సీబీఎస్‌ఈ సిలబస్‌ హేతుబద్ధీకరణ  | CBSE Makes Changes In Next Academic Year Syllabus | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ సిలబస్‌ హేతుబద్ధీకరణ 

Published Mon, Apr 20 2020 7:20 AM | Last Updated on Mon, Apr 20 2020 7:20 AM

CBSE Makes Changes In Next Academic Year Syllabus - Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా క్లాసులను కోల్పోయిన విద్యార్థుల కోసం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ను హేతుబద్ధం చేసేందుకు సిద్ధమైంది. 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం రానున్న విద్యాసంవత్సరంలో ఈ మేరకు మార్పులకు అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలాన్ని, పర్యవసానాలను బోర్డు అంచనా వేస్తోంది. 1–5 తరగతులకు కొత్త కేలండర్‌ను నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్టీ) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ విధానాన్నే పై తరగతులకు కూడా వర్తించే దిశగా చర్యలు చేపడుతోంది. 1 నుంచి 8 తరగతులకు ఎన్సీఈఆర్టీ కొత్త విద్యా సంవత్సర కేలండర్‌ ను విడుదల చేసినట్లే సీబీఎస్‌ఈ కూడా 9 నుంచి 12 తరగతుల వారికి సిలబస్‌ను హేతుబద్ధం చేసే పనిలో ఉందని బోర్డులోని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. అయితే పరీక్షలు ఎప్పుడు ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టమని, కనీసం 10 రోజుల ముందే విద్యార్థులకు సమాచారం అందుతుందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement