సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌ | CBSE Board 12th Result 2020 Declared | Sakshi
Sakshi News home page

సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫ‌లితాలు

Published Mon, Jul 13 2020 2:45 PM | Last Updated on Mon, Jul 13 2020 3:04 PM

CBSE Board 12th Result 2020 Declared - Sakshi

న్యూఢిల్లీ: విద్యార్థులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌(సీబీఎస్ఈ) ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు వ‌చ్చేశాయి. సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను సోమ‌వారం అధికారులు విడుద‌ల చేశారు. ఈ ఏడాది 88.78 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. ఇది గ‌తేడాది క‌న్నా 5.38 శాతం ఎక్కువ‌గా కావ‌డం విశేషం. ఫ‌లితాల్లో త్రివేండ్ర‌మ్ 97.67 శాతంతో ప్ర‌భం‌జనం సాగించ‌గా ప‌ట్నా 74.57 శాతం ఉత్తీర్ణ‌త‌తో చివ‌రిస్థానంలో ఉంది. విద్యార్థులు cbse.nic.in సైట్‌లో లాగిన్ అయి ఫ‌లితాలు తెలుసుకోవ‌చ్చు. (సీబీఎస్‌ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు)

క‌రోనా వైర‌స్ వ్యాప్తి భ‌యంతో సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు అర్ధాంతరంగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. 10,12వ త‌ర‌గ‌తి విద్యార్ధి ఇప్ప‌టికే రాసిన ప‌రీక్ష‌ల్లో చూపిన అత్యుత్త‌మ ప్ర‌తిభ ఆధారంగానే ర‌ద్ద‌యిన ప‌రీక్ష‌ల స‌బ్జెక్టుల‌కు మార్కులు నిర్ణ‌యిస్తామ‌ని సీబీఎస్ఈ ప్ర‌క‌టించింది. మూడు స‌బ్జెక్టులు మాత్ర‌మే రాసిన వారికి రెండు సబ్జెక్టుల్లో మార్కులను బట్టి.. ఢిల్లీ అల్ల‌ర్ల కార‌ణంగా 12వ తరగతి ఒకటి, రెండు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికి... రాసిన సబ్జెక్టులు, ఇంటర్నల్‌/ప్రాక్టికల్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను నిర్ణయిస్తామ‌ని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేర‌కు నేడు సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. (సిలబస్‌ నుంచి పౌరసత్వం, నోట్లరద్దు కట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement