న్యూఢిల్లీ: గూగుల్ సెర్చ్‌లో నేరుగా విద్యార్థులు పరీక్ష ఫలితాలు చూసుకునేందుకు వీలుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు సహా పరీక్షాసంబంధ సమాచారాన్ని ‘గూగుల్ సెర్చ్ పేజీ’లో చూడొచ్చు. దీంతో స్మార్ట్‌ఫోన్, డెస్క్‌టాప్‌లలో చాలా త్వరగా, భద్రమైన సమాచారాన్ని పొందొచ్చని గూగుల్ పేర్కొంది. గేట్, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, క్యాట్ వంటి పరీక్షలకు సంబంధించిన పరీక్ష నిర్వహణ, రిజిస్ట్రేషన్ తేదీలు, ముఖ్యమైన లింక్‌లుసహా ఇతర కీలకమైన సమాచారాన్ని గూగుల్ సెర్చ్ పేజీలో పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment