖాతాలోని మొత్తం డబ్బును ఆన్లైన్లో తన ఖాతాలోకి బదిలీ చేసుకొని మోసగించేవాడు. ఇలా ఇతగాడు సుమారు 300 మంది నిరుద్యోగులకు చెందిన బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టాడు. ఇదే విధంగా ఇటీవల నగరానికి చెందిన ఓ యువతి బ్యాంక్ ఖాతా నుంచి లక్ష రూపాయలు స్వాహా చేశాడు. యువతి సీసీఎస్ సైబర్ క్రైమ ఏసీపీ బి.అనురాధకు ఫిర్యాదు చేయడంతో సైఫుల్లాపై కేసు నమోదు చేశారు. సోమవారం అతడ్ని అరెస్టు చేసి రూ.2 లక్షలు, ల్యాప్‌టాప్, 17 సిమ్‌కార్డులు, 3 సెల్ఫోన్లు, రెండు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆ ఇద్దరు నన్ను మోసం చేశారు: పూరి జగన్నాథ్
హైదరాబాద్: తనను బిల్డర్ సుబ్బరాజు, రామరాజులు మోసగించారని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన కుటుంబానికి చెందిన ఖాళీ స్థలాన్ని రామరాజు, సుబ్బరాజులకు ఐదేళ్ల కిత్రమే విక్రయించానని చెప్పారు. ఆ సమయంలోనే మాసాబ్‌ట్యాంక్ ఎస్బీఐ బ్రాంచ్‌లో తనకు రూ.5 కోట్ల రుణం ఉందని ఆ ఇద్దరికి చెప్పానని పూరి స్పష్టం చేశారు. అయితే ఆ రుణాన్ని తమ పేర్లపైకి బదిలీ చేసుకుంటామని సుబ్బరాజు, రామరాజులు తనకు హామీ ఇచ్చారని చెప్పారు. అందుకు ఆ బ్రాంచ్ మేనేజర్ కూడా అంగీకరించాడని తెలిపారు. ఇందకు సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం నేనే ఇంటిపై రుణం తీసుకునేందుకు సదరు బ్యాంక్‌కు వెళ్లగా ఎస్బీఐలో రుణం పెండింగ్‌లో ఉందని బ్యాంకు అధికారులు తనకు గుర్తు చేశారు. ఆ క్రమంలో వెంటనే తాను (2011లో) బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి... సుబ్బరాజు, రామరాజులపై ఫిర్యాదు చేసినట్లు పూరి వివరించారు. ఆ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు విదేశాలకు పారిపోయారన్నారు. తాన నుంచి కొనుగోలు చేసిన ఆ స్థలాన్ని వారిద్దరు ఇతరులకు విక్రయించారని చెప్పారు. అసలు విషయం వారికి తెలియక ఫ్లాట్ యజమానులు తనపై ఫిర్యాదు చేశారని పూరి విశదీకరించారు. ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌పై సీసీఎస్ పోలీసులు గురువారం చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో పూరి జగన్నాథ్ కుటుంబానికి వెయ్యి గజాల స్థలం ఉంది. ఆ స్థలంపై ఓ జాతీయ బ్యాంకులో సుమారు రూ. 5 కోట్ల రుణం తీసుకున్నారు. సగం వాయిదాలు సక్రమంగా చెల్లించారు. ఇదిలావుండగా, ఈ స్థలాన్ని బిల్డర్ సుబ్బరాజుకు డెవలప్మెంట్కు ఇవ్వగా సదరు బిల్డర్ ఫ్లాట్స్ కట్టి నలుగురికి విక్రయించాడు. బ్యాంకు రుణం తీరకపోవడంతో అధికారులు రుణం చెల్లించాలంటూ ఫ్లాట్స్ కొనుగోలు చేసిన నలుగురు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. బ్యాంకులో రుణం ఉండగా ఫ్లాట్స్ ఎలా కొనుగోలు చేస్తారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఫ్లాట్ యజమానులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిరు. బిల్డర్ సుబ్బరాజుతోపాటు పూరి జగన్నాథ్‌లు తమను మోసం చేసి ఫ్లాట్లు విక్రయించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నాంపల్లి కోర్టు నుంచి పూరి బెయిల్ తీసుకున్నారు. సదరు ఖాళీ స్థలం పూరి జగన్నాథ్ భార్య లావణ్య పేరుతో ఉందని, బిల్డర్‌కు అగ్రిమెంట్ చేసే సమయంలో బ్యాంకు రుణం గురించి ప్రస్తావించారా లేదా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని సీసీఎస్ డీసీపీ పాల్ రాజు తెలిపారు. కాగా బిల్డర్ సుబ్బరాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని డీసీపీ చెప్పారు. దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. -
సూడో పోలీస్ హల్చల్
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీస్‌నంటూ ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ఓ కన్సల్టెన్సీలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని టార్గెట్ చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. వారి సెల్ఫోన్లతోపాటు రూ.20 వేల నగదును తస్కరించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కన్సల్టెన్సీ కార్యాలయంలోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ కన్సల్టెన్సీ కార్యాలయానికి ఈనెల 3న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ ఆగంతకుడు వచ్చాడు. తాను సీసీఎస్ పోలీస్‌నని, కన్సల్టెన్సీ నిర్వహణకు అనుమతి లేదన్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటూ హడావిడి చేశాడు. పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేస్తున్నానని అక్కడి సిబ్బందికి చెప్పి ఏదో నెంబర్‌కు డయల్ చేసి ఇక్కడ అంతా మహిళలే ఉన్నారు, లేడీ కానిస్టేబుళ్లను పంపమని ఆదేశాలు జారీ చేశాడు. ‘మీ అందరినీ అరెస్ట్ చేస్తున్నా’నంటూ వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అందరి వివరాలు కాగితంపై రాసివ్వాలంటూ హుకూం జారీ చేశాడు. మహిళల సెల్ఫోన్లను తీసుకుని తన వద్ద ఉంచుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత పక్క గదిలోకి వెళ్తున్నానని చెప్పి అక్కడినుంచి జారుకున్నాడు. కొంతసేపటి తర్వాత అనుమానం వచ్చిన సిబ్బంది యాజమాన్యానికి, డయల్-100కి ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యా దు చేస్తే ఏమవుతుందోననే భయంతో మహిళా సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. ఇతర ప్రాంతంలోని కన్సల్టెన్సీ యాజమాన్యం వచ్చి సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా ఆగంతకుడు కార్యాలయానికి చెందిన రూ.20 వేలు తస్కరించినట్టు తేలింది. సదరు యజమాని రెండు రోజులు క్రితం పుటేజీ ఆధారంగా ఫిర్యాదు చేయగా గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గాలం వేస్తారు..గుల్ల చేస్తారు.. !
సాక్షి,సిటీబ్యూరో: ‘సార్ మీ మొబైల్ నెంబర్ లాటరీలో గెలిచింది..కంగ్రాట్స్..అయితే మీరు పన్నులు, ఇతరత్రా కలిపి కొంత మొత్తాన్ని బ్యాంకులో జమచేయాలి’ అని చెప్పి అమాయక జనాన్ని దోచుకుంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) గత నెలలో పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ నుంచి ‘+ 92’ నెంబర్‌తో ఫోన్లు చేసి లాటరీ పేరుతో నిండా ముంచుతున్నట్లు తేలింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని పాక్, దుబాయ్‌లోని నిందితులు మూడు నెలల్లో రూ.3 కోట్లను కొల్లగొట్టారు. ఇందులో ఓ బాధితురాలు సీసీఎస్ డీసీపీ పాలరాజుకు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్‌లో మకాం వేసిన మ్యాడ్యుల్స్ ఉదంతం వెలుగుచూసింది. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని ఆదివారం అరెస్టు చేశారు. వీరినుంచి రూ.20.5 లక్షల నగదు, 73 డెబిట్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను సైబర్‌క్రైమ్ ఏసీపీ అనురాధతో కలిసి డీసీపీ పాలరాజు తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. నగరంలో మ్యాడ్యుల్స్ తయారీ ఇలా : పాకిస్థాన్ కు చెందిన అలిభాయ్, హారుల్లు దుబాయ్‌లో నివాసముంటున్నారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగ అన్వేషణలో దుబాయ్ వెళ్లిన వారిని వీరు పరిచయం చేసుకుంటారు. తాము చెప్పినట్లు చేస్తే మంచి కమీషన్ వస్తుందని, త్వరగా సంపాదించొచ్చని నమ్మిస్తారు. ఇలా మూడునెలల క్రితం హైదరాబాద్‌లోని వారి బంధువులు, స్నేహితులతో మాట్లాడి ఒక ముఠాను ఏర్పాటు చేశారు. సీతాఫల్‌మండికి చెందిన అమర్జిత్ సింగ్ (40), వసంతాల నరేంద్ర(37)లు ఈ ముఠాకు నాయకత్వం వహించారు. నగరంలోని బోయిన్‌పల్లిలో ఉంటున్న గుజరాత్‌కు చెందిన పటేల్ మహేందర్‌కుమార్ (41), మారేడుపల్లికి చెందిన తాటిపల్లి శంకర్ (34)లతో క లిసి ముఠాను విస్తరించారు. శంకర్ తనకు పరిచయస్తులైన వారు మారేడుపల్లికి చెందిన జి.దయామణి (44), డి.చంద్రశేఖర్ (37),కాప్రాకు చెందిన వీరభద్రారావు (33)లతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ తదితర జిల్లాల్లో మరో 40 మందితో కలిసి మొత్తం 73 బ్యాంకు అకౌంట్లు తెరిపించారు. ఈ అకౌంట్ నెంబర్లను దుబాయ్‌లోని అలీభాయ్‌కు పంపిస్తారు. గాలం వేస్తారు ఇలా..: పాకిస్థాన్‌లోని ఏజెంట్ల నుంచి హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లో ఉన్న అమాయకులకు లాటరీ తగిలిందని గాలం వేస్తారు. ప్రైైజ్ మనీ కావాలంటే అందుకు కావాల్సిన పన్నులు తదితర ఖర్చుల నిమిత్తం పలానా అకౌంట్లో డబ్బులు వేయమంటారు. వారి మాటలు నమ్మిన బాధితులు వారు పేర్కొన్న బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తారు. చివరకు తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తారు. ఇలా అమీర్‌పేటకు చెందిన టీచర్ మృణాళిని కులకర్ణి (40) సెల్‌కు కూడా ఇటీవలే +92 సిరీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఎయిర్టెల్ నెంబర్‌కు రూ.33 లక్షలు బహుమతి గెలిచారని అగంతకులు ఆమెను నమ్మించారు. అయితే అందుకు పన్నులు, కస్టమ్స్ డ్యూటీ, బ్యాంకు క్లియరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ తదితర ఖర్చుల నిమిత్తం ఏజెంట్లకు చెందిన బ్యాంకు అకౌంట్లో సుమారు రూ.13 లక్షల వేయించుకున్నారు. చివరకు ఆమె మోసపోయానని గ్రహించి రెండురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ మాజిద్అలీఖాన్, ఎస్ఐ వేణుగోపాల్‌లు బాధితురాలు డబ్బులు వేసిన బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి ఖాతాదారుడిని అదుపులోకి తీసుకుని విచారిచండంతో నగరంలో మకాం వేసిన ముఠా ఉదంతం వెలుగుచూసింది. దీంతో పైన పేర్కొన్న ఏడుగురిని అరెస్టు చేశారు. హవాలా ద్వారా..: బాధితులు ఇక్కడి బ్యాంకులు డిపాజిట్ చేసిన డబ్బులను నిందితులు డెబిట్ కార్డుల ద్వారా డ్రా చేసి హవాలా ద్వారా దుబాయ్‌లోని అలీభాయ్‌కు పంపిస్తారు. ఇలా పంపినందుకు 10 శాతం కమీషన్‌ను ఇక్కడి ముఠాకు అందుతుంది. ఇందులోంచే బ్యాంకు అకౌంట్‌దారులకు, ఏజెంట్లకు పంపకాలు చేసుకుంటారు. 40 మందిని అరెస్టు చేయాల్సి ఉంది: డీసీపీ పాలరాజు ఇలాంటి ముఠాను అరెస్టు చేయడం ఇది రెండోది. గతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిని అరెస్టు చేయగా ఈ సారి నగరంలోనే మకాం వేసిన వారిని పట్టుకున్నాం. ఈ కేసులో బ్యాంకు ఖాతాలు తెరిచిన మరో 40 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. -
ఇంతకీ దొంగలెవరు?
ఏటీ అగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్: నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు అండగా నిలవాల్సిన కొందరు అవినీతి అధికారుల కారణంగా పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందనే విమర్శలు వినవస్తున్నాయి. నేరస్తులను గుర్తించి చోరీ సొత్తును రికవరీ చేయాల్సిన అధికారులే దొంగలను బెదిరించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నేరస్తులపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వదిలివేస్తుండడం గమనార్హం! ఇటీవల ఓ డీఎస్పీ, ఎస్ఐలపై వరుసగా రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్, అర్బన్ జిల్లా ఎస్పీ జెట్టి గోపీనాథ్‌లకు ఫిర్యాదులందాయి. వీటిని తీవ్రంగా పరిగణించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. దర్జాగా వెళ్లిన దొంగలు..! మార్చి 29న బ్రాడీపేటలోని ఓ హోటల్లో కొత్తపేటకు చెందిన సిరంజి మమత, హైదరాబాద్‌కు చెందిన నటారి సందీప్, సయ్యద్ అమీర్అహ్మద్, పశ్చిమ గోదావరి జిల్లా పోచవరానికి చెందిన పత్తిపాటి శ్రీనివాసరావులు దొంగ బంగారం విక్రయించేందుకు బసచేశారని సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు డీఎస్పీ, ఎస్ఐ, సిబ్బంది ఆ హోటల్లో తనిఖీలు నిర్వహించి నలుగుర్నీ అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగ బంగారం విక్రయించేందుకు వచ్చినట్లు నిర్థారించుకున్న అధికారులు వారితో బేరానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసి లక్షన్నరకు బేరం కుదుర్చుకుని వారిని వదిలి వేసినట్లు పోలీస్‌శాఖలోనే విమర్శలు గుప్పుమన్నాయి. సగానికి సగం.. హైదరాబాద్ కంట్రీ క్లబ్లో సభ్యత్వం పేరుతో లక్షల్లో డబ్బు చెల్లించి మోసపోయామంటూ ఫిబ్రవరిలో వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది మహిళలు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం కేసును సీసీఎస్‌కు బదిలీచేశారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ వెళ్లిన ఎస్ఐ క్లబ్ డెరైక్టర్లతో బేరం కుదుర్చుకొని లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఒక్కరినే నిందితుడిగా చూపించడం గమనార్హం! ఫిర్యాదుచేసిన తొమ్మిది మందికి డబ్బు తిరిగిచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. డీఎస్పీ సూచనల మేరకు ఎనిమిది మంది బాధితుల వద్దకు వెళ్లి వారు చెల్లించిన సొమ్ములో సగం చెల్లించి.. వారికి పూర్తిగా చెల్లించినట్లు హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది సహకారంతో ఒప్పంద పత్రాలు తీసుకున్నారు. మరో మహిళకు కూడా పూర్తిగా డబ్బు ముట్టినట్లు కోర్టులో తప్పుడు సమాధానం చెప్పారు. ఈ విధంగా పలు కేసుల్లో కూడా వారిద్దరూ తమదైన శైలిలో వ్యవహరించి లక్షల్లో డబ్బును నేరస్తులు, బాధితుల నుంచి వసూలు చేశారని ఐజీ, ఎస్పీలకు అందిన ఫిర్యాదుల్లో ఉన్నాయి. గుంటూరు గోల్డ్మార్కెట్లో ఎస్ఐ అనుచరుడైన ఓ హెడ్‌కానిస్టేబుల్ దొంగలను గుర్తించడం, వారిని ఎస్ఐ వద్దకు తీసుకువచ్చి బెదిరింపులకు దిగి బంగారం కాజేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వదిలేసిన నేరస్తులు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, భీమవరం, హైదరాబాద్‌ల్లో దొరికిన సందర్భాల్లో పోలీసు విచారణలో దొంగలించిన సొత్తు గుంటూరులోని క్రైమ్ ఎస్ఐకి అందజేశామని చెప్పినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇదంతా డీఎస్పీ కనుసన్నల్లో కొనసాగుతోందనే విమర్శలు బలంగా వినవస్తున్నాయి. -
653 మందికిఒకే పోలీస్
= వాస్తవానికి ప్రతి 500 మందికి ఒకరుండాలి = ఇతర మెట్రోలతో పోలిస్తే నగరంలో ఘోరం = భర్తీకి నిర్ణయం తీసుకున్నా అమలుకాని వైనం సాక్షి, సిటీబ్యూరో: నిబంధనల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక పోలీసులు (క్షేత్రస్థాయి సిబ్బంది) ఉండాలి. అయితే ప్రస్తుతం జంట కమిషనరేట్లలో ప్రతి 653 మందికీ ఒకరు మాత్రమే ఉంటున్నారు. ఫలితంగా శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ కష్టసాధ్యంగా మారుతోంది. ఇటీవల కాలంలో నగరం దాదాపు రెట్టింపు అయినా ఆ స్థాయిలో ఎంపికలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అనివార్య కారణాల నేపథ్యంలో కొన్నేళ్లుగా రిక్రూట్మెంట్స్ సైతం పక్కాగా జరగమపోవడమూ ఈ పరిస్థితిని దారితీసింది. ఉన్నతాధికారులు, పర్యవేక్షణ అధికారుల కంటే క్షేత్రస్థాయిలో కీలక ఉద్యోగులైన కానిస్టేబుల్ పోస్టుల్లోనే కొరత తీవ్రంగా ఉంది. పోలీసింగ్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, నిఘా, దర్యాప్తు తదితర అంశాల్లో ఎస్సైల పాత్ర చాలా కీలకం. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో జంట కమిషనరేట్లలో నైపుణ్యం కలిగిన ఎస్సైల లేమి తీవ్ర సమస్యగా మారింది. ఫలితంగానే ప్రతి చిన్న బందోబస్తుకూ బయటి నుంచి వచ్చే బలగాలు, ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా) ట్రైనీలపై ఆధారపడాల్సి వస్తోంది. కొన్నేళ్ల క్రితం కేటాయించిన సిబ్బందిలో దాదాపు 24 శాతం పోస్టులు ఖాళీగా ఉండిపోవడంతో మూడు షిప్టుల్లో (8 గంటల చొప్పున) పని చేయాల్సిన సిబ్బంది రెండు షిఫ్టుల్లో (12 గంటల చొప్పున) పని చేస్తున్నారు. దీంతో పని భారం పెరిగి, పనిలో నాణ్యత కొరవడుతోంది. ఫలితంగా సిబ్బంది ఆరోగ్యం పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతి విభాగంలోనూ అరకొరే... జంట కమిషనరేట్‌లోని ప్రతి విభాగంలోనూ సిబ్బంది కొరత ఉంది. హైదరాబాద్‌తో పోలీస్తే సైబరాబాద్‌లో పరిస్థితి మరింత ఘోరం. ఈ కమిషనరేట్ నగరం చుట్టూ విస్తరించి ఉండటంతో ఉన్న సిబ్బంది ఏ మూలకూ సరిపోవడం లేదు. శాంతి భద్రతలు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌బ్రాంచ్, సిటీ సెక్యూరిటీ వింగ్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఇలా ప్రతి విభాగంలోనూ కానిస్టేబుల్ నుంచి ఎస్సైల వరకు వివిధ హోదాల్లో సిబ్బంది కొరత ఉంది. వీరి తర్వాత అత్యంత కీలకమైనవి కానిస్టేబుల్ పోస్టులు. వీటిలోనూ అనేక ఖాళీలు ఉండటంతో పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని కొంత వరకు అధిగమించాలనే ఉద్దేశంతోనే రిటైర్డ్ పోలీసులనూ ప్రత్యేక పోలీసు అధికారులు (ఎస్పీఓ)లుగా తీసుకుంటున్నా... అ నివార్య కారణాల నేపథ్యంలో వీరిని కేవలం బందోబస్తు, భద్రత విధులకు మాత్రమే పరిమి తం కావడంతో పరిస్థితుల్లో మార్పు రాలేదు. చాలాకాలం అడ్డుపడిన ‘14 ఎఫ్’... రాష్ట్రంలో పరిస్థితిని సరాసరిన లెక్కేస్తే ప్రతి లక్ష జనాభాకు కేవలం 118 మంది పోలీసులు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నారు. ఇదే సిటీ విషయానికి వస్తే 256 మంది చొప్పున ఉన్నారు.రాష్ట్ర పోలీసు విభాగానికి కేటాయించిన సిబ్బంది 1.3 లక్షలు కాగా ప్రస్తుతం 97 వేలు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితుల్ని అధిగమించేందుకు కొన్నేళ్ల క్రితం వివిధ స్థాయిల్లో 35,831 మంది ఎంపికకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఇప్పటికి 12,891 పోస్టుల భర్తీ పూర్తి కాగా... మరో 16,323 పోస్టుల భర్తీ వివిధ దశల్లో ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎంపిక నుంచి సిటీ కమిషనరేట్‌కు ఒరిగింది ఏమీ లేదు. దీనికి ప్రధాన కారణం ఫ్రీజోన్ వివాదం. దీనిపై భిన్నవాదనలు వినిపిస్తుండటంతో రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. హైదరాబాద్ ఫ్రీజ్ కాదంటూ అసెంబ్లీలో తీర్మానం జరిగి, కేంద్ర ద్వారా ‘14 ఎఫ్’ను తొలగించడానికి చాలా కాలం పట్టింది. ఇది పూర్తయిన తరవాత ఈ ఏడాదే 2500 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సన్నాహాలు పూర్తి చేశారు. మనకన్నా ‘మెట్రో’లే మిన్న... దేశంలో ఉన్న ఇతర మెట్రో నగరాలతో జంట కమిషనరేట్లను పోలిస్తే మనం ఆఖరి స్థాయిలో ఉన్నామని స్పష్టమవుతోంది. ఐదు నగరాలకు ఢిల్లీ మెరుగైన స్థానంలో ఉండగా... హైదరాబాద్ మాత్రం అధ్వాన స్థితిలో ఉంది. జంట కమిషనరేట్ల పరిధిలో నివసించే సిటీ జనాభా దాదాపు 85 లక్షలు వరకు ఉంది. అయితే సాయుధ బలగాలు, ఇతర ప్రత్యేక విభాగాలను మినహాయించగా రెండు కమిషనరేట్లలోనూ అందుబాటులో ఉన్న క్షేత్ర స్థాయి సిబ్బంది మాత్రం 13 వేలు దాటట్లేదు. ఉన్న వారినీ అనునిత్యం బందోబస్తులు వెంటాడుతూ ఉంటున్నాయి. ఇతర మెట్రో నగరాలు, ఇక్కడి పరిస్థితి ఇలా...