హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నగర పోలీసులు సాధిస్తున్న సత్ఫలితాలపై ఎంపీ కవిత సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆమె నాంపల్లిలోని సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్)ను సందర్శించారు. ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న వివిధ రకాలైన నేరాల అదుపునకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న తీరును ఆమెకు డీజీపీ అనురాగ్ శర్మ వివరించారు. స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరును ఆమెకు స్వయంగా చూపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కవిత పోలీసు అధికారుల నుద్దేశించి మాట్లాడారు. పోలీసు శాఖ సాధిస్తున్న విజయాలను, తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.