
సాక్షి, న్యూఢిల్లీ : పెండింగ్‌లో ఉన్న పది, పన్నెండో తరగతి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల తేదీలను మానవవనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ సోమవారం ప్రకటిస్తారు. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల తేదీలను సోమవారం వెల్లడిస్తామని మంత్రి ట్వీట్ చేశారు. పెండింగ్‌లో ఉన్న సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరుగుతాయని, ఇప్పటికే ముగిసిన పరీక్షలను తిరిగి నిర్వహించబోమని మంత్రి వివరణ ఇచ్చారు.
హెచ్‌ఆర్‌డీ మంత్రి పరీక్షల తేదీలను ప్రకటించనుండగా, సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో పరీక్షలకు సంబందించి పూర్తి వివరాలను పొందుపరుస్తారు. కాగా సీబీఎస్‌ఈ పెండింగ్ పరీక్షలు జులై 1 నుంచి జులై 15 మధ్య జరుగుతాయని గతంలో హెచ్‌ఆర్‌డీ మంత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్ధులకు తగినంత సమయం ఇచ్చేలా షెడ్యూల్‌ను ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment